" థర్డ్ ఐ ఓపెన్ అయ్యింది "

 

నేను ధ్యానంలోకి రాకముందు నా చిన్నప్పటి పరిస్థితులు చాలా డిఫరెంట్‌గా వుండేవి. మా ఇంటి పరిస్థితులు మానసికంగా నాపై చాలా ప్రభావం చూపేవి. ఎవ్వరితోనూ నేను ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు. ఏదో కోల్పియిన ఫీలింగ్‌తో ఉండేదాన్ని. ఇంట్లో అందరితో గొడవ పెట్టుకునేదాన్ని "నేనెందుకు పుట్టాను? నాకింక ముక్తి లేదా?" అనుకుంటూ రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ ఎందుకు ఏడుస్తున్నానో నాకే తెలియని పరిస్థితిలో ఉండేదాన్ని. ధ్యానం గురించి ఎప్పుడూ ఆలోచించే దాన్ని. "వీరజగదీశ్వరీ వెంకటరెడ్డి" గారు వ్రాసిన" జ్ఞాన కిరణాలు" నన్నెంతగానో మార్చింది. ఆ సమయానికి మా అన్నయ్య కూడా ధ్యానం స్టార్ట్ చేసాడు. తనతో పాటూ నేనూ ధ్యానం కొద్దికొద్దిగా చేసేదాన్ని.

ధ్యానం మొదలు పెట్టిన తర్వాత నా జీవితంలో కోల్పోయిన ఆనందం తిరిగి వచ్చినట్లపించింది. నా ఆలోచనలో మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తోంది. పాజిటివ్ థింకింగ్ అలవాటయింది. నన్ను నేను గమనించుకోవడం మొదలుపెట్టా. కోపం తగ్గింది నాలో సృజనాత్మకత. ధ్యానం చేస్తున్నంతసేపు తర్వాత ఏదో అనందంలో తేలిపోయేదాన్ని.

ధ్యానం పరిచయం అయినప్పటి నుంచీ ఎన్నో విషయాలు పుస్తకాల ద్వారా, సిడీల ద్వారా, మాస్టర్స్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాను.

ఒకరోజు ధ్యానం చేస్తున్నపుడు నాకు "థర్డ్ ఐ" ఓపెన్ అయింది. తద్వారా నేను పత్రీజీని, బుద్ధుణ్ణి, ముమ్మిడివరం బాలయోగీశ్వర స్వామిని, అంజనేయస్వామిని, సాయిబాబాను, బాబాజీని, పరమహంస యోగానంద గారిని, వివేకానందస్వామిని, రామకృష్ణ పరమహంస గారిని, శివపార్వతులను, విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని, ఓషో గారిని, గాంధీజీని చూడగలిగాను!

నాకు చిన్నప్పటి నుండి మైగ్రేయిన్ తలనొప్పి ఉండేది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా తగ్గించుకోగలిగాను.

డిగ్రీ మొదటి సంవత్సరం లో కెమిస్ట్రీ ఎగ్జామ్ వ్రాసిన తర్వాత పాస్ అవుతానో లేదో అనే అనుమానం వుండేది. దాని గురించి చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఒకరోజు మెడిటేషన్‌లో పత్రీజీగారు కనిపించారు. నా ఎదురుగా కూర్చుని ఉన్నారు. "నీకు 59 మార్కులు వస్తాయి" అని చెప్పారు. కొంత రిలీఫ్ అయ్యాను. ఒక నెల తర్వాత మార్కుల లిస్ట్ చూస్తే అందులో కెమిస్ట్రీలో 59 మార్కులు వచ్చాయి!

మెడిటేషన్ చేయడం ద్వారా Soul బయటకు రావడం చూసుకున్నాను! నా ముఖంపై తెల్లని కాంతి కనిపించింది. నేను మెడిటేషన్‌లో ఉన్నప్పుడు, రెండు కనుబొమ్మల మధ్య భాగంలో మసకగా, బోధివృక్షం క్రింద ధ్యానముద్రలో పత్రీజీ కనిపించారు. నిజంగా ఎంతో అద్భుతంగా ఉంది ఈ అనుభవం.

మెడిటేషన్ చేయటం ద్వారా నాలో చిన్నప్పటి నుంచి దాగి వున్న ఆర్ట్ చాలా ఇంప్రూవ్ అయింది. ముఖ్యంగా పత్రిసార్ ప్రోత్సాహం వలన న్యూఏజ్ స్పిరిచ్యువల్ మాస్టర్స్ 200 మంది చిత్రాలు గీశాను! తిరువణ్ణామలై ధ్యానయజ్ఞంలో మరి బుద్ధపూర్ణిమ మహోత్సవాలు బెంగుళూరు లో ఎగ్జిబిషన్ పెట్టమని పత్రిసార్ చెప్పారు. దాదాపు రూ|| 6,000/- వచ్చింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. మ తల్లిదండ్రులకు ‘ఆర్ట్’ అంటే ఇష్టం లేదు. కానీ ఎగ్జిబిషన్ పెట్టిన తర్వాత మా తల్లిదండ్రులు కూడా నాకు ప్రోత్సాహం ఇచ్చారు. B.F.A. (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఎంట్రన్స్ టేస్ట్ వ్రాయటానికి 15 రోజుల ముందు మా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. మెడిటేషన్ చేస్తూ చదువుతూ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే ఆంధ్రా యూనివర్శిటీలో 20 ర్యాంకుతో ఫ్రీ సీట్ వచ్చింది. జూలైలో ఆంధ్రా యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. దీనకంతటికీ పరోక్షంగా కారణమైన పత్రిసార్‌కు నా కృతజ్ఞతలు!

మెడిటేషన్ అనేది తరిగిపోని ఆత్మజ్ఞానాన్ని పంచే ఒక వరం. అందరం ధ్యానం చేద్దాం. ధ్యాన ప్రచారం చేద్దాం. ధ్యాన ప్రపంచానికై మన వంతు కృషి చేద్దాం!

 

సుధాపార్వతి
కొత్తపేట

Go to top