" ధ్యాన మూలం ఇదం ప్రకృతి "

 

నిశితంగా గమనిస్తే ప్రకితితోపాటు అందులోని పశుపక్ష్యాదులు సైతం ధ్యానస్థితిలో ఉండటం మనకు కనిపిస్తుంది. నిశ్చలమైన, క్రమబద్ధమైన పద్ధతిలో ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, మరి అలాగే రిథమిక్‌గా వినిపించే అలల సవ్వడిలో, కెరటాల కదలికలో సముద్రాలు, నదీనదాలు ఒక ధ్యానస్థితిలో వుంటాయి. ఇలా ఒక క్రమపద్ధతిలో నిరంతరం జరిగే ఏ ప్రక్రియ అయినా ధ్యానమే !

కరెంట్ వైర్ల మీద, చెట్ల కొమ్మల మీద పక్షులు గంటలకొద్దీ నిద్రపోతున్నట్లు కూర్చుంటాయి ! కానీ .. ఏ మాత్రం శబ్దమైనా అని కదులుతాయి .. అంటే అత్యంత ఎరుకతో కూడిన ధ్యానంలో అవి వున్నాయని అర్థం ! గడ్డి నెమరవేస్తూ ఆరమోడ్పు కన్నులతో ప్రశాంతంగా కూర్చున్న పశువులు సైతం ధ్యానస్థితిలో ఉన్నట్లే అనిపిస్తుంది ! నోరులేని ఆ జంతువులకు ప్రత్యేకంగా ధ్యానమవసరం లేదు కనుక తమ సహజస్థితిలోనే వుంటూ అవి తమకు ఉన్నతస్థితులు కల్పించుకుని మౌనంగా ఆ సృష్టికర్తను వేడుకుంటాన్నాయి.

ఒక వృక్షం యొక్క వ్రేళ్ళు భూమిలో వుండి మూలాధార చక్రాన్ని సూచిస్తాయి. కాండం ద్వారా పైకి పోయే నీరు స్వాధిష్టానమైతే, మధ్యభాగం మణిపూరకం. కొమ్మల మధ్య భాగం హృదయస్థానం అనాహతం అయితే పుష్పానికి ఉండే కాడ ఆజ్ఞాచక్రం మరి చివరగా వికసించే పుష్పం సహస్రారం. ఇలా చెట్లు కూడా ధ్యానస్థితిలో ఉన్నాయనటానికి అదే నిదర్శనం. ఈ విధంగా నోరులేని జీవరాశి అంతా ఎల్లప్పుడూ ధ్యాన స్థితిలో వుంటూంటే మానసికంగా ఎదిగిన మనం మాత్రం ధ్యానానికి చాలా తక్కువ కాలాన్ని ఉపయోగిస్తున్నాం!

 

G.విజయలక్ష్మి
హైదరాబాద్
సెల్ : +91 98852 14997

Go to top