" బేబీ నార్మల్ పొజిషన్‌కు వచ్చేసింది "

 

నా పేరు కళ్యాణి. నేను 2006 సెప్టెంబర్ నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానంలోకి వచ్చాక .. నేను చిన్నప్పటి నుంచి వెతుకుతూన్న జ్ఞానాన్నీ, మరి ఒక తృప్తితో కూడిన ఆనందాన్నీ పొందాను. ధ్యానం చేసిన మొదటి సిట్టింగ్‌లోనే నాకే తెలియని తృప్తి, ఆనందం నాకు కలగడంతో .. కొద్ది సమయంలోనే నేను ఒత్తిడి నుంచి విముక్తి పొందాను. అన్నాళ్ళు పూజలు, సోత్రాలు, జపాలు చేసినా నాకు " ఇంకా ఏదో ఉంది మనం చేయవలసింది " అనిపించేది కానీ ధ్యానంలో ఫస్ట్ సిట్టింగ్‌‍లోనే నా అంతరంగం లోంచి " ఇదే నువ్వు చేయవలసింది " అని వినిపించింది.

ధ్యానంలోకి రాకముందు నాకు దంతాల ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ వుండేవి .. మరి నేను అతిగా నిద్రపోయేదాన్ని. ధ్యానం చేస్తూ ఉంటే ఇవన్నీ ఎప్పుడు పోయాయో నాకే తెలియదు. ధ్యానంలో నా మొదటి అనుభవం.. ఎన్ని పూజలూ, స్తోత్రాలూ, జపాలూ చేసినా దొరకని ఆ జగన్మాత దర్శనం ధ్యానంలో నేను పొందాను. ధ్యాన సాధన పెంచేకొద్దీ నా అంతరంగంలోంచి " ఓంకారం వినబడడం ", అలాగే " ఆస్ట్రల్ ట్రావెల్ చేయటం ", " చనిపోయిన మా పూర్వీకులతో మాట్లాడటం " వంటి ఎన్నో అనుభవాలను పొందడం జరిగింది!

" ఈ సారి నా ద్వారా ఒక ఉన్నతమైన ఆత్మ జన్మ తీసుకుంటుంది " అని ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా నాకు పదే పదే అంతరంగంలో అనిపించింది. అలాగే నేను ప్రకృతిని అడిగాను. " ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి వైపు తీసుకెళ్ళే ఒక బుద్ధుడు లాంటి, ఒక యేసుక్రీస్తు లాంటి .. పత్రీజీ లాంటి ఒక ఉన్నతమైన ఆత్మ నా ద్వారా భూమి మీదకి రావాలి " అని. ఒక రోజు నేను ధ్యానంలో ఉన్నప్పుడు రెండు ఆత్మలు " ‘ నేను వస్తాను ’ అంటే ‘ నేను వస్తాను ’ " అంటూ నా దగ్గరకు వస్తూన్నట్టుగా చూసాను. ధ్యానం చేసిన ప్రతిసారీ సూర్యుడు కనబడటం, విపరీతమైన వైబ్రేషన్స్ రావటం జరిగింది.

ఈ రోజులలో గర్భవతులకు డాక్టర్స్ ఎన్నో మందులు వ్రాసి " తప్పక వాడాలి " అంటున్నారు. అటువంటివది ధ్యానం చేయటం వల్ల నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోలేదు పైగా నాకు నార్మల్ డెలివరీ జరిగింది ! ఒకసారి చెకప్‌కు వెళ్ళినప్పుడు డాక్టర్ గారు " లోపల బేబీ పొజిషన్ తిరగబడి ఉంది .. కనుక ఆపరేషన్ అవసరం పడుతుంది " అని చెప్పారు. నేను, మా అమ్మగారు సంకల్పించుకుని ధ్యానంలో కూర్చున్నప్పుడు లోపల బేబీ మళ్ళీ తిరగబడినట్లు అనిపించింది. తరువాత వారం చెకప్‌కి వెళ్ళినప్పుడు " బేబీ నార్మల్ పొజిషన్‌కు వచ్చేసింది " అని చెప్పారు డాక్టర్ !! 9 వ నెలలో నాకు చికెన్‌పాక్స్ వచ్చింది కానీ దాన్ని కూడా నేను మెడిటేషన్ ద్వారా తగ్గించుకున్నాను.

" మాకు ఇది వరకు ఒక పాప ఉంది కనుక ఈ సారి అబ్బాయి పుడతాడు " అనుకునేదాన్ని. ఒకరోజు ధ్యానంలో మాస్టర్స్ నన్ను " నీకు కుమారుడు కావాలా ? సూర్యుడు కావాలా ? " అని అడగ్గా నేను టక్కుమని " సూర్యుడు కావాలి " అని చెప్పాను. వెంటనే ధ్యానం నుండి బయటికి వచ్చాక " ఇదేంటి నేను అలా అడిగాను " అనిపించింది. తరువాత " నేను అడిగింది కరక్టే " అనిపించింది. మేము " మా నాన్నగారు పనిచేస్తున్న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని చిత్తరంజన్‌లో క్లాసు పెట్టాలి " అనుకునేవాళ్ళం, కానీ ఎప్పుడూ వాయిదాపడేది. 7వ నెలలో మా నాన్న గారు నన్ను డెలివరీకి చిత్తరంజన్ తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు హిందీలో పాంప్లెట్స్ ప్రింట్ చేయించి మరి మేము వాటితో చిత్తరంజన్ వెళ్ళగానే అక్కడ ఇంటి వాతావరణం ఎంతో మారిపోయింది. అందరూ ధ్యానం చేయటం, స్పిరిచ్యువల్ బుక్స్ చదవటం, పత్రీసార్ కేసెట్స్ వినటం జరిగింది ! ధ్యానం చేసిన ప్రతిసారి ఎనర్జీ తరంగాలు నా లోంచి బయటికి వెళ్ళేవి !

మా పాప పుట్టాక బారసాల పేరుపై చిత్తరంజన్‌లో ధ్యానం క్లాసు జరిగింది. సైంటిస్ట్ శ్రీ A. నాగేశ్వరరావు గారు (హైదరాబాద్) అందరి చేత ధ్యానం చేయించి అద్భుతమైన క్లాసు హిందీ, ఇంగ్లీష్, తెలుగులలో ఇచ్చారు, మరి అందులో 100 మంది పాల్గొన్నారు ! ఈ భూమి మీదకు రాకముందే చిత్తరంజన్‌లో అందరి శ్రేయస్సు కోసం ఈ ధ్యానాన్ని పరిచయం చేసిన నాకు పుట్టిన విశ్వాత్మకు పత్రీసార్ అత్తిలిలో " శ్రేయ " అని నామకరణం చేయటం జరిగింది ! ఈ ధ్యానాన్ని అందించిన పత్రిసార్‌కు నా కృతజ్ఞతలు!

 

కళ్యాణి
వరిగేడు, పశ్చిమ గోదావరి జిల్లా
సెల్ : +91 99890 76225

Go to top