" పత్రీజీ "

 

నా పేరు విజయమనోహర. నా స్వగ్రామం మెదక్ పట్టణం. నేను రామాయంపేట ప్రభుత్వం ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాను.

నేను గత ఆరు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నాను. ధ్యానమనే అద్భుతమైన ఆయుధాన్ని నాకు అందించిన పత్రీజీగారికి అనుక్షణం నేను కృపాపాత్రీయురాలిగా ఉండి జీవిస్తున్నాను.

ధ్యానం మొదలుపెట్టినప్పటి నుంచి నా ఆరోగ్యం, ఆర్థికపరిస్థితి, ఆలోచనాసరళి, టెన్షన్‌లు, నిర్ణయాలు తదితర అంశాలకు సంబంధించి నా జీవన సరళిలోనే అద్భుతమైన మార్పులు వచ్చాయి.

నాకు ఆస్ట్రల్ మాస్టర్స్ (ఆంజనేయస్వామి, లార్డ్ కృష్ణా, సాయిబాబా, సిద్ధార్థ, భక్తపోతన, భక్తమార్కండేయ, ఇంద్రుడు, వీరేశలింగంపంతులుగారు మరి ఇంకెందరో...) ఎన్నో మెస్సేజె‌స్ ఇస్తున్నారు. వాటిని నేను వ్రాసి వుంచుతున్నాను. నేను రోజూ బస్‌లో స్కూల్‌కు వెళ్తూంటాను. ప్రయాణంలో ఉన్నప్పుడు ఎక్కువుగా మెస్సేజస్ వస్తూంటాయి. అందులో నా పరమాత్ముడు పరబ్రహ్మ పత్రీజీ గారిపై వచ్చింది వ్రాస్తున్నాను.

"పత్రీజీ, మీ మోము చూస్తే ముక్కోటి దేవతలు దర్శనమైనంత ఆనందపడుతుంది నా మనస్సు.

"పత్రీజీ, మీ నవ్వు చూస్తే కోటిగులాబీలు వికసించి గుబాళింపును ఒక్కసారి వెదజల్లినట్లు ఆనందడోలికలూగిపోతుంది మనస్సు.

"పత్రీజీ, మీ కళ్ళు చూస్తే కోటి కాంతులు చల్లని కరుణతో కూడిన కాంతిని నా ఒళ్ళంతా కప్పి 'నీకే భయమూ లేదు, నేనున్నా' నని చెబుతున్నట్లుగా ఉంటుందీ మనస్సుకి."

"పత్రీజీ, మీ చేతిలోకి నా చేయిని తీసుకుని కరచాలనం చేసినప్పుడు కోటి విద్యుత్ కాంతులు నాలోకి ప్రవేశించి నాలోని ప్రతి కణంలోకి చేరి అందులోని మాలిన్యాలను కాల్చేసి, 'నీలో ఇక నెగటివిటీ లేదు అంతా పాజిటివ్ ఎనర్జీ నింపాను' అన్నంత ధీమాగా ఉంటుందీ తనువుకీ, మనస్సుకీ".

"పత్రీజీ, మీ మాటలు వినగానే మీ శక్తి భాండాగారం నుండి విశ్వశక్తి అంతా నాపై కురిసి బ్రహ్మరంధ్రం ద్వారా నాలోకి చేరి నన్ను పవిత్రం చేసి పూర్తిగా ఆధ్యాత్మిక లోయలోకి దూకేస్తున్నట్లుగా ఉంటుందీ తనువుకీ, మనస్సుకీ".

"పత్రీజీ, మీ వాక్కులు ఈ చెవినపడగానే ఎన్నో జన్మల నుండి చేసిన వాగ్ధానాలు, కర్తవ్యాలు, అసలెందుకిక్కడికి వచ్చామా అని పూర్వదశకు వెళ్ళి అన్నీ తెలుసుకోవాలన్న తపనలోకి వెళ్ళిపోతుందీ మనస్సు".

"పత్రీజీ, మీ కాళ్ళ స్పర్శ తగలగానే పుణ్యగంగలో మునిగి పునీతులమైనట్లు, పాపనాశంలో మునిగి పావనమైనట్లు 'స్వర్గమెక్కడో లేదు ఇక్కడే ఉంది' ... అన్నట్లుగా మనస్సంతా నిండిపోయి మూగబోతుంది. హృదయం అంతా శూన్యమైపోతుంది. ఎవరెరగని సత్యాన్ని నేనే ఎరిగానన్నంత ఆనంద డోలికలూగుతుందీ మనస్సు".

"మీ సాన్నిధ్యంలో ఎంతటి మధుర అనుభూతులను పొందుతుందో ఈ మనస్సు. ఎంత ప్రేమగా తట్టిలేపారీ మనస్సుని. కలల నుండి వాస్తవంలోకి. కర్తవ్యాన్ని చూపించి నన్ను నేనేంటో గ్రహించేట్టుగా చేసిన మీకు శతకోటి పాదాభివందనాలు చెబుతుందీ మనస్సు. స్వీకరించండి".

ధ్యానమే ధ్యేయమన్నట్లుగా చేసిన ఈ మనస్సు ... ధ్యాన నియమాలే నాలోని భాగాలు అన్నట్లున్న ఈ మనస్సు .... ధ్యాననుభవాలే నా కుటుంబసభ్యులనే ఈ మనస్సు .... ధ్యానం చెప్పడమే నా కర్మఫలితాలంటుందీ మనస్సు.

 

C.B.విజయ మనోహర్
1-4-40, మెదక్ - 502110
సెల్ : +91 9346254321

Go to top