" ధ్యానం ద్వారా పూర్వజన్మల కర్మలు సైతం దగ్ధం "

 

నా పేరు లక్ష్మీ అపర్ణ. మాది ఖమ్మం. నేను 2001 నుంచి ధ్యానం చేస్తున్నాను. నాకు జన్మనిచ్చిన తండ్రి పర్వతనేని ఆంజనేయులు గారు, తల్లి సత్యమణి గార్లు.

నేను పుట్టినప్పటి నుంచి నా శరీరంలో రోగం లేని భాగమే లేదు. బ్రెయిన్‌కి ఐ.క్యూ. తక్కువ, గుండె వేగంగా కొట్టుకోవటం, చెవులు సరిగ్గా వినపడకపోవటం, కిడ్నీ ఫెయిల్యూరు, అపెండిసైటిస్ ఆపరేషన్, డియోడినల్ అల్సర్, ఇవన్నీ ఒక ఎత్తయితే శరీరమంతా ప్రసరించే రక్తంలో హీమోఫిలియా అనే వ్యాధి వల్ల నాకు శరీరంలో ఎక్కడైనా గాయమైతే రక్తప్రసరణ ఆగదు.

నాకు ఈ ధ్యాన పరిచయం చేసినవారు మా అత్తయ్య Ch. పద్మజ. నేను ధ్యానం చేయటం మొదలుపెట్టిన నెలరోజులలో .. నా శరీరంలో వున్న రోగాలన్నీ మెల్లమెల్లగా నెమ్మదిస్తూ వచ్చాయి. ఒక్క హీమోఫీలియా తప్ప. ఒక్కరోజు ధ్యానంలో " No Medicine " అని వచ్చింది. దానితో నేను జీవితాంతం వాడవలసిన మందులు మానివేసాను.

నేను ఒకప్పుడు మాంసాహారిని. ధ్యానంలోకి వచ్చిన మూడు నెలలకి శాకాహారిని అయ్యాను. నాకు 5- 5- 2005 లో పత్రిగారు అనుమతితో G.సాయిరెడ్డి గారితో వివాహం జరిగింది. నేను హైదరాబాద్‌లో ఉండేదాన్ని. 2007 లో ఒకరోజు ధ్యానంలో " నువ్వు ఖమ్మం వెళ్ళు .. నీకు పని వుంది " అని సందేశం వస్తే .. " సరే " అనుకుని ఖమ్మం వెళ్ళాను.

అప్పుడే ఖమ్మంలో సరోజ మేడమ్ గారు ఏర్పాటుచేసిన " గీతా ధ్యాన సప్తాహం " కార్యక్రమానికి నేను హాజరయ్యాను. చివరిరోజు వక్తగా డాక్టర్ సత్యనారాయణమూర్తి గారు జగిత్యాల నుంచి వచ్చి " ఎవరైనా సందేహాలు వుంటే అడగండి " అన్నారు. అప్పుడు నేను " హీమోఫిలియా " గురించి అడిగాను. " నువ్వు ధ్యానంలో ఎందుకు తగ్గించుకోలేదు ? "అన్నారు. " ‘ పుట్టుకతో వచ్చింది పుడకలతో పోతుంది ’ అని అనుకున్నాను సార్ " అని చెప్పాను. అప్పుడు సార్ " అది తప్పు ; పుట్టుకతో కాదు పూర్వజన్మలోది కూడా ధ్యానంలో పోగొట్టుకోవచ్చు ; నువ్వు ధ్యానప్రచారం కూడా చెయ్యి " అని చెప్పారు. ఒక డాక్టర్ అలా చెప్పటం నాకు విశ్వాసంతో పాటు ఆనందాన్ని కూడా కలిగించింది.

అప్పుడు నేను మావారి సహాయంతో ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగే " ధ్యానగ్రామీణం ప్రాజెక్టు " లో భాగంగా ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 10.00 గంటల వరకు ధ్యానప్రచారం చేసాను. 2009 లో జరిగిన ఎన్నికలలో " పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా " తరపున ప్రచారం చేసాను. 2009 సెప్టెంబర్ నుంచి హీమోఫిలియా సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్లు గమనించాను. ధ్యానంలోకి వచ్చిన రెండునెలలకే నా మూడవకన్ను తెరుచుకుని గతజన్మలు చూసుకోవటం, ఆస్ట్రల్ ట్రావెల్ చేసి ఇతరలోకవాసులతో గడపడం లాంటి ఎన్నో అనుభవాలను ప్రత్యక్షంగా పొందాను.

రాముడికి ఉడుత వారధి కట్టడానికి సహాయం చేసినట్లు నేను కూడా ధ్యాన, శాకాహార, పిరమిడ్ జగత్‌కి ఖమ్మం జిల్లా ఒక మణిహారం కావడానికి కృషిచేస్తున్నాను ; సదా చేస్తూనే వుంటాను. నన్ను అలా తీర్చిదిద్దిన ధ్యానానికీ, పత్రీజీకి మరి ఖమ్మం జిల్లా పిరమిడ్ సొసైటీ వారికి నా ఆత్మాభివందనాలు.

 

G.V. లక్ష్మీఅపర్ణ
ఖమ్మం
సెల్ : +91 94407 08408

Go to top