" ధ్యానమయ జీవితమే .. ధన్య జీవితం "

 


నా పేరు రమేష్. మాది విశాఖపట్టణం. మేము చివవాల్తేరులోని " శ్రీ కుసుమహర పిరమిడ్ ధ్యాన శిక్షణా కేంద్రం " లో శ్రీలక్ష్మి మరి మాధవ్ గార్ల ద్వారా అక్టోబర్ 2009 లో ధ్యానం నేర్చుకున్నాను. నా భార్య ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ని మందులు వాడినా తగ్గని స్పాండిలైటీస్ బాధలు ధ్యాన శక్తి వలన తగ్గిపోయాయి. నా భార్యలో వచ్చిన మార్పులు చూసి నేను కూడా ధ్యానం చేయటం మొదలుపెట్టాను.

శాకాహార కుటుంబంలో పుట్టినప్పటికీ నాకు మాంసాహారం తినే అలవాటు ఉండేది. ఎక్కువగా సినమాలు చూసేవాడిని. స్నేహితులతో పోట్లాడేవాడిని. మానసిక ఆందోళనతో పాటు విపరీతమైన దగ్గు మరి ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్సు కూడా ఉండేవి. ధ్యానం మొదలుపెట్టిన తరువాత మాంసాహారం మానివేశాను. సినమాలు తగ్గించాను. స్నేహితులతో పోట్లాటమానివేసి వారికి ధ్యానం చెప్పడం మొదలుపెట్టాను. దాంతో నా ఆరోగ్య ఈ సమస్యలు కూడా తగ్గుముఖం పట్టాయి.

మా ఇంట్లోకి పిరమిడ్ వచ్చిన తరువాత పూజల వలన తొలగని రకరకాల దోషభయాలు తొలగిపోయాయి. ధ్యానం చేయకముందు కుటుంబ పరిస్థితులు నాకు అవగతం అయ్యేవి కావు. సంసారం దుఃఖభారంగా ఉండేది. ధ్యానం, స్వాధ్యాయం మరి సజ్జనసాంగత్యం ద్వారా " మన జీవితాలని మనమే రూపొందించుకుని వస్తాం మరి ఈ జీవితం అనే నాటకంలో నటించడానికి బాధెందుకు ? " అని తెలుసుకుని సంసారాన్ని సుఖమయం చేసుకున్నాము. మా సంసారానికి అవసరమైన ప్రతి ఒక్కటీ ధ్యానం చేసిన తరువాత చక్కగా సమకూరాయి మరి కుటుంబ సభ్యుల మధ్య అవగాహన పెరిగింది.

 

రమేష్
విశాఖపట్నం
సెల్ : +91 99669 96277

Go to top