" ధ్యానం ద్వారా కీళ్ళనొప్పులను తగ్గించుకున్నాను "

 

నా పేరు అనూష. నేను ఫిబ్రవరి 2004 నుంచి " రుమటైడ్ ఆర్థరైటీస్ " అనే తీవ్రమైన కీళ్ళవ్యాధితో బాధపడుతూండేదాన్ని. దీనికి అల్లోపతి వైద్యంలో సరియైన మందులు లేవని డాక్టర్లు చెప్పడం వలన కొంతకాలం ఆయుర్వేదం మందులు వాడాను. కానీ దానివలన కూడా ప్రయోజనం కలగలేదు. మే 2004 నుంచి జనవరి 2005 వరకు హోమియో మందులు వాడినా ఫలితం కలగకపోగా వ్యాధి ఇంకా తీవ్రమై అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి ఏర్పడింది. శరీరంలోని కీళ్ళన్నీ వాచి విపరీతంగా నొప్పులు వుండేవి. మందులు వాడుతున్నప్పుడు ఆహారం విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసి వుండేది. ఎక్కువగా బెడ్‌రెస్ట్ తీసుకోమని డాక్టర్స్ సలహా ఇచ్చేవారు.

ఒక హోమియో మందులతో విసుగెత్తి ఫిబ్రవరి 2005 నుంచి సీనియర్ రుమటాలజిస్ట్ అల్లోపతి వైద్యం తీసుకోవడం మొదలుపెట్టాను. మొదట్లో వారి వైద్యం వలన వ్యాధి తీవ్రత తగ్గినట్లుగా వుండేది, కానీ మందులు వాడటం వలన కడుపులో మంటతో శరీరం శక్తిహీనంగా వుండేది.

"S.S.Y. యోగా " లో చెప్పినట్లుగా మనస్సులో ఒక మంత్రాన్ని స్మరించి ధ్యానం చేసేదాన్ని. " పిరమిడ్ మెడిటేషన్ " నేర్చుకున్న తరువాత కేవలం " శ్వాస మీద ధ్యాస " పెట్టి ధ్యానం చేయసాగాను. ఫలితంగా తక్కువ సమయంలో అంటే .. ఆరునెలల్లోనే నా ఆరోగ్యం బాగుపడింది. ధ్యానం మొదలుపెట్టిన రెండు, మూడు నెలల్లోనే కీళ్ళనొప్పులు మరి వాపులు కూడా పూర్తిగా నయమయ్యాయి.

ధ్యానంతో పాటు పూర్తి శాకాహారిగా మారడం వల్ల " ధ్యానం సర్వరోగనివారిణి " అన్న పత్రీజీ పలుకలను నిజం చేస్తూ నేను రుమటైడ్ ఆర్థరైటిస్ అనే కీళ్ళ వ్యాధిని పూర్తిగా తగ్గించుకోగలిగాను. రక్తపరీక్షలో కూడా " R.A.ఫ్యాక్టర్ నెగెటివ్ " అని వచ్చింది. ప్రస్తుతం నేను చక్కగా నా పనులన్నీ నేను చేసుకోవడమే కాకుండా ధ్యాన ప్రచారం చేస్తూ .. నాలాగా జబ్బులతో బాధపడుతూ జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నవారికి ధ్యానం నేర్పిస్తున్నాను.

ప్రతి ఒక్కరూ నియమబద్ధంగా ధ్యానం అలవాటు చేసుకుని శుద్ధ శాకాహారుల్లా మారితే .. సంపూర్ణ ఆరోగ్యంతో జీవితాన్ని ఆనందప్రదంగా జీవించవచ్చు.

 

అనూష N.T.P.C.
రామగుండం

Go to top