" చదువులో చాలా చాలా ఇంప్రూవ్‌మెంట్ "

 

నా పేరు గాయిత్రి, మాది తాడిపత్రి. ప్రస్తుతం చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాను. నేను ధ్యానం మా అమ్మ చెప్పటం ద్వారా చేయటం మొదలుపెట్టాను. ధ్యానం చేయకమునుపు మా అమ్మ చాలా అనారోగ్యంతో బాధపడుతూ మంచంమీద పడి వుండేది. మా అమ్మ వెన్నముక దగ్గర డిస్క్ ప్రాబ్లమ్ వలన చాలా తీవ్రంగా బాధపడేది. ధ్యానాన్ని 21 రోజులపాటు ఉరవకొండ "లోబ్‌సాంగ్ రాంపా పిరమిడ్"లో చేసింది మౌనంగా. రాంపా మాస్టర్ ఆస్ట్రల్‌గా మా అమ్మకు చాలా శక్తినిచ్చారు. ఇప్పుడు మా అమ్మ మాకంటే ఎంతో హుషారుగా పనిచేస్తోంది! చిన్న బరువు కూడ ఎత్తలేని మా అమ్మ మాకంటే ఎంతో హుషారుగా పనిచేస్తోంది! చిన్న బరువు కూడా ఎత్తలేని మా అమ్మ మౌనధ్యానం ద్వారా తన రోగాన్ని నయం చేసుకుంది. తద్వారా నేను, మాఅక్క, మాఅన్న అందరం ధ్యానం చేయడం మొదలుపెట్టాం. నాకు 10వ తరగతిలో 539 మార్కులొచ్చాయి! చదువులో చాలా ఇంప్రూవ్‌మెంట్ వచ్చింది. మా ఇంట్లో అందరం మాంసం తినటం మానేశాం! మా నాన్నగారిలో కూడా చాలా మార్పు వచ్చింది. ఆధ్యాత్మికంగా మాకు అన్ని విషయాలలో చేయూతనిస్తున్న "శివబాలయోగి పిరమిడ్ ధ్యానకేంద్రం" దంపతులకు ఎంతో ఋణపడి వున్నాం. మా అన్నకు 10వ తరగతిలో 520 మార్కులొచ్చాయి, ఇంటర్మీడియట్‌లో కూడా మంచి మార్కులొచ్చాయి. ధ్యానం ద్వారా మా అందరిలో ఆనందం వస్తోంది.

నేను మా స్కూలులో చాలా ధ్యానం క్లాసులు చెప్పాను. స్టూండెంట్స్, టీచర్స్, డైరెక్టర్, ప్రిన్సిపాల్ సార్ అందరికి ధ్యానం గూర్చి చెప్పటం జరిగింది! నాకు ధ్యానంలో ఎన్ని అనుభవాలు వచ్చాయి. ఇప్పుడు ఏ భయాలు, టెన్షన్‌లు లేవు. చాలా చాలా చక్కగా చదువుకుంటున్నాను. ధ్యానకేంద్రంలో కూడా చాలా క్లాసులు చెప్పాను. నేను కొన్ని వేలమందికి ధ్యానం గురించి తెలియజేసాను!

ధ్యానం చేయటం ఎంతముఖ్యమో,ధ్యానప్రచార చేయటం అంతకన్నా ముఖ్యం. ఈ ధ్యానాన్ని జగత్ అంతటికీ ప్రసాదిస్తున్న బ్రహ్మర్షి పత్రీజీకి నా ధ్యానాభివందనాలు.

 

గాయత్రి
తాడిపత్రి

Go to top