" మండపేట పట్టణంలో మౌన ధ్యానం "

 

నా పేరు సుధ. నేను 2004 జూలై 7 వ తేదీ నుంచి ధ్యానసాధన, ధ్యాన ప్రచారం చేస్తున్నాను. ఈ మధ్య నేను 20 రోజులు ఆహారం తీసుకోకుండా, అంటే పండ్లు మాత్రమే తిని ఉన్నాను. అప్పుడు ఎక్కువ విశ్వశక్తిని తీసుకోవడంతోపాటు నా శరీరంలో కొన్ని మార్పులు కనిపించాయి. అప్పటి నుంచి నాకు " మౌనధ్యానం వర్క్‌షాప్ నిర్వహించాలి " అనిపించింది.

ఆహస్టు 21,22,23 పౌర్ణమి సందర్భంగా 72 గంటల అఖండ మౌనధ్యానం " కొనగళ్ళ సత్యనారాయణ, విజయకుమారిల ధ్యానమందిరం " లో 40 మంది ధ్యానులతో కేవలం ఫలాహారంతో నిర్వహించాము.

అఖండ మౌనధ్యానం వర్క్‌షాప్ ప్రారంభం చేయడానికి హైదరాబాద్ నుంచి ప్రాణహిత మేడమ్ వచ్చి చాలా అద్భుతంగా నిర్వహించారు. మౌన ధ్యానంలో పాల్గొన్నవారి అనుభవాలు వింటూంటే .. నేను చాలా ఆనందాన్ని చవిచూసాను.

రెండవ అఖండ మౌనధ్యానం నవంబరు 20,21,22 తేదీలలో మండపేట పట్టణంలోని కొనగళ్ళ సత్యనారాయణ విజయకుమారిల ధ్యాన మందిరంలో జరుపుతాము ; ఆసక్తి కలవారు దీనిని సద్వినియోగం చేసుకోగలరు.

- సత్యసుధ,
ఫోన్ : +91 93466 99990


వర్క్‌షాప్‌లో పాల్గొన్న వారి అనుభవాలు

" బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో ధ్యానం చేసుకుంటే ఎలాంటి ఎనర్జీస్ ఉంటాయో ఈ అఖండ మౌనధ్యానంలో కూడా అలాంటి శక్తిని తీసుకోవడం జరిగింది ; పిరమిడ్ చుట్టూ ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా మరి ప్రశాంతంగా అనిపించింది. "

- యలమర్తి మణి, ఈతకోట


" ఒకానొక హిందువుకి సంక్రాంతి పండుగ ఎలాగో, ఒకానొక క్రిస్టియన్‌కి క్రిస్ట్‌మస్ ఎలాగో, ఒకానొక ముస్లింకి రంజాన్ ఎలాగో .. మరి ఒకానొక ధ్యానికి మూడు రోజుల మౌనధ్యానం ఒక పండుగ లాంటిది. "

- మణికంఠ, ద్రాక్షారామం


" మాతో పాటు ఎంతో మంది ఆస్ట్రల్ మాస్టర్స్ ధ్యానం చేసుకుంటూ కనిపించారు. "

- P.V.సత్యనారాయణ, కుతుకులూరు


"నేను ఆరు సంవత్సరాలుగా ధ్యానం చేస్తున్నాను ; అది అంతా ఒక ఎత్తు అయితే ఈ మూడు రోజుల ధ్యానం ఒక ఎత్తు."

-S.వీరభద్రరావు, రాజమండ్రి


" ఆహారం తీసుకోకుండా పండ్లు, రాగి జావ త్రాగి అఖండ మౌనధ్యానం చేయడం వలన నా ఆలోచనలలో చాలా మార్పు కనిపించింది. "

ప్రశాంతి
కొత్తపేట


" శరీరం అంతా ఎక్కువ శక్తితో మరి ఆనందంతో నిండిపోయి.. దేహశుద్ధి సంకల్పం చెప్పినప్పుడు బ్రహ్మరంధ్రం గుండా ఒక బిందువు పైకి వెళుతూ నా శరీరం అంతా ఊదారంగులో కనిపించింది. "

చంటి అమ్ములు
మండపేట


"అఖండ మౌనధ్యానం చేస్తున్నప్పుడు నా శరీరం అంతా పిరమిడ్ అంత ఎత్తు పెరిగి .. నా శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ స్వస్థత చెందుతూ వున్నట్లు తెలిసింది. "

శిరీష
జున్నూరు


 

B.సత్యసుధ
మండపేట, తూర్పుగోదావరి జిల్లా

Go to top