" పాస్టలైఫ్ రిగ్రెషన్ టెక్నిక్ - కేస్ స్టడీ ఆఫ్ రుమటాయిడ్ ఆర్థైటిస్ "

 

Tv.9 ఆగస్టు 31 రాత్రి 9.00 గంటలకు అక్కయ్యపాలెం విశాఖపట్నంకు చెందిన కుమారి రమ్య "ధ్యాన ఆరోగ్యం జీవితం" పై జరిపిన చర్చా కార్యక్రమం ప్రత్యక్షప్రసారం చెయ్యడం జరిగింది! ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటి రీడర్ డాక్టర్ సుధాకర్ రెడ్డి మరి డాక్టర్ నాజియా పాల్గొన్నారు. రమ్య అనుభవం మన ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకుల కోసం...


నా పేరు T. శ్రీరమ్య, నా వయస్సు 22 సంవత్సరాలు. మాది విశాఖపట్నం. నేను 2007 లో నా B. Tech కోర్స్‌ని పూర్తిచేశాను. నేను గత రెండున్నర సంవత్సరాలుగా రుమటాయిడ్ ఆర్థ‌రైటిస్ అనే వ్యాధితో ఎంతో బాధపడ్డాను. నాకు చిన్నప్పటినుంచి ఎటువంటి అనారోగ్యం లేకుండా బాగానే వుండేది. నేను పదవతరగతి చదివేటప్పుటి నుంచి ధ్యానం చేసేదాన్ని. అది కూడా పరీక్షల సమయంలోనే. ఆ తర్వాత ఇంటర్‌మీడియట్‌లో కూడా ధ్యానాన్ని రోజు సాయంత్రం ఒక అరగంట చేసేదాన్ని. ఇంజనీరింగ్‌లో జాయిన్ అయ్యాక నాకు హెల్త్ ప్రాబ్లెమ్స్ రావటం మొదలయ్యాయి. అయినప్పటికీ చాలా పట్టుదలతో కాలేజ్‌కి వెళ్ళి చదువుకున్నాను.

నేను B. Tech రెండవ సంవత్సరం పరీక్ష‌లు రాసిన తర్వాత నా హెల్త్ ప్రాబ్లమ్స్ మరీ ఎక్కువ అయిపోయాయి. ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి రోజూ ఎక్కువసేపు ధ్యానం చేసేదాన్ని. నా మనోధైర్యాన్ని పెంచుకోవటానికి ఈ ధ్యానం నాకు ఎంతో సహాయం చేసింది. నేను ఫైనల్ ఇయ‌ర్‌కి వచ్చేసరికి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అయిపోయి చివరికి చాలా కష్టం మీద కాలేజ్‌కి వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది.

అప్పుడు నేను ఇంకా బాధ భరించలేక డాక్టర్ (ఇంగ్లీష్) దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఇచ్చిన మందులతో నా ప్రాబ్లమ్ తగ్గకపోగా ఇంకా పెరిగింది. అలా కొన్నిరోజులకి నాకు పాస్ట్‌లైఫ్ థెరపీ గురించి తెలిసింది. డాక్టర్ హరికుమార్ గారి వర్క్‌షాప్‌కి వెళ్ళి కొన్ని సెషన్స్ చేసి నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను ఇంట్లో ఆ నేర్చుకున్నదాన్ని రెండునెలలు ప్రాక్టీస్ చేశాను. కానీ నాకు లోతైన అవగాహన లేకపోవటం వలన కొన్ని జన్మల చూసినా దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలీక మానేశాను.

ఆ తర్వాత నేను మెడిసిన్స్ మింగలేక హోమియోపతి వైద్యానికి షిఫ్ట్ అయ్యాను. కానీ ఏ ట్రీట్‌మెంట్ తీసుకున్నా ధ్యానం మాత్రం చేసేదాన్ని. ఆ తర్వాత నాకు సుధాకర్ రెడ్డి గారితో పరిచయం అయింది. ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో అసిస్టెంట్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్నారు. ఆయన చాలా సంవత్సరాలబట్టి పాస్టలైఫ్ థెరపి మీద ఎన్నో పుస్తకాలు చదివి సమగ్ర అవగాహన కలిగి వున్నారు. ఆయన్ను కలిసినప్పుడు నా గురించి చెప్పి నాకు పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ చెయ్యమని అడిగాను. నేను అడిగినదానికి ఆయన వెంటనే ఒప్పుకుని ఏప్రిల్ 24, మే 10, 2008 దాదాపు 15, 20 రోజులు వరుసగా నాకు రిగ్రెషన్స్ చేసారు. దాంతో నాకు చాలావరకు ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్లు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ నేను మామూలుగానే నడుస్తున్నాను.

నా ప్రాబ్లమ్‌కి రూట్‌కాజ్ తెలుసుకున్నాంటే...

నేను ఒక జన్మలో ఈజిప్ట్‌లో రాజుని(11-12th సెంచరి). అక్కడ జరిగిన యుద్ధపోరాటంలో ఒక శత్రురాజు నన్ను ఖండ ఖండాలుగా నరికివేశాడు. దాంతో ఆ బాధని నేను పూర్తిగా అనుభవించకుండా చనిపోయాను. ఆ చనిపోవడంలో నా ఆత్మ పూర్తిగా బయటకు రాలేదు. ఎక్కడైతే నా శరీరం నరకబడిందో ఆ యా చోట్ల నా ఆత్మ శకలాలు శరీరంలోనే ఉండిపోయాయి. అందుకే ఈ జన్మలో నాకు అన్ని జాయింట్స్‌లో నొప్పులు, స్టిఫెనెస్ స్వెల్లింగ్ ఉండే ప్రాబ్లమ్ వచ్చింది.

ఇప్పుడు నేను రిగ్రెషన్‌లో ఆ ఆత్మ శకలాలను దేవతల ద్వారా మళ్ళీ తిరిగి పొంది ఎనర్జీ బాడీకి ఇంటిగ్రేట్ చేసుకున్నాను. ఆ దేవతలు నాకు చాలారోజులు ఆస్ట్రల్ లెవెల్స్‌లో హీలింగ్ చెయ్యటం జరిగింది. దాంతో నా శరీరంలో మెల్లిగా మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఇంకా నేను చాలా జన్మలు దాదాపు 40 దాకా చూసుకోవటం, కర్మను రిలీజ్ చెయ్యటం జరిగింది. ఇప్పుడు నా DNA లో, Genecode లో మార్పులని అనునిత్యం ధ్యానంలో నేను రోజు గమనిస్తున్నాను.

 

T. శ్రీరమ్య
విశాఖపట్నం

Go to top