" ధ్యానం ద్వారా సర్వ వ్యసనాల నుంచి బయటపడ్డాను "

 

నా పేరు లక్ష్మీనర్సయ్య; వయస్సు 55 సంవత్సరాలు. నేను 20-8-2005 రోజున హైదరాబాద్ పిరమిడ్ మాస్టర్ T.శ్రీనివాసరావు గారి ద్వారా ధ్యాన ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ధ్యానంలోకి రాకముందు .. నాకు ఎన్నో శారీరక మానసిక సమస్యలు వుండేవి. వీటన్నిటినీ మర్చిపోవడానికి త్రాగుడుకు అలవాటుపడి .. దాంతోపాటే విపరీతంగా మాంసాహారం తింటూండేవాడిని. జీతమంతా త్రాగుడుకే సరిపోయేది. దానికి తోడు B.P., పక్షవాతాలకు కూడా గురికావడంతో నా బ్రతుకు మరీ నరకప్రాయమైపోయింది. మందుకూ, మందులకీ నా సంపాదనంతా ఖర్చువుతూండేది. కుటుంబసభ్యులతో పాటు, చుట్టుప్రక్కలవాళ్ళతో కూడా ప్రతి ఇన్న విషయానికీ గొడవపడుతూ .. మా వీధిలోనే నేనొక దుర్మార్గుడిలా తయారయ్యాను.

ధ్యానంలోకి వచ్చిన తరువాత క్రమక్రమంగా నా ప్రవర్తనలో మార్పు రాసాగింది. చక్కటి పుస్తకాలు చదవటం అలవాటు చేసుకున్నాను. పక్షవాతం కారణంగా .. అవకరంగా తయారైన నా శరీర భాగాలన్నీ విశ్వశక్తితో సరిచేయబడి నా శారీరక అనారోగ్యాలన్నీ మటుమాయం అయిపోయాయి. ధ్యానం ద్వారా సర్వ వ్యసనాల నుంచి బయటపడ్డాను. " జీవితాంతం తప్పనిసరిగా వాడాల్సిందే " అంటూ డాక్టర్లు చెప్పిన మందులన్నింటికీ " గుడ్‌బై " చెప్పేసాను. అంతకుముందు వ్యసనాల ఊబిలో కూరుకుపోయి " అదే ఆనందం " అనుకున్న నేను ధ్యానంలో మరి ధ్యాన ప్రచారంలో వున్న అసలు ఆనందాన్ని రుచి చూసాక ఇక క్షణకాలం కూడా వృధా చేయకుండా ధ్యానప్రచారం చేస్తున్నాను.

నాలో వచ్చిన ఈ మార్పుకి ఎంతో సంతోషపడ్డ నా శ్రీమతి జయలక్ష్మి మరి నా పిల్లలు లత, రఘు, కిరణ్‌లు కూడా ధ్యానంలోకి వచ్చి ఇంట్లో అందరం సామూహిక ధ్యానం చేయడం మొదలుపెట్టాము. మరి అందరం శుద్ధ శాకాహారుల్లా మారిపోయాము.

ఏవేవో మూర్ఖపు ఆలోచనల వల్ల వచ్చిన కారణాలతో అంతకుమునుపు బ్రతికివున్నప్పుడు నేను బాధపెట్టిన మా తల్లిదండ్రుల ఆత్మలకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పి మా అమ్మ పేరు మీద మా ఇంట్లోనే 4'X4' పిరమిడ్‌తో " శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యానకేంద్రాన్ని " స్థాపించి మా ఇంటి చుట్టుప్రక్కల వారందరికీ ధ్యానం నేర్పిస్తున్నాను. అంతకుముందు వీధిలోకి వచ్చానంటే చాలు ఎవరితోనో ఒకరితో ఏదో ఒక కారణానికి గొడవపడే నేను ఇప్పుడు ప్రతి ఇంటికీ వెళ్ళి ధ్యానం గురించీ .. ధ్యానం వల్ల కలిగే లాభాల గురించీ వివరించి వాళ్ళను బ్రతిమలాడి మరీ మా ఇంటికి తీసుకునివచ్చి పిరమిడ్ క్రింద ధ్యానం చేయిస్తున్నాను. 11 రోజుల పాటు మా కేంద్రంలో నిర్వహించిన ఉచిత ధ్యాన శిక్షణా కార్యక్రమానికి ఎందరెందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ వచ్చి వారి వారి జ్ఞానాన్నంతా మా వీధి వాళ్ళందరితో పంచుకున్నారు. ఇప్పుడు మా కాలనీలో అందరికీ నేనొక బుద్ధివున్న స్నేహితుడిని. ఎవరికైనా చిన్న సమస్య వస్తే సరి .. సరాసరి వాళ్ళు మా ఇంటికే వస్తున్నారు.

ధ్యానంలోకి రాకముందు .. మరి వచ్చిన తరువాత నాలో భూమికీ .. ఆకాశానికీ వున్నంత మార్పు వచ్చింది. ఇప్పుడసలు " ధ్యానం " అన్న పేరు వినగానే నా మనస్సంతా ఆనందంతో నిండిపోతుంది.

నాలాంటి ఎంతోమందిలో ఇంత గొప్ప మార్పును తీసుకునిరాగలిగే ధ్యానాన్ని మనకు అందుబాటులోకి తెచ్చిన జగద్గురువు బ్రహ్మర్షి పత్రీజీకి నా కృతజ్ఞతలు. ఆయన ఒక అనంత శక్తిస్వరూపుడు .. మరి మనందరితో కలిసి తిరుగుతూన్న .. దేవుడు. వారి ద్వారా మాత్రమే " ఒక చక్కటి సమాజం "మరి "2012 కల్లా ధ్యానజగత్ " సాధ్యం. నా ఈ అనుభవాలను మీ అందరితో పంచుకున్న అవకాశం ఇచ్చిన " ధ్యానాంధ్రప్రదేశ్ " కి నా కృతజ్ఞతలు.

 

S.లక్ష్మీనర్సయ్య
హైదరాబాద్
సెల్ : +91 80195 45209

Go to top