" బీదవారికి ధ్యానం ఒక వరదాయిని "

 

నా పేరు వెంకన్నదొర. మాది తూర్పుగోదావరి జిల్లా రావుపాలెం దగ్గర గోపాలపురం. నా కుమారుడు 29 సంవత్సరాల వయస్సులో ఒకటిన్నర సంవత్సరం క్రితం చనిపోయాడు. ఆ మనోవ్యధతో నాకు ఆరోగ్యం సరిగ్గా లేదు. షుఘర్, B.P.. హార్ట్, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఎన్ని అల్లోపతి మందులు వాడినా ప్రయోజనం లేకుండా ఎంతో వేదనను అనుభవిస్తున్నాను. సంవత్సరం క్రితం మే నెలలో " ఈతకోట క్రిష్ణవేణి మేడమ్ " గారి ద్వారా ధ్యానం నేర్చుకుని పిరమిడ్‌లో ధ్యానం చేస్తున్నాను.

2010 బుద్ధపౌర్ణమికి బెంగళూరు పిరమిడ్ వ్యాలీకి వచ్చాం. ఆర్థికంగా వెనుకబడినవారం అనటం వలన " వైశాఖీ ఫ్రీ డార్మెటరీ " విశాఖపట్నం సీతమ్మధార సెంటర్ వారు నిర్మించిన దానిలో మాకు ఉచితంగా వసతి కల్పించారు. ప్రతిరోజూ పదిగంటలు ధ్యానం చేస్తున్నాం. పదిహేను రోజులకి ఆరోగ్యం బాగా కుదుటపడింది. మా జీవితాల్లోజరిగిన విషాద సంఘటనల నుంచి మెల్లమెల్లగా స్వాంతన పొందుతూ మా దుఃఖం నుంచి బయటపడుతున్నాం. పిరమిడ్ వ్యాలీలో ఎక్కడ కూర్చుని ధ్యానం చేస్తున్నా ప్రశాంతత కలుగుతోంది. మా వంటి బీదవారికి ఇలా ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు ఏర్పాటుచేస్తూ ధ్యానం నేర్పిస్తోన్న పత్రీజీకి, మరి ట్రస్ట్ వారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు.

 

B.వెంకన్నదొర
గోపాలపురం
తూర్పుగోదావరి జిల్లా

Go to top