" పునరుద్ధానం "

 

ధ్యానబంధులందరికీ, విద్యాప్రదాయని, N.S. రావు దంపతుల ప్రణామాలు! మా జీవితంలో పెద్ద అలజడిని సృష్టించిన దారితీసిన చిన్న సంఘటన ఆగస్టు 28, 2006 న చోటుచేసుకుంది.ఆరోజు సాయంత్రం నా శ్రీమతికి కొద్దిగా గుండెదడ వచ్చింది. మా ఫ్యామిలీ డాక్టరు వచ్చి "మీరు మందులేమీ తీసుకోకపోయినా E.C.G. మాత్రం తప్పనిసరిగా తీయించాలి" అన్నది. తీరా హాస్పిటల్ వెళ్ళాక కార్డియాలజిస్ట్, E.C.G. చూసి, ఈమెకు ఇంటెన్సిప్ కేర్ యూనిట్లో వారంరోజులు విశ్రాంతి అవసరం అని చెప్పి, ఎమర్జెన్సీ కేసుగా I.C.U.లో చేర్చారు.

మరి వాళ్ళు ఏంట్రీట్‌మెంట్ ఇచ్చారోగాని, రోజురోజుకూ ఆమె పరిస్థితి దిగజారుతూ వచ్చింది. మూడవరొజుకల్లా స్పృహ తప్పి కోమాలోకి వెళ్ళిపోయింది. "రాత్రి ఆమెకు పెద్ద హార్ట్ఎటాక్ వచ్చింది. అందువల్లే ఇలా అయింది" అన్నారు డాకర్లు. వృద్ధాప్యం వల్ల ఆమెకు మాట్రీట్‌మెంట్ పనిచేయట్లేదని చేతులెత్తేశారు. ఇంటికి తీసుకెళ్ళచ్చని పరోక్షంగా సూచించారు. వచ్చేముందు నిక్షేపంగా వున్న మనిషిని మరణావస్థకు చెర్చారు. అఖరి ప్రయత్నంగా కేర్ హాస్పిటల్‌లో చేరిస్తే వాళ్ళు వెంటిలేటర్లో వుంచి, 48 గంటలు గమనిస్తేగాని ఏమి చెప్పలేమన్నారు. మూడవరోజుకు ఆమెకు కొద్దిగా స్పృహ వచ్చింది. మాట్లాడలేదు. కదల్లేదు.. కానీ చూడగలదు, వినగలదు.

ఆ స్థితిలో ఆమెకు తన బెడ్డు పక్కనున్న కుర్చీలో పత్రీజీ కూర్చునివున్నట్లు కనపడ్డారు. తనవైపే చూస్తున్నారుకాని ఏమీ మాట్లాడలేదు. ఇలాగే రెండురోజులు గడిచాక ఆమెకు పూర్తి స్పృహ వచ్చింది. ఆయన మాయమైపోయారు. "పత్రీజీ సూక్ష్మశరీరంలో వచ్చి నా ప్రాణం కాపాడారు" అని ఆమె మాతో చెప్పింది.

ఈ విధంగా పత్రీజీ దయవల్ల ఆమె పునరుద్ధానం జరిగింది. మేం జూన్ 15, 2008 న బంధుమిత్రులూ, ధ్యానమిత్రుల సమక్షంలో మా "60వ పెళ్ళిరోజు" వైభవంగా జరుపుకోగలిగాం. పత్రిదంపతులను కలిసి కృతజ్ఞతలు అందజేశాం!

 

విద్యాప్రదాయిని
N.S. రావు

Go to top