" ఇప్పుడు నేనెంతో ఆరోగ్యంగా వున్నాను "

 

నా పేరు నాగఆదిలక్ష్మి. నా వయస్సు 37 సంవత్సరాలు. మాది పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం. నాకు గాల్‌బ్లాడర్‌లో అనారోగ్య సమస్యలు వచ్చి శస్త్రచికిత్స ద్వారా గాల్‌బ్లాడర్ తీసేశారు. అయినా నా అనారోగ్య సమస్య తీరకపోగా పైనుంచి చాలా సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చాయి. నాలుగు సంవత్సరాలు గడిచినా బాధలు తగ్గలేదు. ధ్యానం మొదలుపెట్టిన తర్వాత ఒకరోజు బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో మండల ధ్యానం చేయమని సందేశం వచ్చింది. పిరమిడ్ వ్యాలీకి వచ్చి ధ్యానం చేస్తున్నాను. 21 రోజులు గడిచాయి. ఇంటికి వెళ్ళిపోవాలని అనిపించింది. కానీ ఆ రోజు " మండల ధ్యానానికి వచ్చావు; 21 రోజులైనా కాలేదు; ఇక్కడ వుండు " అని స్వరం వినిపించింది. ఇద్దరు మునీశ్వరులు సూక్ష్మరూపాల్లో వచ్చి గిన్నెతో మిరియాలతో కూడిన ద్రవం లాంటిది ఇచ్చి త్రాగించి అదృశ్యమయ్యారు. ఇదంతా పిరమిడ్ కింగ్స్ ఛాంబర్‌లో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు జరిగింది. ఇప్పుడు నా ఆరోగ్యం పూర్తిగా బాగయింది. పిరమిడ్‌కి వచ్చి మండల ధ్యానం చేయటం వలన సంపూర్ణ ఆరోగ్యం పొందాను. నాకు చాలా ఆనందంగా వుంది. పత్రీజీకి, ట్రస్ట్ వారికీ నా అభినందనలు !

 

Y.నాగఆదిలక్ష్మి
తాడేపల్లిగూడెం
పశ్చిమగోదావరి జిల్లా

Go to top