" వశిష్ట గౌతమి పిరమిడ్ విశ్వవిద్యాలయము వెలిచేరు "

ప్రకృతిలో విశ్వమయమైన ప్రాణశక్తిని నిల్వ ఉంచగల ఏకైక కట్టడం పిరమిడ్. అందుకే ఇది " ఎనర్జీ రిజర్వాయర్ " లేదా " శక్తిక్షేత్రం " అని పిలువబడుతోంది. కాలుష్యాన్ని శుద్ధి చేయగల శక్తి పిరమిడ్‌కు వుంది. పిరమిడ్ శక్తి వలన భూమిలో లోపించిన వనరులు తిరిగి పునరుద్ధరింపబడతాయి. భూకంపాలు, వరదలు మరి ప్రకృతి వైపరీత్యాల నుంచి భూమిని కాపాడగల శక్తి పిరమిడ్‌కు వుంది. అందువల్లనే బ్రహ్మర్షి పత్రీజీ ఇంటింటికీ పిరమిడ్, గ్రామగ్రామానా పిరమిడ్, మరి జిల్లాకి ఒక మెగా పిరమిడ్ రావాలనీ కోరుతున్నారు.

గోదావరి తీరాన ఏనాడో పత్రీజీచే దర్శించబడి, సంకల్పించబడిన మెగా పిరమిడే వశిష్ట గౌతమి పిరమిడ్ విశ్వవిద్యాలయం.

మానవుడు తన దురాశతో ప్రకృతి సమతుల్యతను పోషించే అడవులను నరికి, కాంక్రీట్ అడవులను నిర్మిస్తున్నాడు. మానవుని ఈ దురాశే ప్రకృతి వైపరీత్యాలకు కారణం. మనం పిరమిడ్ ధ్యానులం. అనేక పిరమిడ్‌లను నిర్మించి ప్రకృతి సమతుల్యాన్ని తిరిగి పునరుద్దరించడం ద్వారా మానవ కళ్యాణానికి మరి లోక కళ్యాణానికి తోడ్పడదాము.

బ్రహ్మర్షి పత్రీజీ స్వయంగా చూసి, ధ్యానం చేసి, అంగీకరించిన " వెలిచేరు గ్రామం " లో 26 ఎకరాల స్థల సేకరణ చేసి, మరి అక్టోబర్ 18 న శంఖుస్థాపన జరుపుకుంటున్నాం. లోకకళ్యాణార్థం జరిగే ఈ కార్యక్రమానికి ధ్యానులంతా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరిక.

బ్రహ్మర్షి పత్రీజీ ఆశయం " 2012 కల్లా ధ్యాన జగత్ ", 2016 కల్లా పిరమిడ్ ధ్యాన జగత్ ద్వారా విశ్వకళ్యాణానికి తోడ్పడదాం.

 

- S.చంద్రమౌళి,
వశష్ట గౌతమి పిరమిడ్ ట్రస్టు, రాజమండ్రి

Go to top