" పిరమిడ్ల కోట .... జగ్గయ్యపేట "

 

పిరమిడ్ సొసైటీల వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రీజీ గారి ధ్యానస్ఫూర్తితో "జగ్గయ్యపేట పిరమిడ్ కోటగా మారుతుందా" అనిపిస్తుంది.

జగ్గయ్యపేటలో 1-05-2002వ తేదీన జగ్గయ్యపేట పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీని స్థాపించగా మొదటి సమావేశానికి విజయవాడ సీనియర్ శ్రీ J.రాఘవరావుగారు, హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ నరేంద్ర, శ్రీ మారం శివప్రసాద్‌లు మార్గదర్శనం చేశాను. వీరి స్ఫూర్తితో స్థానిక పిరమిడ్ మాస్టర్లు పౌర్ణమి ధ్యానం సందర్భంగా విజయవాడలోని రాఘవరావు గారి ఇంట్లో నిర్మించిన పిరమిడ్‌లో ధ్యానం చేయడం సంభవించింది.

ఈ సందర్భంగా విశేష ధ్యానానుభవానికి గురైన పిరమిడ్ మాస్టర్లు వీరవల్లి విశ్వేశ్వరరావుగారు పట్టణంలోని దుకాణాలలో పిరమిడ్‌ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడమే కాకుండా వారి నిర్మించిన కళ్యాణమండపం పై భాగంలో వాటర్ ట్యాంక్ మీద, ఈశాన్య ఆగ్నేయ భాగాలలో పిరమిడ్‌లు నిర్మించారు.

పట్టణంలో వేరే ప్రాంతాలలో త్రాగే మంచినీటికి కళ్యాణ మండపంలోని పిరమిడ్ వాటర్‌కు తేడాను గమనించి పట్టణంలోని అనేకులు పిరమిడ్ ఆవశ్యకతను గుర్తించారు. ఇంతటిలో ఆగకుండా విశ్వేశ్వరరావుగారు తమ కిరాణాషాపు మీద కూడా 15 * 15 సైజు గల పిరమిడ్‌ను నిర్మించి పట్టణంలోని ప్రధాన రహదారికి దగ్గరగా పిరమిడ్‌లో ధ్యానం చేయడానికి అవకాశం కల్పించారు.

ఈ స్ఫూర్తితో మరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాలవాయి వెంకట నరసింహారావు గారు మరి గుడివాడ లక్ష్మణరావు కూర్చొని ధ్యానం చేసిన వ్యక్తులకు అనేక అనుభవాలను సానుకూలంగా ఉండడంటో విశ్వేశ్వరరావుగారు తాను నిర్మించిన నూతన గృహం పైన 17 * 17 సైజు పిరమిడ్‌ను నిర్మించగా 2005, ఆగష్టు 14న బ్రహ్మర్షి పత్రీజీ గారు దానిని ప్రారంభించారు. అదేరోజున మరో పిరమిడ్ మాస్టర్ కొంకిమళ్ళ నాగేశ్వరరావు గారి గృహంలో ఇంటీరియర్ పిరమిడ్ 6 * 6 సైజు పిరమిడ్‌ను కూడా పత్రీజీ గారు ప్రారంభించారు.

వీలయిన తరహాలో పిరమిడ్‌ను ప్రతి గృహంలో ఏర్పాటు చేసుకుని ధ్యానంలో ఉన్నతస్థానాన్ని పొందాలని ఈ సందర్భంగా పత్రీజీ గారు అన్నారు. జగ్గయ్యపేటలో పిరమిడ్‌లు నిర్మించిన మాస్టర్లందరినీ పత్రీజీ అభినందించారు.

ప్రతి పిరమిడ్‌లోనూ ధ్యానం తరగతులు నిహించబడడం జగ్గయ్యపేట పిరమిడ్ల ప్రత్యేకతగా చెప్పవచ్చు. పత్రీజీ గారు నూతనంగా విశ్వేశ్వరావు గారి గృహంలో ప్రారంభించిన పిరమిడ్‌లో పది కొలోల క్రిస్టల్స్‌ను అమర్చడం విశేష అంశం.

 

నోముల కృష్ణమూర్తి
H.P.C.బ్యాంక్

జగ్గయ్యపేట

కృష్ణాజిల్లా - 521176

Go to top