" మా పాప సంపూర్ణ ఆరోగ్యం పొందింది "

 

మా పాప పేరు శ్రావ్య. మా పాప పది సం||ల నుంచీ హెల్త్ ప్రాబ్లమ్‌తో బాధపడుతూ వుండేది. ప్రతి మూడు నెలలకు ఒక్కసారి హాస్పిటల్‌లో ICU లో చేరిస్తే గాని ప్రాబ్లమ్ తీరేది కాదు. గత కొన్నేళ్ళుగా మా పాపకు ట్రీట్‌మెంట్ ఇస్తున్న డాక్టర్ మా బాధలు చూసి "ఇల చేస్తే మీ పాప జబ్బు ఎన్ని సంవత్సరాలైనా తగ్గదు. ఇటువంటి నయంకాని జబ్బులను మెడిటేషన్ ద్వారా తగ్గించవచ్చు" అని చెప్పి దగ్గరలో వున్న పిరమిడ్ ధ్యానకేంద్రం అడ్రస్ ఇచ్చి పంపారు.

అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్ "వంశీ" గారు మాకు ధ్యానం గూర్చి పరిచయం చేసి దానివల్ల వచ్చే లాభాలను చాలా చక్కగా వివరించారు.

నేను, మా పాప, మా కుటుంబం అంతా కూడా ఆ పిరమిడ్ సెంటర్‌కి వెళ్ళి క్రమం తప్పకుండా ధ్యానం చేస్తూ వచ్చాం. కొన్ని రోజులకు చిత్రంగా మా పాప ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా తగ్గుముఖం పడ్తూ వచ్చి ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా అయ్యింది! గత మూడు సంవత్సరాలుగా మా పాపను అస్సలు హాస్పిటల్‌కు తీసుకుని వెళ్ళల్సిన అవసరం రాలేదు!

మేం పొందిన ఈ ఆనందాన్నీ, అదృష్టాన్నీ పదిమందికీ పంచిపెట్టాలని మాలాంటి ఎందరో అభాగ్యుల్ని ఆరోగ్యవంతులుగా చేయాలనే సత్‌సంకల్పంతో మా ఇంటిమీద కూడా "శ్రీ రమణ పిరమిడ్ ధ్యానకేంద్రం" కట్టాం. అక్టోబర్ 13, 2007 న బ్రహ్మర్షి పత్రీజీ గారు మా ఇంటికి వచ్చి, పిరమిడ్ ఓపెనింగ్ చేయడం, నిజంగా మా జీవితాల్లో ఎంతో ఆనందకరమైన విషయం.

పత్రీజీ కలలు "2012 ధ్యాన జగత్" కు మావంతు సహకారం అందచేయడం కోసం ప్రతి ఒక్కరికీ ధ్యానప్రచారం చేయడం ద్వారా మా జన్మలు సార్థకం చేసుకుంటున్నాం.

 

 

కింతలి శ్రీనివాస రావు
విశాఖపట్నం

Go to top