" ఈ పుణ్యభూమిలో నివాసం మా అదృష్టం "

 

మేము కడ్తాల్ .. " కైలాసపురి " లోనే మొట్టమొదటి గృహం నిర్మించుకున్నాం ! 2012 దీపావళి పర్వదినం రోజున సాక్షాత్తు భగవత్ స్వరూపులు పత్రీజీ దివ్యహస్తాల మీదుగా గృహప్రవేశం జరిపించుకుని " ఆదివరలక్ష్మీ సదన్ " గా నామకరణం జరిపించుకున్నాం !

" యాభైయేళ్ళ మా స్వంత ఇంటి కల " అలా పత్రీజీ చేతుల మీదుగా సాకారం కావడం మా జన్మజన్మల సౌభాగ్యం ! ఈ గృహం నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు జరిగాయి ! కనీసం గత 20 యేళ్ళుగా గృహనిర్మాణం కోసం మేము ఎన్నో ప్రయత్నాలు చేసినా ముందుకు సాగని పని .. కేవలం ఎనిమిది నెలల్లో .. " కైలాసపురి " లో పూర్తి చేయగలిగాము. రెల్లుగడ్డితో పాటు, పూర్తి ప్రకృతి పదార్థలతో దీనిని మేము ఒక ఆశ్రమంగా నిర్మించాము. ధ్యానంలో ఆ ఇంటి డిజైన్ చూసుకోవడం మరి అత్యాధునిక హంగులతో దానిని నిర్మించుకోవడం జరిగింది.

నిర్మాణ సమయంలో " ‘ మే ’ నెల తరువాత రెల్లుగడ్డి మళ్ళీ దొరకదు " అని తెలియడంతో దానిని ముందే తెప్పించుకున్నాం. మూడు లారీల " దర్భగుడి " నాలుగు నెలల ముందే తెచ్చి .. వట్టి నేలపై పెట్టడంతో అందరూ .. " ఇది చెదల భూమి .. చెదలు తినేయడంతో పాటు .. వర్షం వస్తే అది కుళ్ళిపోతుంది " అని చెప్పారు.

నేను అదేమీ పట్టించుకోకుండా ధ్యానంలో కూర్చుని .. చెదలకూ, వర్షానికీ, ప్రకృతికీ నాలోని ప్రేమను తెలుపుకుని .. " ఏం జరిగినా స్వీకరించడానికి నేను సిద్ధం " అని స్నేహంగా విన్నవించుకున్నాను. ఆశ్చర్యంగా నాకు ధ్యానంలో చెదలు ఆ గడ్డిని కాపలా కాస్తూ కనిపించాయి !

నాలుగు నెలల తరువాత .. విపరీతమైన వర్షాలలో తడిసి కూడా .. వేసిన గడ్డి వేసినట్లే .. ఏ మాత్రం చెక్కు చెదరకుండా వుండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు ! ఆ ప్రాంతం యొక్క విశిష్టత, పిరమిడ్ శక్తి గొప్పదనం, బ్రహ్మర్షి పత్రీజీ మహనీయత్వం మేం అడగడుగునా అనుభూతి చెందుతున్నాం !

ప్రస్తుతం మేము ఇద్దరం .. ప్రతిరోజూ మహాపిరమిడ్‌కు వచ్చీపోయేవాళ్ళకు ధ్యానం గురించి చెప్తూ వారికి పత్రీజీ ధ్యాన - జ్ఞానవాణి " ధ్యానాంధ్రప్రదేశ్ " ను పరిచయం చేస్తూ .. వేలమందికి ధ్యానప్రచారం చేసుకుంటూ మా జన్మలను ధన్యం చేసుకుంటున్నాం!

ఈ పుణ్యభూమిలో నివాసం ఉండడానికి స్థల యజమానులంతా ముందుకు వచ్చి విశ్వకల్యాణంలో భాగం పంచుకోవల్సిందిగా కోరుతున్నాం!

 

T. వరలక్ష్మి
సెల్ : +91 8466866166

Go to top