" నా భార్యకు ఆత్మీయ వీడ్కోలు "

 

నా పేరు నాగేశ్వరరావు. నేను సంవత్సరం క్రితం ధ్యానంలోకి వచ్చి, ధ్యాన ప్రచారం నిర్వ్వహిస్తున్నాను. ప్రతి ధ్యాన కార్యక్రమంలో మా కుటుంబం అంతా పాల్గొంటూ శ్రీశైలం మరి బెంగళూరు కూడా వెళ్ళి వచ్చాము.

ఇల్లందులో " ఇంటింటా ధ్యాన కార్యక్రమం " మొదలుపెట్టి 50 రోజులపాటు 12,000 కరపత్రాలు ఇంటింటికీ పంచాము. ప్రతి రోజూ ఉదయం 10 మందితో కలిసి 2 గంటలపాటు ప్రచారం చేసి .. మరి సాయంత్రం ఇదే ఏరియాలో ధ్యానం క్లాసు నిర్వహించడం చేసాము. దేవాలయాల్లో, చర్చీల్లో, మసీద్లులో కూడా ధ్యానం క్లాసులు నిర్వహించాము.

నా భార్య " శ్రీమతి వెంకటకుమారి " నాకు అన్ని ధ్యాన కార్యక్రమాలలో సహకరిస్తూ వచ్చారు .. మరి గత నెల 24 వ తేదీ రాత్రి గం. 8.40 ని|| లకు తన శరీరాన్ని వదిలిపెట్టారు. ఆమె దేహ త్యాగం చేసిన తరువాత .. కర్మ కాండలూ, బ్రాహ్మణులూ, మంత్రాలూ ఏమీ లేకుండానే మా కుటుంబమంతా ఆమెకు ధ్యానంలో ప్రశాంత వీడ్కోలు పలికాము. 11 వ రోజు కూడా ధ్యానులతో సహా కొద్ది మంది బంధువులను పిలిచి .. ఏ మాత్రం హడావడి లేకుండా .. ఒక పుట్టిన రోజో మరేదో సంబరమో జరుపుకున్నట్లుగా కార్యక్రమం జరిపి .. మరి ఆ " ధ్యానాత్మ " కు అంతిమంగా ఆత్మీయ వీడ్కోలు ఇచ్చాము. ఇలా చేయడం వల్ల మా పిల్లలు కానీ దుఃఖం అన్నది ఏ మాత్రం పొందలేదు సరికదా ఎంతో ఆత్మనిబ్బరంతో .. కార్యక్రమం ముగించాము. మా బంధువులు కూడా ఇంత ప్రశాంతంగా జరిపిన కార్యక్రమాన్ని అభినందించారు.


మరుసటి రోజు నుంచే నా కార్యక్రమాలు చూసుకుంటూ ధ్యాన ప్రచారం చేస్తున్నాను. అక్టోబర్ 9 వ తేదీన అమరావతిలో జరిగిన కార్యక్రమానికి వచ్చినప్పుడు బ్రహ్మర్షిపత్రీజీ గారిని కలిసి విషయం చెప్పగా .. " కర్మకాండలు కాదు, ధ్యానకాండలు అవసరం " అని వారు సందేశమిచ్చారు. నేను అదే చేసాను. ముందు ముందు నా జీవితమంతా ధ్యాన ప్రచారానికి ఉపయోగిస్తూ ధ్యానం చేస్తూ ప్రాణం వున్నంతకాలం విజయవంతంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తాను.

 

T. నాగేశ్వర రావు
ఇల్లందు, ఖమ్మం జిల్లా
సెల్ : +91 98660 62703

Go to top