" కోటి పనులున్నా ధ్యానం చెయ్యాలి "

 

నా పేరు నాగరమాదేవి. నేను 2004 న. నవంబర్ 14 నుంచి ధ్యానం చేస్తున్నాను. ప్రస్తుతం మూడు సంవత్సరాల నుంచి విజయవాడ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో తెలుగు టీచర్‌గా పనిచేస్తున్నాను. నాకు థైరాయిడ్ సమస్య గత 10,12 సంవత్సరాలుగా వుంది. ధ్యానాంలోకి వచ్చాక టాబ్లెట్ మానడానికి రెండుసార్లు ప్రయత్నించాను. కానీ చాలా ఎక్కువయ్యేటప్పటికి మళ్ళీ వేసుకోవడం మొదలుపెట్టాను. శ్రీశైల ధ్యానమహాయజ్ఞం నుంచి వచ్చాక ఆ బాటిల్ వైపు చూస్తే " వేసుకోవద్దు, మానేసేయ్! " అని నా లోపల నుంచి సందేశం వచ్చింది. వెంటనే మానేశాను. అప్పటినుంచి నా శరీరంలో ఏ రోజు ఎక్కడ నొప్పి వస్తుందో తెలియదు. రకరకాల నొప్పులు. భరించలేని బాధ. శరీరమంతా నీరు వచ్చేసింది. కాళ్ళు, పాదాలు - మోకాళ్ళ వరకు తిమ్మిర్లు, పాదాలు క్రిందపెట్టలేని పరిస్థితి. అయినా టాబ్లెట్ వేసుకోలేదు.

అప్పుడు నేను ధ్యానంలో కూర్చుని ఎన్నెన్నో జన్మలుగా నేను తెలిసీ, తెలవక బాధపెట్టిన ఆత్మలను పిలిచి వాటికి అన్నిటికి క్షమాపణ చెప్పాను. దాంతో నాకు మరుసటిరోజుకే మొత్తం నొప్పులు, నీరు మొత్తం తగ్గిపోయి, అద్భుతంగా పూర్తి స్వస్థత చేకూరింది. ఇది పత్రీజీ అందించిన ధ్యానం వలన నాకు కలిగిన లాభం. ధ్యానప్రచారంలో భగంగా ఒక్కొక్క మాస్టర్ నుంచి నేను ఎన్నెన్నో గ్రహించాను. వారి నుంచి అద్భుతమైన జ్ఞానాన్ని స్వీకరించాను. పిరమిడ్ మాస్టర్ల కంటే సజ్జనులు ఎవ్వరు ? ఇంతటి మహద్భాగ్యాన్ని అందించిన మన ప్రియతమ ఆధ్యాత్మిక పరమగురుదేవులు బ్రహ్మర్షి పత్రీజీ బాటలో నడుద్దాం. ధ్యానమహాచక్ర యాగానికి నడుం బిగిద్దాం !! అందుకే .. వంద పనులున్నా భోజనం చెయ్యాలి; వెయ్యి పనులున్నా స్నానం చెయ్యాలి; లక్ష పనులున్నా ధ్యానం చెయ్యాలి! కోటానుకోట్ల పనులున్నా సరే .. ధ్యానప్రచారం తప్పక చెయ్యాలి !!

 

M.నాగరమాదేవి
W/O M.V.రామచంద్రరావు,H.NO. 7-37/2, ప్రసాదంపాడు, విజయవాడ
సెల్ : +91 98487 39897

Go to top