" ధ్యానం ద్వారా పునర్జన్మ "

 

నా పేరు బాలేశం. నేను గత ఏడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ మరి " ధ్యానగ్రామీణం " వాహనం ద్వారా చాలా గ్రామాలలో ధ్యాన ప్రచారం చేస్తున్నాను.

గత నెలలో జూలై వ్యాస పౌర్ణమి రోజు హైదరాబాద్ " ప్రగతి రిసార్ట్ " లో జరిగిన పత్రీజీ క్లాసుకు .. నేను మా అమ్మాయి రమాదేవి, అల్లుడు దుర్గాప్రసాద్, అల్లుడి తమ్ముడు జగన్‌మోహన్ మరి ఆయన భార్య పద్మజ అయిదుగురం పాల్గొని .. తెల్లవారుజామున 3 గం||లకు తిరిగి మా గ్రామం మెదక్‌కు మా గ్రామీణ వాహనంలో వెళ్తున్నాం. సుమారు ఉదయం 6.30 ప్రాంతంలో డ్రైవర్ నిద్రమత్తువల్ల మా వాహనం పల్టీకొట్టి రోడ్డు ప్రక్కన వున్న లోతైన పొలాల్లోకి వెళ్ళిపోయింది.

చాలా విచిత్రమైన విషయమేమంటే .. అక్కడ మా వ్యాన్ పడిపోయిన ప్రదేశం మరి దృశ్యం చూసిన గ్రామస్థులంతా కూడా " అందులోని వాళ్ళంతా బ్రతికి వుండటం కల్ల " అనుకున్నారట ; అంతపెద్ద ప్రమాదం అది. కానీ పత్రీజీ చలువ వల్ల అందులో వున్న మా అయిదుగురిలో ఏ ఒక్కరికి కూడా చిన్న గాయమైనా కాలేదు. మరి మా కారుకు కూడా ఎలాంటి నష్టం జరుగలేదు. ప్రక్కన పొలాలు దున్నుతున్న ట్రాక్టర్ ద్వారా దానిని పైకి లాగి మళ్ళీ రోడ్డు పైకి తీసుకుని వచ్చి స్టార్ట్ కావడం మరి మేము ఏ ఆటంకం లేకుండా మెదక్ వెళ్ళిపోవడం జరిగింది. ఇదంతా మాకు ఒక పునర్జన్మ.

 

బాలేశం
మెదక్
ఫోన్ : +91 9290047100

Go to top