" తుది శ్వాస వరకు ధ్యాన ప్రచారమే .. కర్తవ్యంగా "

 

స్వతంత్ర కుమారి గారు గుడివాడ పాలటెక్నిక్ కాలేజిలో లెక్చరర్‌గా పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ పొంది, ధ్యాన ప్రచారం చేస్తూ గుడివాడ పట్టణాని ధ్యానమయం చేసారు. " ధ్యాన విద్యార్థి పి-యం-ఆర్ " ప్రాజెక్ట్‌లో భాగంగా ఎన్నెన్నో కాలేజిల్లో, పాఠశాలల్లో వీరు విద్యార్థులకు ధ్యానం నేర్పించారు.

విద్యార్థులకు ధ్యానం, ధ్యాన అధ్యాపకుడు, ఆత్మవిజ్ఞాన పుష్పాలు, యోగతంత్ర, ఆధ్యాత్మికత అనేక ఆత్మజ్ఞాన పుస్తకాలను రచించారు. తాను నమ్ముకున్న సత్యాన్ని వీడక చివరి వరకు ధ్యాన ప్రచారంలో మునిగితేలిన ఈ పిరమిడ్ మాస్టర్ 29.9.2010 నాడు హాయిగా సత్సంగంలో ధ్యానులతో మాట్లాడుతూనే తమ తుది శ్వాస విడిచారు.

 

రాజకుమారి
ప్రెసిడెంట్
గుడివాడ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ

Go to top