" గ్రహణశక్తి పెరిగింది "

 

నా పేరు ముంతాజ్. పదవతరగతి చదువుతున్నాను. మా టీచర్ ధ్యానం గురించి క్లాసులో వివరించారు. అది విని నేను ధ్యానం చేయడం ప్రారంభించాను. ధ్యానానికి ముందు నాకు గ్రహణశక్తి, జ్ఞాపకశక్తి అంతగా ఉండేవి కావు. అందువల్ల ఎప్పుడూ మార్కులు తక్కువుగా వచ్చేవి. కానీ ధ్యానం తరువాత ఏ విషయాన్నైనా ఇట్టే గ్రహించి గుర్తుపెట్టుకోగలుగుతున్నాను.

ఇదేకాక ధ్యానంలో నాకు ఎన్నో మంచి అనుభవాలు వచ్చాయి. తొలిసారి స్వామివివేకానంద కనిపించారు. తరువాత సత్యసాయిబాబా, సుభాష్ పత్రీజీ ... ఇలా ఎందరో కనిపించారు.

ఒకరోజు ధ్యానంలో మూడు ఎలుగబంట్లు వచ్చి నా ధ్యానాన్ని ఆటంక పరచసాగాయి. వెంటనే నేను వాటితో ధ్యానం చేయించాను. కాసేపటికి అవి స్త్రీలుగా మారాయి. వారంతా దేవకాంతితో మెరుస్తూ వున్నారు. వారి తల వెనుక కాంతి వలయం తిరుగుతూ వుంది.

"ధ్యానంలో అంతర్ యాత్రలు" .... అన్న పుస్తకం చదివాక నాకు ధ్యానం మీద ఆశక్తి పెరిగింది.

 

K. ముంతాజ్
పెద్ద పుప్పూరు
అనంతపూరం జిల్లా

Go to top