" బాధ్యత తీసుకుని నిర్వహిస్తూ వుండడం నాకు కలిగిన మహాద్భాగ్యం "

షుగర్ టెక్నాలజిస్ట్, మరి కెమికల్ ఇంజనీర్ మరి నిజామాబాద్ జిల్లాలోని బోధన్ - షక్కర్‍నగర్ చక్కెర ఫ్యాక్టరీ కి జనరల్ మేనేజర్‌ గా వున్న శ్రీ పలాస శేఖరయ్య గారు అతికొద్ది కాలంలోనే ధ్యానంలో గొప్ప అనుభవాలు పొంది ధ్యానం ద్వారా తాము పొందిన ఆనందాన్ని తన పరధి‌లోని ప్రతి ఒక్కరికీ పంచుతున్నారు. సౌమ్యులు, విద్యాధికులు, వయోధికలు, చక్కటి మేనేజ్‌మెంట్ స్కిల్స్ కలిగివున్న వీరి ఆధ్వర్యంలో ఈ నవంబర్ 11వ తేదీన బ్రహ్మర్షి పత్రీజీ యొక్క 61వ జన్మదిన వేడుకలు షక్కర్‌నగర్‌లోనూ, బాసర మహాక్షేత్రం‌లోనూ జరుగబోతున్నాయి. బ్రహ్మర్షి పత్రీజీ వేడుకలు తాము పనిచేస్తున్న చక్కెర ఫ్యాక్టరీ ఆవరణలో జరగడం శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు "మధుర" లో జరిగినంత ఆనందంగా భావిస్తున్నామని వారు తమ ఆత్మానుభూతి ని వ్యక్తం చేశారు. ఆరేడు నెలల స్వల్పవ్యధిలోనే ధ్యానం యొక్క గొప్పతనాన్ని అనుభవించి, వీలైనంత ఎక్కువమందికి తన ధ్యాన సంపదను పంచుతున్న వీరి అనుభూతులను పాఠకులందరూ ఆస్వాదిస్తారని విశ్వసిస్తున్నాం.


మారం శివప్రసాద్ : షక్కర్‌నగర్ చక్కెర ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్న మిమ్మల్ని, పత్రీజీ పుట్టినరోజు ఇక్కడ షక్కర్‌ నగర్‌లో మరి బాసరలో ఈ నవంబర్ ‌జరుగుతూ వుండగా, ఇంటర్వ్యూ చేయడం ఆనందంగా ఉంది. మీ గురించి చెప్పండి!

శ్రీ శేఖరయ్య : నేను కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఆ తర్వాత నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో షుగర్ టెక్నాలజీ పూర్తి చేశాను. 1974 లో భోధన్ షుగర్ ఫ్యాక్టరీ లో మ్యానుఫాక్చరింగ్ కెమిస్ట్‌గా చేరాను. ప్రస్తుతం నా వయస్సు 59 సంవత్సరాలు.

నా పెద్ద కుమారుడు M.D. జనరల్ మెడిసిన్ చేసి, మెడిసిటీలో జాబ్ చేస్తున్నాడు. చిన్నబ్బాయి M.Pharmacy చేసి జాబ్ చేస్తున్నాడు. నా భార్య శ్రీమతి రమ.

బ్రహ్మర్షి పత్రీజీ 61వ జన్మదినం వారి జన్మస్థలమైన ఈ షక్కర్‌నగర్‌లో, అది కూడా ... వారి తండ్రి స్వర్గీయ రమణారావు గారు పనిచేసిన మా షుగర్ ఫ్యాక్టరీ ఆవరణలో జరుపుకో బోతుండటం, ఆపైన ఆరోజు మధ్యాహ్నం నుంచి బాసర క్షేత్రంలో పత్రీజీ జన్మదిన వేడుకలు జరుగుతూండడం, ఆ ఏర్పాట్లన్నీ మా ఛైర్మన్ గారైన "గోకరాజు గంగరాజు" గారి ఆదేశంపై నేను బాధ్యత తీసుకుని నిర్వహిస్తూ వుండడం నాకు కలిగిన మహాద్భాగ్యం! ఈ ఆనందాన్ని నేను మాటలలో వర్ణించలేను!

పత్రీజీ బాల్యం, ఆటలూ, పాటలూ, ప్రాథమిక విద్య .. అన్నీ షక్కర్‌నగర్ లోనే జరిగాయి. వారు పుట్టిన హాస్పిటల్, వారు నివసించిన ఇల్లు, వారు క్రికెట్ మరి ఇతర ఆటలు ఆడుకున్న గ్రౌండ్స్, వారు ఇష్టపడి వస్తూ వుండిన రామాలయం, వారింటి దగ్గరలోని మసీదు .. ఇవన్నీ ఇక్కడ ఈ షక్క్‌ర్‌నగర్‌లో వుండడం ఈ గడ్డ చేసుకున్న మహద్భాగ్యం! కొంతమందికి పుట్టిన ఊరువల్ల పేరు వస్తుంది. మరి కొంతమంది వల్ల ఆ ఊరు చరితార్థమవుతుంది. గాంధీజీ పుట్టిన పోర్‌బందర్ లాగా పత్రీజీ జన్మించిన ఈ షక్కర్‌నగర్ కూడా సార్థకమయింది!

మారం : బోధన్ చక్కెర ఫ్యాక్టరీకీ, మీకు వున్న అనుబంధం గురించి చెప్పండి!

శేఖరయ్య : నా మొదటి అప్పాయింట్‌మెంట్ బోధన్ షుఘర్ ఫ్యాక్ట్రీలోనే జరిగింది. అయితే ఇక్కడ అప్పాయింట్‌మెంట్ అయిన కొంతాకాలం తర్వాత నన్ను ,ఆ ఫ్యాక్టరీ యొక్క మూడవ యూనిట్ ఐన జహీరాబాద్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఏడు సంవత్సరాలు జహీరాబాద్‌లో పనిచేసిన తర్వాత, మళ్ళీ షక్కర్‌నగర్ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. ఒక సంవత్సరం షక్కర్‌నగర్‌లో చేసిన తర్వాత మళ్ళీ జహీరాబాద్, ఆ తర్వాత బొబ్బిలి, మిర్యాలగూడ, మెట్‌పల్లి .. ఆ తరువాత మళ్ళీ 1998 లో షక్కర్‌నగర్‌కు ట్రాన్స్‌ఫార్ అవడం జరిగింది. నా మొదటి అప్పాయింట్‌మెంట్ ఇక్కడ కనుక మూడుసార్లు ఇక్కడ పనిచేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడే పనిచేస్తున్నాను. ఇతర ఊళ్ళల్లో ఏ ఉద్యోగం చేసినా, మదర్ యూనిట్ కనుక షక్కర్‌నగర్ అంటే నాకు ఎక్కడలేని అభిమానం! ఇక్కడ డిస్టిల్లరీ కూడా వుంది. పవర్ ప్లాంట్ వుంది. ఈ మూడింటికీ నేను ఇన్‌ఛార్జీగా వుంటున్నాను.

మారం : బ్రహ్మర్షి పత్రీజీ తో మీకు ఎప్పుడు పరిచయం జరిగింది? వారి పట్ల మీకంత మక్కువ కల్గించిన సంఘటన చెప్పండి!

శేఖరయ్య : గత సంవత్సరం పత్రీజీ షక్కర్‌నగర్‌లోని వారి స్వగృహంలో కేర్‌సెంటర్ పెట్టారు కదా .. వారు వచ్చారని తెలిసి అక్కడ కలిశాను. అదే మొదటి‌సారి వారిని కలవడం. అప్పుడే వారు చెప్పారు షుగర్ ఫ్యాక్టరీలో ఒక క్లాస్ పెట్టాలని. అలాగే ఈ సంవత్సరం మార్చిలో మన షుగర్ ఫ్యాక్టరీలోమా వర్కర్స్ అందరికీ క్లాస్ పెట్టాం. మీరు వచ్చారు కదా ఆ రోజు. I was very much moved by Patriji's speech, Message and meditation on that day! ఆ తర్వాత పత్రీజీతో మనం ఫ్యాక్టరీ అంతా తిరిగాం. ఏ ఏ సెక్షన్‌లో ఏ ఏ వర్క్ జరుగుతోంది చూసి వారు చాలా ఆనందపడ్డారు! వారి తండ్రి‌గారు ఇక్కడ లాబ్‌లో ఇన్‌ఛార్జీగా పనిచేసేవారు. ఆ వింగ్ కూడా చూసి అక్కడే కూర్చుని, వారు షుగర్‌కేన్ జ్యూస్ త్రాగించి, వారి తండ్రి గారితో కలిసి ఫ్యాక్టరీకి తమ చిన్నతనంలో వచ్చిన సంగతులు, జ్యూస్ త్రాగిందీ గుర్తు చేసుకున్నారు!

మారం : మరి మీరు రెగ్యులర్‌గా ధ్యానం చేస్తున్నారు మార్చి నెల నుండి! మీరు పొందిన ఫలితాలు? మీలో మార్పులు?

శేఖరయ్య : నేను ప్రతిరోజు ఒక గంట, బాగ బిజీగా వుంటే కనీసం ఒక అరగంట ధ్యానం చేస్తున్నాను. నాలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి! నాకున్న స్కిన్ ఎలర్జీ, మరి కళ్ళలో వున్న ప్రాబ్లమ్స్ తొలగిపోయాయి! వృత్తిరీత్యా చూసుకుంటే, ఈ ఫ్యాక్టరీలో గతంలో మేము ఎన్నో డెవలప్‌మెంట్ ఆక్టి‌విటీస్ చేపట్టాం. ఎంతో అభివృద్ధిని సాధించాం. అయితే గుర్తింపురాలేదు అని చాలా బాధ కలిగింది. ఇదంతా మార్చిలో పత్రీజీ యొక్క క్లాస్ ఫ్యాక్టరీలో పెట్టకమునుపు. ఈ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్ అయినప్పటినుండి వున్న సమస్యలు తొలగిపోయి, అద్భుతమైన ఫలితాలు సాధించినా రానిది ఆరోజు "పత్రీజీ ధ్యాన శిక్షణ" కార్యక్రమం తర్వాత గుర్తింపురావడం మొదలయింది!

ఎన్నో శ్రమలకోర్చి సాధించిన ఫలితాలు గుర్తింపు పొందడం మొదలయిన తర్వాత " ధ్యాన మహిమ" అర్థమయింది!

"Justice can be insured only in spiritual Life" అని అర్థమయ్యింది. ఆ తర్వాత శ్రమకు కలిగిన గుర్తింపు కంటే కూడా "ఆత్మానుభూతి" లోనే ఎక్కువ ఆనందం నాకు కలిగింది! దాంతో ధ్యానప్రచారంపై ఎక్కువదృష్టి కేంద్రీకరించాను!

ఇదివరలో మా ఫ్యాక్టరీలో ఎన్నో గొప్ప మార్పులకు కారణమైన కొంతమంది స్టాఫ్ పనిష్మెంట్‌కి గురయ్యారు. కారణాలు వారి కర్మఫలాలు అనుకుంటాను నేను. ఇదే విషయం వారికి చెప్పి, వారిని కూడా నేను బాగా ఎంకరేజ్ చేసి, అందరితో గంటల తరబడి ధ్యానం చేయించాను. ఆ ధ్యాస ఫలితాలు ఇప్పుడు అందుతున్నాయి! ఎవరైతే ఫ్యాక్టరీ అభివృద్ధికి కృషిచేసినా కూడా పనిష్మెంట్‌కు గురయ్యారో వారిలో ధ్యానం చేసిన వారందరూ మళ్ళీ లాభాలు పొందబోతున్నారు! అది అతి త్వరలో జరగబోతోంది!

మారం : మరి వృత్తిపరంగా మీకు కలిగిన లాభాలు వున్నాయా?

శేఖరయ్య : ఇదివరకు నేను ఈ ఒక్క యూనిట్‌కే ఇన్‌ఛార్జీగా వున్నాను. ఇప్పుడు మా యాజమాన్యంలోని మెట్‌పల్లి, మెదక్ యూనిట్లు కూడా నన్ను చూడమని అన్నారు! ఆ బాధ్యత వచ్చేసింది అకస్మాత్తుగా!!!

మా ఫాక్టరీ వర్కర్ల ఆలోచనల్లో అద్భుతమైన మార్పులు! There is a miraculous change in the mind of our workers&staff who had negative thoughts on the development activities in the factory earlier! అందుకే నేను ధ్యానానికీ మరి బ్రహ్మర్షి గారికీ ఎంతో ఋణపడి వున్నాను!

మా పనులకు, మాటకు ఎప్పుడైతే గుర్తింపు వచ్చిందో, మా వర్కర్లందరికీ ధ్యానం గొప్పతనం అర్థమయింది. మా ఆఫీసర్ కమ్యూనిటీలో అందరికీ నేను ఈ సందేశం ఇస్తున్నాను. వీలయినంత ఎక్కవమందిలో ధ్యానం చేయిస్తున్నాను.

మారం : 2001 ధ్యాన మహాయజ్ఞం కర్నూలు లో "సిరీస్ ఛైర్మన్ రాజు" గారు వచ్చారు. వారు తమ ఉపన్యాసంలో ఇలా చెప్పారు: "మా ఫ్యాక్టరీలో వర్కర్లందరూ డ్యూటీల్లోకి వస్తూనే ధ్యానం చేసి డ్యూటీ మొదలుపెట్టాలని వారికి చెప్పి, నెలకు 50 రూపాయలు ఇన్‌సెంటివ్ కూడా ఇచ్చాం మేము. ఆ తర్వాత మా ఫ్యాక్టరీలో ప్రొడక్షన్ రెట్టింపు అయింది ధ్యానం వల్ల". మరి మీరు కూడా మీ ఛైర్మన్ ని సంప్రదించి ఈ విధంగా చేస్తే?

శేఖరయ్య : ఓహ్! వండర్‌ఫుల్! I fully agree with you Sir! ధ్యానం వల్ల మైండ్ కాన్‌సన్‌ట్రేషన్, నిపుణత, కో-ఆర్డినేషన్, వన్‌నెస్ పెరుగుతాయి. ఉత్పాదక సామర్థ్యం రెండింతలు .. కాదు నాలుగింతలు .. అయినా మనం ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు! నేను ఈ విషయాన్ని తప్పకుండా మా ఛైర్మన్ "గోకరాజు గంగరాజు" గారి దృష్టికి తీసుకువెళ్ళి ఇంప్లిమెంట్ అయ్యేట్లుగా చూస్తాను. మనసా వాచా కర్మణా నేను దీనిని విశ్వసిస్తున్నాను. ఒక్క మా ఫ్యాక్టరీలోనే కాకుండా, In my areas of my movement, I Will advocate meditation. This is my real duty!

మారం : పత్రీజీ గురించి మీరేం అనుకుంటున్నారు?

శేఖరయ్య : గౌతమ బుద్ధుని లాగా సర్వస్వం త్యాగం చేసి, లోకకళ్యాణం కోసం శ్రమిస్తూ, అందరిలో ఆనందం చూడాలని వచ్చిన మహానుభావులు పత్రీజీ!

మారం : పత్రీజీ జన్మదినం ఎలా జరుపబోతున్నారు! ఏమేం చర్యలు తీసుకుంటారు? ఈ బాధ్యతకు ఎలా ఫీలవుతారు! మీ ఛైర్మన్ గారిని సంప్రదించినపుడు వారి అభిప్రాయం ఎలా వుంది!

శేఖరయ్య : పత్రీజీ జన్మదిన కార్యక్రమంలో ఫాక్టరీ తరుపున ఆర్థికంగా, ఫిజికల్‌గా మా అటెన్షన్ అంతా పెట్టి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. ఇది మా "ఛైర్మన్ గోకరాజు గంగరాజు" గారి దివ్యసంకల్పం! అందులో భాగంగా, ఈ కార్యక్రమాన్ని మరింత అద్భుతంగా జరపడానికి, మా స్టాఫ్ అంతా కూడా పాలుపంచుకోవడం కోసం నవంబర్ 9న ఆదివారం వర్కింగ్ డే అనౌన్స్ చేసి, నవంబర్ 11 వ తేదీ మంగళవారం పత్రీజీ జన్మదినం నాడు మా షుగర్ ఫ్యాక్టరీకి సెలవు ప్రకటిస్తాం!

పత్రీజీ జన్మించిన ఈ షక్కర్‌నగర్‌లో వారి జన్మదినం జరపడం అనేది "శ్రీకృష్ణుని జన్మదినం మధురలో జరపడం" అంత ఆనందం! అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం! 100% బాధ్యత తీసుకుని ఈ బాధ్యతను మేము నిర్వహిస్తాం!

మారం : మీ వర్కర్ల గురించి, మీ ఛైర్మన్ గారి గురించి చెప్పండి!

శేఖరయ్య : ధ్యానం చేసిన తర్వాత నా ఆత్మానుభూతిని కూడా నా వర్కర్స్‌కి నేను పంచాను. వారు కూడా నన్ను చక్కగా అభిమానిస్తారు.

మా ఛైర్మన్ గోకరాజు గంగరాజు గారు చాలా గొప్ప ఉదారులు. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించినవారు వారి కుటుంబసభ్యులందరూ ఛారిటబుల్ పర్సన్స్. వారు కూడా నన్ను, నా వర్క్‌మెన్‌షిప్‌ని ఎంతో అభిమానిస్తారు. మా ఛైర్మన్ జన్మదిన వేడుకలు కూడా ఇక్కడే షక్కర్‌నగర్‌లో మా ఫాక్టరీ ఆవరణలోనే వైభవంగా జరిగాయి! ఇప్పుడు అదే ప్లేస్‌లో మనం "బ్రహ్మర్షి పత్రీజీ" జన్మదిన వేడుకలు కూడా నిర్వహించుకో బోతున్నాం!

మారం : మీరు పిరమిడ్ మాస్టర్లకూ, ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకూ ఇచ్చే సందేశం?

శేఖరయ్య : ఈ ప్రాపంచిక జీవితంలో అమృతతుల్యమయిన మార్గం ధ్యానం అని నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. తనను తాను తెలుసుకుని. ఏ పనైనా చేయడం ధ్యానం ద్వారానే సాధ్యం. అనుమానాలను వదిలి ధ్యానానికి ప్రతిఒక్కరూ కూర్చుంటే చాలు, క్రమంగా జీవితం ఆనందమయం అవుతుంది.

నా ప్రయాణంలో, బస్సులో, ట్రెయిన్‌లో, కాలినడకలో ఎవరు పరిచయం అయినా నా ధర్మంగా తీసుకుని నేను ధ్యానం బోధిస్తున్నాను. నిన్న ఇక్కడ ఒక స్కూల్లో "Old Students Golden Jubilee Celebrations" జరిగాయి. అక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది, నా సినీయర్ జనరల్ మేనేజర్లను కొందరిని కలవడం జరిగింది. వారితో గడిపిన పది నిమిషాలలో వారికందరికీ ధ్యానం గురించి చెప్పాను. ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం ఇదే నా జీవితలక్ష్యం గా భావిస్తున్నాను!

Go to top