" ధ్యానమయ జీవితమే .. ధన్య జీవితం "

 

నా పేరు V.రమ్య. నాకు 13 సం||ల వయస్సు నుండి ఎన్నో రకాల బాధలు ఉండేవి స్నేహితులలో ఎవరితోనూ కలిసేదాన్నికాదు. మా నాన్నగారైన రమేష్ గారి ద్వారా ధ్యానం నేర్చుకుని ఇక సాధన చేయడం మొదలుపెట్టిన తరువాత నాబాధలన్నీ వదిలించుకున్నాను. అందరితో కలవడం కూడా ప్రారంభించాను. ధ్యాన తరగతులకు హాజరు అవుతూ మరి ఎందరో సీనియర్ మాస్టర్స్ ద్వారా ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకున్నాను.

టోల్‌టెక్ 4 ఒప్పందాలు పుస్తకంలో .. " భయపడితే మనిషి ముందడగు వేయలేడు, ఏదీ సాధించలేడు " అని చదివిన తరువాత " భయం వదిలేస్తే ఏదైనా సాధించవచ్చు " అని తెలుసుకున్నాను. విశాఖపట్నంలోని మాధవధార పిరమిడ్ మాస్టర్ వెంకట్ గారి సహాయంతో .. నా లోని భయాలనుండి పుర్తిగా బయటపడ్డాను. ఎంతోమంది పిల్లలకి ధ్యానం నేర్పించాను మరి మాంసాహారం పాపాహారమని ప్రచారం చేస్తూ వైజాగ్‌లో జరిగిన శాకాహార ర్యాలీలో పాల్గొన్నాను.

" ధ్యానమైన జీవితం ధన్యమైన జీవితం అని " మా జీవితానుభవాలని అందరితో పంచుకోవడానికి అవకాశం కల్పించిన ధ్యానాంధ్రప్రదేశ్ టీమ్ వారికీ .. మరి మా కుటుంబానికి ఇంత అద్భుతమైన ధ్యానవరాన్ని ప్రసాదించిన బ్రహ్మర్షి పత్రీజీకి శతకోటి వందనాలు.

 

రమ్య
విశాఖపట్నం
సెల్ : +91 99669 96277

Go to top