" ఇందిరమ్మ పిరమిడ్ గృహ నిర్మాణాలు "

 

బ్రహ్మర్షి పత్రీజీ ఆధ్వర్యంలో .. పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీస్ మూవ్‌మెంట్ ఎన్నెన్నో అద్భుతాలను సృష్టిస్తూ ... ముందుకు దూసుకుని వెళ్తోంది. అందులో భాగంగా అద్భుతాలకే అద్భుతం .. ఖమ్మం జిల్లాలో ఖమ్మం పట్టణానికి 24 కి.మీ. దూరంలో వున్న చింతకాని మండలం "నాగులవంచ" గ్రామంలో సాక్షాత్కరించబోతుంది. ఇందిరమ్మ గృహ నిర్మాణాలపధకం క్రింద .. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు షెడ్యూల్డ్ కులాల వారికోసం నిర్మిస్తోన్న ఇళ్ళ ప్రాజెక్టును ఖమ్మం జిల్లా పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ చేపట్టడం జరిగింది.

నాతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు వేలాది పిరమిడ్‌లను నిర్మించిన ... పిరమిడ్ రామారావు మరి జిల్లా ధ్యాన గ్రామీణ ఛైర్మన్ మానుకొండ రఘురామ్ ప్రసాద్‌లు కలిసి .. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ 40 పిరమిడ్ ఇళ్ళ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. "మైత్రేయ బుద్ధ పిరమిడ్ గృహ సముదాయం"గా వీటికి నామకరణం చేసి .. మే 6బుద్ధపౌర్ణమి రోజున ఈ ప్రాజెక్టును ప్రారంభించడం విశేషాలకే విశేషం.

 

 

రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిన నిధుల ప్రకారం ఒక్కొక్క ఇంటిని 15x15 అడుగులు గది దానిపైన 15x15 పిరమిడ్ కొలతలతో ... కూలింగ్ ఇటుకలు మరి కూలింగ్ టైల్స్‌తో సరికొత్త నిర్మాణసృష్టి జరుగుతోంది. ప్రతిరోజూ కూలీకి వెళితే కాని తినడానికి తిండిలేని నిరుపేదలకు, గవర్నమెంటు ఇచ్చే డబ్బుతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇలాంటి శక్తిక్షేత్రాలను నిర్మించి ఇవ్వడం జరుగుతోంది.

పత్రీజీతో పాటు మనమంతా కలలుకంటోన్న పిరమిడ్ యుగానికి నాందిగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వపరంగా ఈ 40 పిరమిడ్ ఇళ్ళ నిర్మాణం ఒకేచోట జరుగుతోంది. నాగులవంచ జిల్లా పరిషత్ స్కూల్‌లో 18x18 పిరమిడ్ పిరమిడ్ 41 వ పిరమిడ్ కావడంతో ... మొత్తం 41 పిరమిడ్‌లు ఒకే ఊరిలో నిర్మించబడ్డాయి. దీంతో నాగులవంచ గ్రామం అంతా కూడా పిరమిడ్ అద్భుతశక్తితో నిండిపోబోతుంది. ఇలాంటి ప్రభుత్వపధకాలను పిరమిడ్ మాస్టర్లందరూ కూడా వీలయినంత విరివిగా చేపట్టాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతైనా వుంది.

ఈ ప్రాజెక్ట్ ఖమ్మం పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీకి రావడానికి కారణం అయిన అసిస్టెంట్ ఇంజనీర్ "వెంకటేశ్వరరావుగారు",వర్క్స్ ఇన్‌స్పెక్టర్ "రామయ్యగారి" తో పాటు నాగులవంచ గ్రామపెద్దలు "అంబటి వెంకటేశ్వర్లు"గారు మరి మాజీ సర్పంచ్ "వీరభద్రం"గార్లు మరి ఈ ప్రాజెక్టుకు తన సేవలు అందిస్తున్న దమ్మపేటకు చెందిన "దారా శాంతి" కృతజ్ఞతలు. తమ ఇళ్ళ నిర్మాణ పనులను పర్యవేక్షించుకోవడానికి వస్తోన్న లబ్ధిదారులతో ధ్యానం చేయిస్తూ ... వారికి శాకాహార ప్రాముఖ్యాన్ని వివరించడంతో ... విపరీతంగా పంది మాంసం, గొడ్డు మాంసం తినే ఆ ఇళ్ళ లబ్ధిదారులంతా కూడా శాకాహారుల్లా మారుతున్నారు.

 

ప్రాజెక్ట్ కన్వీనర్ .. నలజాల సరోజ
ఖమ్మం
సెల్ : +91 80193 17995

Go to top