" ఆత్మానందమే బ్రహ్మానందం "

 

నేను "త్రివేణి టాలెంట్ స్కూల్" ఖమ్మంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. నాది స్వతహాగా సున్నిత మనస్తత్వం. నేను అతిగా మానసిక అందోళనకు గురయ్యేదాన్ని. ఇంకా నా చిన్నతనం నుంచీ భయంకరమైన తలనొప్పితో బాధపడుతూండే దానిని.

రెండు సంవత్సరాల క్రితం బంధువుల ద్వారా ధ్యానం గురించి తెలుసుకున్నాను. మొట్టమొదటగా పౌర్ణమి రోజున భద్రాచలం శివాలయంలో ధ్యానం చేశాను. అక్కడ నుండి ప్రతిరోజూ చేస్తూ వచ్చాను. ఇప్పుడు నాకున్నటువంటి బాధలు తీరటమేకాక నేను సంకల్పంతో ధ్యానం చేసి ఏ కార్యం చేపట్టినా విజయవంతం అవుతూ వస్తుంది. దీనివల్ల నేను ఎంతగానో ఆత్మానందాన్ని పొందగలుగుతున్నాను!

నేను సహజంగానే ప్రకృతిని ఆరాధిస్తాను; ఏకాంతంగా ఉన్నప్పుడు ప్రకృతిని చూస్తూ ఆనందిస్తాను. దానిమూలంగా ధ్యానం చేస్తున్నప్పుడు అందమైన పూలతోటలో ఏడు రంగులతో నిండైనా సొగసుతో వయ్యారలొలుకబోసే ఇంద్రధనస్సుతో కలివిడిగా వున్న ప్రకృతిలో పదేళ్ళ పాపగా ఆడుతున్నట్లు అనిపిస్తుంది. శరీరం అంతా తేలికౌతుంది.

నాకు ఈ ఎనలేని ఆత్మానందాన్ని పంచిన K. వెంకటేశ్వర్లు.. మా ఆదిగురువు.. గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. అలాగే బృహత్తరమైన మహాభాగ్యాన్ని మానవాళికి అందిస్తున్న "ధ్యానజగత్ జీవజ్యోతి" పత్రీజీకి పాదాభివందనం చేస్తున్నాను.

ఒక ఉపాధ్యాయురాలుగా నా విద్యార్థులందరికీ పాఠ్యాంశాలతో పాటు ధ్యానం గురించి తెలియజేసి వారికి చక్కటి మార్గాన్ని చూపాలనుకుంటున్నాను. అది నా వృత్తిధర్మంగా భావిస్తాను. నా శక్తివంచన లేకుండా కృషిచేసి వారికి ఆనందమయ జీవితాన్ని అందిస్తాను. ప్రతి విద్యార్థీ ఒక బుద్ధుడుగా ఎదగాలన్నదే నా కోరిక!

 

పాటిబండ్ల మనీషా
టీచర్
ఖమ్మం

Go to top