" జైలర్ .. శ్రీ పెద్దింటి వేణుగోపాల్ "

 

" 40 రోజుల మెడిటేషన్ వల్ల ఇక్కడ వున్న ఖైదీలందరూ నూటికి నూరుపాళ్ళు లాభం పొందారు. ధ్యానం చేయకముందు వాళ్ళ ఆలోచనావిధానంలో నెగెటివ్ ఆలోచనలు వుండేవి. మాకు ఖైదీల నుంచి రోజుకు కనీసం 5,10 వరకు ఫిర్యాదులు వుండేవి. అలాంటిది ధ్యానం తరువాత వాళ్ళ ఆలోచనలో ఎంతో మార్పు కనిపించింది. " అందరూ ధ్యానం చేయాలి. అందరికీ ధ్యానం గురించి తెలియజేయాలి. అన్ని జైళ్ళలో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది "

పెద్దింటి వేణుగోపాల్
ఖమ్మం


 

M. హరిలాల్ : " నేను తాపీమేస్త్రీగా పనిచేసేవాడిని. 100 శాతం ధ్యానంలో వున్న సత్యాన్ని తెలుసుకోగలిగాను. పూర్తి శాకాహారిగా అయ్యాను. మొదట శాకాహారం, తరువాత ధ్యానం .. ఈ రెండింటి వలన విశ్వంలో ఆనందాన్ని పొందగలుగుతాము. నేను ప్రతిరోజూ ధ్యానం చేస్తూ అందరికీ ధ్యానం గురించి తెలియజేస్తాను. "


 

B. శ్రీనివాసరావు : " నేను ధ్యానం చేయడం వలన చాలా విషయాలు తెలుసుకున్నాను. చాలా సంతోషంగా వుంది. నాకు తలనొప్పి, ఒళ్ళునొప్పులు వుండేవి. అవి 40 రోజులు ధ్యానం చేయటం వలన తగ్గాయి. నేను ధ్యానం చేస్తాను. ఇక్కడే జైలులో ఇతర ఖైదీలకు ధ్యానప్రచారం కూడా చేస్తాను. "


 

K. వేణుగోపాల్ : ధ్యానం మొదలుపెట్టిన మొదటి రోజు తలనొప్పి, రెండవ మూడవరోజు అలానే వుంది. ‘ ఏమీ తగ్గలేదు ; మానేద్దాం ’ అనుకున్నాను. ఒకరోజు ఉదయం లేచి ధ్యానం చేసాను. చాలా బాగుంది. ఆ రోజు మూడుసార్లు చేసాను. రోజుకు మూడుసార్లు చేస్తున్నాను. పౌర్ణమి రోజున మూడుసార్లు చేసాను. ఆస్ట్రల్ ట్రావెల్ చేసి షిర్డీలో జరిగే పూజలు కళ్ళకుకట్టినట్లుగా చూసాను. "


 

S. శ్రీనివాసరావు : " FCI లో పనిచేస్తూ ఒకానొక కర్మ ఫలితం వల్ల జైలుకి రావడం జరిగింది. జైలుకు రాకముందు నాకు ఎంతో నెగెటివ్ థింకింగ్ వుండేది. ధ్యానం ద్వారా నా ఆలోచనావిధానంలోనే ఎంతో మార్పును చూసుకుని ఇన్నాళ్ళుగా నేను ఏం తప్పులు చేస్తూ వచ్చానో అవగాహన చేసుకున్నాను. ఈ కార్యక్రమాలు చేపట్టిన జైలు సిబ్బందికి పిరమిడ్ మాస్టర్లకు కృతజ్ఞతలు. "

Go to top