" ధ్యానం .. కామధేనువు, కల్పవృక్షం వంటిది "

 

నా పేరు సుకన్య. ధ్యానంలోకి రాక ముందు నేను తలనొప్పి మరి " వెరికోస్ వెయిన్స్ " సమస్యలతో సతమతమవుతూ చిన్న విషయానికి కూడా బాధపడేదాన్ని. " వెరికోస్ వెయిన్స్ " సమస్య నేను గర్భవతిగా వున్నప్పుడు వచ్చింది. నరాల డాక్టర్స్‌కు కూడా చూపిస్తే ఎక్కువ సేపు నిలబడకుండా కూర్చుని వుండమని చెప్పేవాళ్ళు. టాబ్లెట్స్ తీసుకుంటే అప్పటికి తగ్గేది కానీ మళ్ళీ నొప్పితో బాధపడేదాన్ని; ఇలా పది సంవత్సరాలు బాధపడ్డాను.

" పిరమిడ్ ధ్యానం ’ గురించి తెలుసుకుని .. ధ్యానం చేస్తున్నప్పటి నుంచి నేను చాలా సంతోషంగా వున్నాను. నా బాధలన్నీ మెల్లిమెల్లిగా తగ్గడం మొదలైంది. తలనొప్పి, " వెరికోస్ వెయిన్స్ " సమస్య ధ్యానంతో పోగొట్టుకున్నాను!

శ్రీశైలం ధ్యానమహాయజ్ఞంలో నేను ధ్యానస్థితిలో కూర్చున్నప్పుడు ఈశ్వరుడే నాతో కూర్చుని ధ్యానం చేస్తున్నస్థితిలో కూర్చున్నప్పుడు ఈశ్వరుడే నాతో కూర్చుని ధ్యానం చేస్తున్న స్థితిని చూసుకున్నాను.

మా ఇంట్లో రెండు గంటలు ధ్యానం చేసినప్పుడు బుద్ధుడు, జీసస్ మరి ఎందరో మాస్టర్స్‌ను చూసిన అనుభవం కలిగింది. ఈ ధ్యానంలో ఇంత మహత్యం వుందని తెలుసుకుని అప్పటి నుంచి ఇప్పటివరకు రోజూ ధ్యానం చేస్తూ, ఎందరికో ధ్యానం గురించి చెప్పుతూ .. ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

ఈ ధ్యానం ద్వారా ఎందరికో ఆరోగ్య భాగ్యం కలిగించిన మన పత్రీజీ గారికి శతకోటి ధ్యాన వందనాలు!

 

సుకన్య
ಬಳ್ಳಾರಿ
సెల్ : +91 96630 29288

Go to top