" ధ్యానంలో నా కాలుకి సర్జరీ జరిగింది "

 

నా పేరు వేణుగోపాల్. మాది మహబూబ్‌నగర్ జిల్లా, కొత్తకోట. నేను 2002 లో పిరమిడ్ మాస్టర్ S.R. ప్రేమయ్య గారి ద్వారా విజయలక్ష్మి మేడమ్ (హైదరాబాద్) గారి మొదటి క్లాసుకు వెళ్ళటం జరిగింది. మాది ధ్యాన కుటుంబం. నేను, నా భార్య, మా అమ్మాయి, అబ్బాయి అందరం కూడా ధ్యానం చేసుకుంటాం.

నాకు ఎడమ మోకాలు సమస్యగా వుండేది. మెట్లు ఎక్కడం, పరుగెత్తడం లాంటివి ఎంతో కష్టంగా వుండేవి. 2003 లో పత్రిసార్ మా ఇంటికి వచ్చిన రోజు నుంచి మేము పూజలు మానివేశాం. ధ్యానంలోకి వచ్చాక " పూజ అవసరం లేదు " అనీ, " అది సమయం వృధా " అనీ, " అవన్నీ ప్రాథమిక దశలో ఉండేవారు చేసే పనులు " అనే జ్ఞానం పొందాను. నేను 2003 లో ప్రతిరోజూ తొమ్మిదిగంటలు ధ్యానం మూడునెలల పాటు చేసాను. ఒక రోజు నేను ధ్యానంలో వున్నప్పుడు నా కాలుకు సర్జరీ జరిగింది. నేను " అంతా నిజం " అనుకున్నాను. నేను హాస్పిటల్‌లో ఆపరేషన్ థియేటర్‌లో వున్నాను. డాక్టర్లు నాకు ఆపరేషన్ పూర్తిచేసి అంతర్దానం అయ్యారు. నేను కళ్ళు తెరచి చూస్తే నేను మా ఇంట్లోనే వున్నాను. నాకు చాలా ఆశ్చర్యం, సంతోషం వేసింది. ఆ మరుక్షణం నుంచి ఇప్పటివరకు నేను ఎలాంటి బాధా లేకుండా మెట్లు ఎక్కగలుగుతున్నాను, రన్నింగ్ కూడా చేయగలుగుతున్నాను.

మేము ఇప్పుడు ఎంతో సంతోషంగా వున్నాము. మేము కట్టించిన పిరమిడ్‌ను పత్రిసార్ 6-8-2010 శుక్రవారం రోజు పారంభోత్సవం చేసినందుకు సార్‌కు మా యొక్క ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో 800 వందలమంది పాల్గొన్నారు. అందరూ కూడా పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలని మనవి.

 

భీమనేని వేణుగోపాల్
కొత్తకోట

Go to top