" క్యాన్సర్‌ను సంపూర్ణంగా తగ్గించుకున్నాను "

 

నా పేరు కళ్యాణి. మా స్వంత ఊరు మచలీపట్నం. నేను ధ్యానంలోకి అడుగుపెట్టి రెండు సంవత్సరాలు అయ్యింది. అంతకుముందు నేనొక బ్యూటీపార్లర్‌ని నిర్వహిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాను. భర్త, ఒకబాబు, తో అందమైన కుటుంబం మాది. అలాంటిది ఒకరోజు అకస్మాత్తుగా నా పొట్టభాగం అంతా గట్టిగా అయిపోయి .. నొప్పితో విపరీతంగా పెరగడం జరిగింది. ఎంతో ఆందోళనపడి డాక్టర్ల దగ్గరికి వెళితే వాళ్ళు రకరకాల పరీక్షలు చేసి నాకు " ఒవేరియన్ క్యాన్సర్ " అనీ, " అది కూడా శరీరంలోని చాలా భాగాల్లో వ్యాప్తిచెందడం వల్ల చివరి స్టేజీలోకి వచ్చేసి బ్రతకడం కష్టం " అనీ, " మహా అయితే రెండు మూడు నెలలు బ్రతకవచ్చు " అనీ చెప్పారు. ఇంతా చేసి ఇదంతా కేవలం పదిహేనురోజుల వ్యవధిలోనే జరిగి అంతకుముందు ఎంతో ఆనందంగా వున్న మా కుటుంబంలో తీవ్రమైన విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.

" ఏది జరిగినా మాదే బాధ్యత " అని నా భర్త మరి ఇతర కుటుంబసభ్యులతో సంతకాలు తీసుకున్న డాక్టర్స్ నాకు ట్రీట్‌మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు. రకరకాల ఆపరేషన్లతో, మందులతో, థెరపీలతో నా శరీరాన్నంతా కుళ్ళబొడిచేసారు. దాంతో నేనొక జీవచ్ఛవంలా మారిపోయాను. అంతకుముందు బ్యూటీ పార్లర్‌లో ఎందరెందరినో అందంగా ముస్తాబుచేసి వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నేను మందుల ప్రభావంతో కనుబొమలతో సహా తలమీద జుట్టంతా వూడిపోయి నా గదిలోంచి అద్దం కూడా తీసివేయించుకుని నా దుస్థితికి ఎంతో దుఃఖపడేదాన్ని. దాంతో నా మీద నాకే ఎంతో అసహ్యం పెరిగిపోయింది.

క్రమంగా మాట పడిపోయి ప్రక్కమీంచి కూడా లేవలేని స్థితికి చేరుకున్నాను. ఇదంతా కూడా డాక్టర్‌లు దేవుని మీద భారం వేసి ట్రీట్‌మెంట్ ఇస్తూన్నా .. మరి అందుకు లక్షలు, లక్షలు ఖర్చవుతూన్నా కూడా జరుగుతూనే వుంది. చివరికి ఇక లాభం లేదని డాక్టర్‌లు కూడా చేతులెత్తేసి .. " ఇంటికి తీసుకుని వెళ్ళండి " అన్నారు. ఇక అప్పుడు మా తమ్ముడు, మరదలు గుడివాడ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాస్, వెంకటలక్ష్మిలు వాళ్ళ ఇంటిపై అప్పటికప్పుడు ఒక వారంలో రూఫ్‌టాఫ్ పిరమిడ్ కట్టించి నన్ను అందులో పడుకోబెట్టి నా భర్తతో సహా అందరూ కలిసి సామూహిక ధ్యానం చేయడం మొదలుపెట్టారు.

అప్పటిదాకా అచేతనంగా వున్న నాలో క్రమంగా కదలికలు ప్రారంభమయ్యాయి! మెల్లమెల్లగా శరీరం స్వస్థత చెందుతూ వుండగా ఒకరోజు ధ్యానంలో పత్రీజీ వచ్చి నా తలపై నిమురుతూన్నట్లుగా .. అనుభూతి చెందాను! ఎందరెందరో సూక్ష్మలోకపు మాస్టర్లు వాళ్ళ వాళ్ళ ఎనర్జీలతో నా శరీరాన్ని స్వస్థతపరచారు ! క్రమంగా నేను కోలుకుని ఆరునెలల వ్యవధిలో సంపూర్ణ ఆరోగ్యవంతురాలిని అయ్యాను ! " నేను ఆరోగ్యవంతురాలిగా కాగానే నా జీవితాన్ని ధ్యానప్రచారానికే అంకితం చేస్తాను " అని మాస్టర్లకు మరి పరమగురువు పత్రీజీకి కూడా ధ్యానంలో మాట ఇచ్చాను. ధ్యానంతో పూర్తి ఆరోగ్యవంతురాలిగా అయిన తరువాత కుటుంబంతో సహా హైదరాబాద్‌కు తరలివచ్చి దిల్‌సుఖ్‌నగర్ మారుతీనగర్‌లో ఒక మినీ సూపర్‌మార్కెట్‌ని ఏర్పాటు చేసుకుని వుంటున్నాము.

శ్రీశైలం ధ్యానమహాయజ్ఞంలో ధ్యానం చేస్తూన్నప్పుడు .. పత్రీజీలో నాకు బాబా కనిపించి నా కర్తవ్యాన్ని గుర్తుచేసారు. అప్పుడు నేను "ఇక క్షణకాలం కూడా వృధా చేయకుండా ధ్యానప్రచారం చేస్తాను" అని నిర్ణయం తీసుకుని .. హైదరాబాద్ తిరిగివస్తూనే ధ్యానప్రచారం మొదలుపెట్టాను. " మాట మీద ధ్యాస " వుంచి ధ్యానప్రచారం మొదలుపెట్టిన కొద్దిరోజులకే నా సమస్యలు తగ్గుముఖం పట్టసాగాయి. ఇందుకు స్వాధ్యాయం కూడా నాకు ఎంతో సహాయం చేసింది. డాక్టర్స్ మందులు రాసి ఇస్తే వాడినట్లుగా ధ్యానంతో పాటు రోజుకో పుస్తకం చదువుతూ అందులో నేనేం నేర్చుకున్నానో ఒక నోట్స్‌లా క్రమం తప్పకుండా వ్రాసి ఒక 40 రోజుల పాటు "స్వాధ్యాయయోగి" గా మారిపోయాను. దాంతో నాకు నా శరీరం పట్ల వున్న భయంతో కూడిన ధ్యాస కాస్త ప్రక్కకు తొలగి ధ్యానంలో వచ్చిన విశ్వశక్తితో నా శరీరమంతా స్వస్థత చెందింది.

సంపూర్ణ ఆరోగ్యంతో ధ్యానప్రచారం చేసుకుంటున్న నేను జూలై 15 వ తేదీ L.B.నగర్ MNR ఫంక్షన్ హాల్‌లో " ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం " ప్రాజెక్ట్ ఆవిష్కరణ సమయంలో బ్రహ్మర్షి పత్రీజీ సమక్షంలో MLA శ్రీ D. సుధీర్‌రెడ్డి గారి చేతులమీదుగా ధ్యాన ఆరోగ్య భాగ్యనగరం పిరమిడ్ కార్పొరేటర్‌గా ‘కిట్’ ని అందుకున్నప్పుడు చాలా సంతోషపడ్డాను! ఇలా నిజమైన భాగ్యాన్ని మనకందిస్తోన్న ధ్యానాన్ని మనందరికీ అందుబాటులోకి తెచ్చిన బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి ధ్యానాభివందనాలు.

 

A.కళ్యాణి
మచలీపట్నం
సెల్ : +91 99499 40400

Go to top