" మా ఊళ్ళో .. పిరమిడ్ అన్నదే ఏకైక దేవాలయం "

 

నా పేరు స్నేహలత. మాది ఖమ్మం జిల్లా, మణుగూరు. నేను రోజూ కంప్యూటర్ కోర్సు నేర్చుకోవటానికి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళేదాన్ని. ఒకరోజు పిరమిడ్ మాస్టర్ ‘సత్యమణి’ ఆంటీ పరిచయం అయి వాళ్ళ షాప్‌లో ఫ్లెక్స్ మీద వున్న వాక్యాలు నాకు బాగా నచ్చాయి. అవి " ధ్యానం అంటే ప్రార్థన కాదు ; ధ్యానం అంటే స్తోత్రం కాదు ; ధ్యానం అంటే మంత్రజపం కాదు; ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ". అంతే అది నాకు బాగా నచ్చేసి నేను రోజూ ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ఇక నాకు తెలియకుండానే నాలో కొన్ని మార్పులు వచ్చాయి.

అంతకుముందు నాకు ఆరోగ్యం సరిగ్గా వుండేది కాదు. తలనొప్పి, మెడనొప్పి బాగా వుండటంతో మెడకు బెల్టు పెట్టుకునేదాన్ని. ప్రయాణం చేసి వస్తే చాలు ఇక పెయిన్ కిల్లర్స్ వేసుకోవాల్సిందే. అలాంటిది ధ్యానం రోజూ చేయటం వల్ల నా ఆరోగ్యం చాలా బాగుపడిపోయింది.

కొన్నిరోజుల తరువాత మణుగూరు మాస్టర్స్ రమ, రాధాకృష్ణ గారి ఇంట్లో పౌర్ణమి ధ్యానం వెళ్ళి వాళ్ళను పరిచయం చేసుకున్నాను. తరువాత నాకు పిరమిడ్ కట్టాలని అనిపించింది. ధ్యానంలో కూర్చుంటే పత్రిసార్, పిరమిడ్స్ కనిపించేవి. సార్ " మీ అమ్మ వాళ్ళ స్థలం వుందిగా అడుగు " అని చెప్పారు. మా అమ్మని, మా అన్నయ్యను స్థలం పిరమిడ్‌కు ఇవ్వమని అడిగాను. వాళ్ళంతా వెంటనే "o.k " అన్నారు. మా అమ్మ ఆర్థిక సహకారంతో పిరమిడ్ మాస్టర్స్ అందరం కలిసి 9-8-2009 న 15'x15' కొలతలతో " శ్రీ పాండురంగ పిరమిడ్ " కట్టించాము.

కూనవరం గ్రామంలో ఇప్పటివరకూ ఎలాంటి దేవాలయం లేదు. అలాంటి వూళ్ళో ఒక పిరమిడ్ రావటం ద్వారా ఊరివాళ్ళంతా ఎంతో ఎంతో సంతోషించారు. మరి రోజూ వచ్చి అందులో కూర్చుని ధ్యానం చేస్తూ ఎన్నెన్నో ధ్యానానుభవాలను పొందుతున్నారు. ధ్యానం, ధ్యానప్రచారం చేస్తూ నేను చాలా ఆనందంగా వున్నాను. పత్రీజీకి కృతజ్ఞతలు.

 

నెల్లూరి స్నేహలత
ఖమ్మం జిల్లా
సెల్ : +91 94905 56528

Go to top