" ధ్యానమే ఆరోగ్యం "

 

నా పేరు రామారావు. నేను 2007 జూన్ నెలలో ధ్యానం ద్వారా జబ్బులు తగ్గుతాయని విని .. అప్పటి నుంచి ప్రతిరోజూ ధ్యానం చేస్తున్నాను. ధ్యానం ద్వారా శరీరపరమైన నాకు జబ్బులు నయం కావడంతో పాటు మనశ్శాంతి కూడా కలిగి ప్రశాంతంగా, ఆనందంగా ఉంటున్నాను. జీవితానికి సంబంధించిన అన్ని భాదలకూ అన్ని కష్టనష్టాలకూ మనమే కారణం కనుక .. ధ్యానం ద్వారా ఆనందంగా ఎలా వుండవచ్చో తెలుస్తుంది.

" ఎవరికి వారే గురువులు, ఎవరివారే డాక్టర్లు ! నోటిలోని మాట నుదుట మీద వ్రాత! అప్పో దీపో భవ! ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు ! " అనే వాక్యాలు నాకు ఎంతో బాగా నచ్చాయి. " ఎవరి జీవితం వారి చేతులోనే ఉంది " అని పత్రీజీ చెప్పిన వాక్యాలు నన్ను ఎంతగానో ఆకర్షించాయి.

నాకు 2007 జూన్ నెలకు ముందు వెన్నుపూస నొప్పి ఉండేది మరి దానికోసం ఎన్నో హాస్పిటల్స్‌కు వెళ్ళాను కానీ నాకు బాధ తగ్గలేదు. ధ్యానంలోకి వచ్చిన నెలరోజులకు అది పూర్తిగా తగ్గిపోయి ఇక అప్పటి నుంచి ప్రతిరోజూ నేను ధ్యానంతో పాటు ధ్యానప్రచారం కూడా చేస్తున్నాను. " ధ్యానం ద్వారా ప్రతి ఒక్కరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండవచ్చు " అన్నది పరమ సత్యం.

 

R. రామారావు
ప్రకాశం జిల్లా
సెల్ : +91 94940 21206

Go to top