" ధ్యానంలో నాకు వందశాతం ఫలితం దక్కింది "

 

నా పేరు విశాలాక్షి. నేను 2002 లో నా భర్త ద్వారా పిరమిడ్ ధ్యానంలోకి వచ్చాను.

" మరణం లేని మీరు " పుస్తకం చదివిన తరువాత నాకు జ్ఞానోదయం కలిగింది. సేత్ పుస్తకం చదివిన తరువాత సంపూర్ణంగా అర్థమైంది. ధ్యానం చెసుకోవటం మొదలుపెట్టినప్పటి నుంచి నేను చాలా సంతోషంగా వున్నాను. " పిల్లలు బాగా చదువుకోవాలి " అని ధ్యానంలో అనుకున్నాను. మా బాబు " అభినవ్ " పదవతరగతిలో, ఇంటర్‌లో 95% మార్కులు సాధించాడు. మా పాప " యశస్విని " కూడా పదవతరగతిలో 90% మార్కులు సాధించింది.

" దేవుడు నాలోనే వున్నాడు " అన్న అనుభూతి కలిగింది. నాకు కొంచెం బాధ కలిగినా నేను ధ్యానంలో కూర్చుంటాను. పత్రీజీ " నేను వున్నాను " అని పలికినట్లు అనిపిస్తుంది. అప్పుడు వెంటనే నా సమస్య తీరిపోతుంది. పత్రీజీ ఒక తల్లిలాగా .. ధ్యానం చేసేవాళ్ళందరనీ అలాగే చూసుకుంటారు. అందరూ ధ్యానం చేయాలి. అందరూ పిరమిడ్స్ నిర్మించాలని నా కోరిక.

మంచినీళ్ళ కోసం మేము బోరువేసాం. ఎక్కడ నీరు పడతాయో తెలియని అయోమయంలో నెను ధ్యానం చేసాను. అప్పుడు ఎక్కడ వేయాలో కనిపించింది. అక్కడ వెంటనే నీరు రావటం మాకెంతో సంతోషకరం. నేను పది సంవత్సరాలు పూజలు చేసాను. ఫలితం సున్నా. ధ్యానం చేసిన 40 రోజులకు వందశాతం ఫలితం దొరికింది.

 

భీమనేని విశాలాక్షి
కొత్తకోట, మహబూబ్‌నగర్ జిల్లా

Go to top