" ధ్యానం వల్ల అందరూ చల్లగా వుంటారు "

 

నా పేరు వెన్నా కుటుంబరావు. నా భార్య వెన్నా ప్రభావతి. మాది పోలవరం గ్రామం, పామర్రు మండలం, కృష్ణాజిల్లా. నేను మచిలీపట్నం లక్ష్మీ మేడమ్ గారి ద్వారా ధ్యానంలోకి వచ్చాను. లక్ష్మీ మేడమ్ నాతో ధ్యాన వ్యవసాయం చేయించారు. ధ్యానం చేయటం వలన నాకు ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరికింది. ఇంతకుముందు కంటే కూడా చాలా ఆనందంగా, ఆరోగ్యంగా ఎంతటి సమస్యలనైనా చాలా తేలికగా పరిష్కరించుకుంటూ చాలా, చాలా ఆనందంగా ధ్యాన వ్యవసాయం చేసుకుంటున్నాను. " ధ్యానం వల్ల అందరూ చల్లగా వుంటారు " అన్నది నేను స్వయంగా అనుభూతి చెందిన పరమసత్యం.

నాకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు. వాళ్ళందరు కూడా మాంసాహారం మానేసి ధ్యానం చేస్తున్నారు. మా ఊళ్ళో మరి ప్రక్క ఊళ్ళల్లో కూడా ధ్యానం పరిచయం చేసాను. మా ఇంటి పైన మా పెద్దబ్బాయి ‘ ఉదయభాస్కర్ ’ సహాయంతో 10'X10' పిరమిడ్ నిర్మాణం చేసాము మరి దాన్ని 23-7-2009 న పత్రీజీ ప్రారంభోత్సవం చేసారు. ఇప్పుడు వ్యవసాయానికి నాటే విత్తనాలను పిరమిడ్‌లో వుంచి ధ్యాన వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఇంతటి ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ ప్రసాదించిన ధ్యానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞతగానే వుంటాను. ధ్యానాన్ని అందించిన పత్రీజీకి నా శతకోటి ధ్యాన వందనాలు.

మామూలు వ్యవసాయదారుడిగా ఒక మారుమూల గ్రామంలో బ్రతుకుతోన్న నన్ను .. రకరకాల ఆత్మజ్ఞాన శీర్షికలతో, బ్రహ్మర్షి పత్రీజీ దివ్య సందేశాలతో, ధ్యానానుభవాలతో చైతన్యపరచి నా బ్రతుకొక్క అర్థాన్ని కల్పిస్తోన్న ధ్యానాంధ్రప్రదేశ్ మాసపత్రిక కు రాజపోషకులుగా Rs. 25,000/- అందించడం నా వంతు కర్తవ్యంగా అనుకున్నాను. దీనివల్ల పత్రిక మరింతమందికి మరింత చేరువై .. వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపగలుగుతుంది.

 

వెన్నా కుటుంబరావు
సెల్ : +91 99892 48859

Go to top