" ధ్యానం నా జీవితంలో ఒక భాగమయింది "

 

నా పేరు మురళి. నేను ప్రతిరోజూ ధ్యానం చేస్తాను. ధ్యానం వల్ల నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. ధ్యానం చేయడం వల్ల నేను చదువుపై ఎక్కువ శ్రద్ధ వుంచగలిగాను. ఉపాధ్యాయులు బోధించిన విషయాలను సులభంగా అర్ధం చేసుకోగలుగుతున్నాను. ధ్యానం నా జీవితంలో ఒక భాగం అయ్యింది.

ధ్యానం వల్ల నా జీవితంలో నేను ఊహించని సంఘటనలు జరిగాయి.

ఒకసారి నేను, నా ఫ్రెండ్ కలిసి తాడిపత్రి నుండి బస్సులో రాత్రి 9.45 సమయంలో ప్రయాణం చేస్తున్నాం. బస్సులో మేము, డ్రైవర్, కండక్టర్ తప్ప ఇంకెవ్వరూ లేరు. నాది రామకోటి, మా ఫ్రెండ్‌ది పప్పూరు. "ఇద్దరి ఊర్ల మధ్య ఒక కి.మీ దూరం ఉంది. ఇంటికి వెళ్ళడానికి తోడు ఎవ్వరూ లేరు" అని ఆందోళన చెందుతూ ధ్యానం చేశాం. మాస్టర్లు, మాకు తెలిసిన వాళ్ళ రూపంలో వచ్చి, వచ్చినట్లు ధ్యానంలో కనబడింది. ధ్యానం పూర్తయిన తర్వాత చూస్తే నిజంగానే వాళ్ళు వున్నారు.

ఒకసారి నాకు తీవ్ర జ్వరం, జలుబు, తలనొప్పి వచ్చాయి. మా ఇంట్లో వాళ్ళు డాక్టరును తీసుకొస్తామన్నారు. కానీ నేను "డాక్టర్ వద్దు, మందులు వద్దు, నేను ధ్యానం అనేమందు ద్వారా మాస్టర్ల సాయంతో వ్యాధి నయం చేసుకుంటాను." అని చెప్పాను. అలా చెప్పి, వెంటనే ధ్యానంలో కూర్చున్నాను. మరుసటి రోజుకు జ్వరం, తలనొప్పి పోయాయి.

దీనికి అంతా కారణం ధ్యానం అని అర్ధం చేసుకున్నాను. ధ్యానం అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిన, చేయించాల్సిన కార్యక్రమం. నాకు, మా తరగతి విద్యార్థులందరికీ ధ్యానం పట్ల అవగాహన పెంపొందిచిన వారి మా సోషల్ మేడమ్ శ్రీమతి K.శ్రీదేవి గారు ... ప్రతి రోజూ క్లాసు ప్రారంభంలో పది నిమిషాలు ధ్యానం చేయిస్తున్నారు. ధ్యానానికి సంబంధించిన పుస్తకాలను కూడా మాతో చదివించారు. ఇప్పుడు తరగతిలో అందరికీ ఆత్మవిశ్వాసం పెరిగింది.

ప్రస్తుత నాగరికత సమాజంలో బాంధవ్యాలు దాటి, మనమెవరో గుర్తించి, ప్రవర్తించటం అంత సులభం కాదు. దుర్లభమైన మానవ జన్మను వ్యర్థమైన పనులకు వెచ్చించేబదులు ధ్యానం చేసి మోక్షం పొందాలని నా కోరిక.

 

D. మోహన్ మురళి
Z.P. హైస్కూల్, పెద్ద పప్పూరు
అనంతపురం జిల్లా

Go to top