" ధ్యానం ఒక అక్షయపాత్ర "

 

నా పేరు శ్వేత. మాది విజయవాడ. నాకు ముగ్గురు పిల్లలు. నేను గత మూడు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ధ్యానంలోకి రాకముందు నాకు తలనొప్పి ఎక్కువగా వస్తూ " జండూబామ్ " నా చేతిలో ఎప్పుడూ వుండేది. విపరీతమైన తలనొప్పి ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. పిరమిడ్ మాస్టర్ " V. ఆదిశేషు " గారి ద్వారా ధ్యానం చేయడం మొదలుపెట్టిన దగ్గరి నుంచి నాకు తలనొప్పి సమస్యలు అన్నీ క్రమక్రమంగా తగ్గుముఖం పట్టాయి. ధ్యానానికి సంబంధించిన అనేక పుస్తకాలు చదువుతూ ఎంతో ధ్యానాన్ని తెలుసుకున్నాను. ధ్యానప్రచారం చెస్తూ నాకు తెలిసిన ధ్యానాన్ని అందరికీ పంచుతున్నాను.

ధ్యానంతో మనలోని రోగాలను మనం ఏ మందులు వాడకుండా తగ్గించుకోవచ్చు " అని తెలుసుకున్నాను. ఏ పని అయినా మంచి మనస్సుతో, ఏకాగ్రతతో చేసినట్లు అయితే అది తప్పకుండా సాధించవచ్చు. ఈ అనుభవాలు మా అందరిలో ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయి. " నమ్మకంతో, విశ్వాసంతో ధ్యానం చేస్తే ధ్యానం ఒక మహా అక్షయపాత్ర " అని మాకు అర్థమైంది.

భూమిని పునీతం చేస్తున్న పత్రీజీని స్ఫూర్తిగా మేమందరం కూడా ధ్యానప్రచారం చేస్తూ " ధ్యానజగత్ " కై మా వంతు కర్తవ్యం నిర్వర్తించాలని అభిలషిస్తూ కృషిచేస్తున్నాం. నేను, మావారు 2009 జూలైలో పత్రీజీ గురువు గారైన శ్రీ సదానందయోగి గారి సమాధి దగ్గరకు వెళ్ళాం. అక్కడ ధ్యానం చేస్తూండగా సదానందయోగి గారు తమ సూక్ష్మశరీరంతో తన చేతిని నా శిరస్సుపై వుంచి ఆశీర్వదించారు. ప్రతి మనిషి ధ్యానులు అవ్వాలని కోరుతున్నాను.

ధ్యానం అన్నదే అన్నింటికీ పరమార్థం .

 

శ్వేత
విజయవాడ
సెల్ : +91 92474 59911

Go to top