" ధ్యానంలో ఎన్నో మెస్సేజ్‌లు పొందుతున్నాను "

 

నా పేరు లలిత. మాది కర్నూలు.

2003 వ సంవత్సరం ఆగష్టులో స్వప్న మేడమ్, సతీష్ మాస్టర్‌ల ద్వారా ధ్యాన పరిచయ భాగ్యం లభించింది. అప్పటి నుండి ప్రతిరోజూ క్రమం తప్పకుండా నాలుగు గంటల పాటు ధ్యాన సాధన చేస్తున్నాను.

ధ్యానం చేయక ముందు ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందేదానిని. ధ్యానం ద్వారా ఆందోళన మొత్తం పోయింది. ధ్యానంలో కూర్చోగానే మొదటగా రంగులు కనిపించడం జరిగింది. తరువాత కొన్ని రోజులకు వీరబ్రహ్మేంద్రస్వామి కనిపించారు. ఆయన నేను ఒక జన్మలో మంచి మిత్రులమని, తరువాత ధ్యానంలో తెలుసుకున్నాను. ధ్యానంలో ఆయన నుండి మెస్సేజ్‌లను తీసుకునేదాన్ని. బ్రహ్మం గారు వ్రాసిన తత్త్వాలు లా నాకూ వ్రాయాలనిపించింది. చాలా వరకు వాటిలాగే రాశాను.

ప్రస్తుతం మా ఇంట్లో నేను, మా వారు, మా అత్త ఇంకా ఇద్దరు పిల్లలు అందరం ధ్యానం చేస్తున్నాం. ప్రతి బుధవారం మా ఇంట్లో ఉచిత ధ్యాన శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాం. సుమారు 80 మంది పాల్గొంటారు. ప్రతి పౌర్ణమికీ బుద్ధా పిరమిడ్ ధ్యానకేంద్రంలో ధ్యానం చేసుకుంటాం.

నా జీవితంలో మరుపులేని అనుభూతి బ్రహ్మర్షి పత్రీజీ గారిని కలవడం. ఆయనను మొదటగా చూసినప్పుడు అనిర్విచనీయమైన అనుభూతి కలిగింది. సార్ ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకున్నాను.

నా సందేశం:- ధ్యానం చేయనప్పుడు అందరిదీ గమ్యం లేని ప్రయాణం. ధ్యానం చేసినప్పుడు గమ్యం తెలిసిన ప్రయాణం. కాబట్టి ధ్యానం చేయండి, చేయించండి.

 

R. లలిత
1-216
కర్నూల్

Go to top