" ఖమ్మం సబ్‌జైలులో విస్తారంగా ధ్యానశిక్షణ "

 

ఖమ్మం సబ్‌జైలులో జూలై 3 నుంచి ఆగస్టు 12 వరకు 40 రోజులపాటు అక్కడి ఖైదీలకు మరి జైలు సిబ్బందికి ధ్యానశిక్షణ ఇవ్వటం జరిగింది. జైలు అధికారి శ్రీ పెద్దింటి వేణుగోపాల్ గారు మరి జైలు సూపరింటెండెంట్ శ్రీ లకావతు దేవ్‌లా గారి సహకారంతో .. 40 రోజుల పాటు ప్రతిరోజూ ఉదయం 6.30 నుంచి 7.30 వరకు ఖైదీలకు ధ్యానశిక్షణ ఇచ్చే కార్యక్రమం మానుకొండ రఘురాం ప్రసాద్ గారి సారధ్యంలో ఖమ్మం మాస్టర్స్ చక్కగా నిర్వహించారు.

ఆగస్ట్ 12 న 40 రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా 6.30 నుంచి 7.30 వరకు ధ్యాన, మాస్టర్స్ సందేశాలు ఖైదీల అనుభవాలు అనంతరం 9.00 గంటలకు పిరమిడ్ మాస్టర్స్ తయారుచేసిన 200 పులిహోర పొట్లాలు ఖైదీలకు మరి జైలు స్టాఫ్‌కూ అందరికీ పంచటం జరిగింది. 200 శాకాహారం పుస్తకాలు ఖైదీలకూ, జైలు స్టాఫ్‌కూ అందించటం జరిగింది.

 

N.సరోజ
ఖమ్మం
సెల్ : +91 80193 17995

Go to top