" ఈజిప్టులో ఆనాపానసతి ధ్యాన ప్రబోధం "

 

నా పేరు రామసుబ్బారెడ్డి. నేను కడప జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ ట్రస్ట్ .. వైస్ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నాను.

పిరమిడ్ అద్భుతశక్తి గురించి తెలుసుకున్నాక.. ఈజిప్టు రాజధాని " కైరో " మహానగరంలో ప్రపంచప్రసిద్ధిగాంచిన " గిజా పిరమిడ్ " ను చూడాలనీ, అందులో కూర్చుని ధ్యానం చేయాలనీ అనుకునేవాడిని. జగద్గురువులు బ్రహ్మర్షి పత్రీజీ గారు తలపెట్టిన 2012 డిసెంబర్ 21 నాటికి " ధ్యానజగత్ " నిర్మాణంలో భాగంగా నావంతుగా దీని కోసం కృషి చేయాలనీ .. ఇందు కోసం ఏదో దేశం వెళ్ళి ధ్యాన ప్రచారం చేయాలనీ కలలు కనేవాడిని.

మా కుమారుడు " రమేష్‌కుమార్ రెడ్డి " .. ఇటలీకి చెందిన సిమెంట్ ఇండస్ట్రీలో .. మెయింటెనెన్స్ మేనేజర్ (టెక్నికల్)గా పనిచేస్తూ ఈజిప్టు రాజధాని " కైరో " నగరంలో వుంటున్నాడు. నన్ను, నా భార్య జయలక్ష్మిని కైరో కు రమ్మని పిలవడంతో నాకెంతో సంతోషమైంది ; నా కల ఫలించిందనుకున్నాను.

23.04.2010 నుండి 16.06.2010 వరకు కైరోలో గడిపాం. అక్కడికి వెళ్ళగానే " గిజా పిరమిడ్ " కు వెళ్ళాం. గిజా పిరమిడ్ కింగ్స్ ఛాంబర్ లో కూర్చుని ఒక గంటన్నర సేపు ధ్యానం చేసి మాటలలో చెప్పలేని బ్రహ్మానందానుభూతినీ మరి ఈజిప్టులో మా ధ్యాన ప్రచారానికి కావలసిన శక్తినీ పొందాం. ఈజిప్టులో ప్రచురింపబడిన మెడిటేషన్ పాంఫ్లెట్స్ పంచడం చేసాము.

కైరో నగరంలో మా కుమారుడు, కోడలు నివాసముంటున్న ఇంటిలో గురూజీ బ్రహ్మర్షి పత్రీజీ మదిలో తలుచుకుని 05.05.2010 వ తేదీన తెలిసిన వారందరినీ ఆహ్వానించి " ఈజిప్టు పిరమిడ్ ధ్యానకేంద్రం " ప్రారంభించాము. ఇంటర్‌నెట్ ద్వారా అందరికీ " ప్రతిరోజు మధ్యాహ్నం 12 గం|| నుండి రాత్రి 7 గం||ల వరకు ఉచిత ధ్యాన శిక్షణాతరగతులున్నాయి " అని తెలియచేసి 05.05 2010 నుండి 15.06.2010 వరకు క్లాసులు నిర్వహించాము.

27.05.2010 తేదీన కైరోలో ఏర్పాటు చేసిన బుద్ధపూర్ణిమ ఫంక్షన్ లో ఈజిప్టు, జర్మనీ, ఆస్ట్రియా, కొలంబియా మరి ఇండియాలోని కేరళ, ఆంధ్ర, డిల్లీ, ముంబై, మధ్యప్రదేశ్, తమిళనాడు వారు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు.

ఈ ఆనందాన్ని కైరో నుంచి పత్రీజీ తో ఫోన్‌లో మాట్లాడి పంచుకున్నాము ; పత్రిసార్ కూడా ఎంతో ఆనందంగా మమ్మల్ని అభినందించారు.

బ్రహ్మర్షి పత్రీజీ తలపెట్టిన " ధ్యానజగత్ " పూర్తి చేయాలంటే 2012 డిసెంబర్ 21 వ తేదీ లోపలే ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ .. దేశ విదేశాలకు వెళ్ళి ధ్యాన ప్రచారాన్ని ముమ్మరం చేసి " తెలుగువారు .. జగతికి వెలుగు వారు " అని చాటిచెప్పాలి.

జై ధ్యానమహాచక్ర .. జైజైజై ధ్యాన జగత్ ...

 

"ధ్యానరత్న" గజ్జల రామసుబ్బారెడ్డి
కడప
సెల్ : +91 93912 36628

Go to top