" జీవితం పిరమిడ్ ధ్యానానికే అంకితం "

 

నా పేరు జగన్నాథం. మాది శివకోడు, రాజోలు మండలం, తూ||గో|| జిల్లా. నేను 2004 వ సంవత్సరంలో ధ్యానంలోకి ప్రవేశించాను. అప్పటి నుంచి విశ్వగురువు బ్రహ్మర్షి పత్రీజీ ఎక్కడ ధ్యాన యజ్ఞం ఏర్పాటు చేసినా అక్కడికి వెళ్ళి వారి దివ్య సందేశాలు విని చైతన్యం పొందుతున్నాను.

నేను ధ్యానంలో నాకున్న అనేక సమస్యలు పరిష్కరించుకున్నాను. ఇంతకు ముందు మా పెద్దబ్బాయి అనేక దుర్వ్యసనాలతో కూడి ఉండేవాడు .. మరి దాంతో నేను నా భార్య వాడి భవిష్యత్తు గురించి చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు క్రమం తప్పని ధ్యానసాధన వల్ల మా అబ్బాయి తన చెడు అలవాట్ల నుంచి బయటపడి " నెంబర్ 1 " గా తయారయ్యాడు ! రాజోలులో జరిగిన ధ్యానయజ్ఞానికి గురువర్యులు పత్రీజీని ఆహ్వానించడంలో, మరి ఆ యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించడంలో మొట్టమొదటివాడు; ప్రస్తుతం వాడు నాకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా ఉంటూ చక్కగా ధ్యాన ప్రచారం కూడా చేసుకుంటున్నాడు!

నేను 10'X10' పిరమిడ్ నిర్మాణం చేయగా ఆ పిరమిడ్‌కు పత్రీజీ " శ్రీ విశ్వసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రం " గా నామకరణం చేసి తమ దివ్య హస్తాలతో దానికి ప్రాణప్రతిష్ఠ చేసి మా ధ్యానులందరినీ దివ్యత్వంతో ఆనందింప చేసారు. పిరమిడ్ ప్రారంభోత్సవ సందర్భంలో పత్రీజీ అమాంతంగా తన బాహువులలో బంధించి నన్ను పైకెత్తి వేయగా .. ఆ సమయంలో నేను విశ్వాత్మ అయిన నా తండ్రి బాహువులలో పసిపిల్ల వాడిగా ఉన్నట్లు తన్మయత్వం చెందాను. ఆ సమయంలో గురువుగారు " ఇన్నాళ్ళకు చిక్కినావురా " అని నన్ను ఆశీర్వదించగా నేనెంతో సంతోషపడ్డాను.

 

K. జగన్నాథం
శివకోడు, తూర్పు గోదావరి జిల్లా

సెల్ : +91 92909 78318

Go to top