" లైఫ్ మెంబర్‌షిప్ "

 

నా పేరు M.C. ముద్దయ్య. వయస్సు 40 సంవత్సరాలు. మాది కర్నూలు జిల్లా బేతంచర్ల. నేను ధ్యానంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు అయ్యింది. నేను 25 సంవత్సరాల నుండి మాంసాహారం మానేశాను. నేను స్వశక్తితో ఒక వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాను. నేను ఒక సంకల్పం చేస్తే అది మాస్టర్స్ నెరవేర్చారు. అదేమిటంటే . . .

2005, మే లో జరిగిన మన బెంగళూరు పిరమిడ్ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో విశాఖపట్నం పిరమిడ్ మాస్టర్ బాబ్జీ గారు స్టేజి మీద ఒక మాట చెప్పారు. " మనం సంపాదించిన దాంట్లో 10% గానీ, 15% గానీ దానం చెయ్యాలి ... ఇది మన పురాణాలలో కూడా ఉంది. ఆ విధంగా మన బెంగళూరు పిరమిడ్‌కు దానం ఇచ్చినట్లు వుంటుంది. ప్రతి ఒక్కర్ లైఫ్ మెంబర్‌షిప్ చెయ్యండి. లైఫ్ మెంబర్‌షిప్ 15,000/- రూపాయిలు. పిరమిడ్ నిర్మాణానికి ఆర్థికంగా ఇబ్బందిగా వుంది. దయచేసి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయండి" ... అని చెప్పారు. అప్పుడు నేను అనుకున్నాను నేను ఎందుకు చేయకూడదు మెంబర్‌షిప్ అని. నా ఆదాయం సంవత్సరానికి 30,000/-, దాంట్లో 15,000/- ఇవ్వలేను కదా సరే, బాబ్జీ మాస్టర్ చెప్పినట్లు నేనూ ఇస్తాను. పర్సెంటేజ్ ప్రకారం నాకు మాస్టర్స్ సహాయం చేయాలి. నేను ఖచ్చితంగా డిసెంబర్ ధ్యాన యజ్ఞంకు మెంబర్‌షిప్ చెయ్యాలి అని సంకల్పం చేసాను అక్కడే. ఖచ్చితంగా నేరవేరింది. డిసెంబర్ 30వ తేదీన మెంబర్‌‍షిప్ చేసాను.

నేను ధ్యానులను కోరేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ లైఫ్ మెంబర్‌షిప్ చెయ్యడానికి మనస్ఫూర్తిగా సంకల్పం చేయండి, మిగతాది మాస్టర్స్ చేస్తారు. ఇది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది నా జీవితంలో తెలుసుకున్న సత్యం. మీ డబ్బులు ఇవ్వవద్దు. 15% దానం చెయ్యండి చాలు.

ప్రతి ఒక్కరూ "బెంగళురు పిరమిడ్ ఎంతవరకు వచ్చింది?" అనేవారే కానీ "మనమెంత సహాయం చేసాం?" అని ఆత్మవిమర్శ చేసుకోవడం లేదు. అది గురువు గారిది ఒక్కరి బాధ్యతేకాదు అందరి ధ్యానుల బాధ్యత. ఇది మరువకండి. ఒక్కసారి లైఫ్ మెంబర్‌షిప్ చేయండి ఎంతో ఆనందాన్ని పొందండి. నేను దాంట్లో భాగస్వామిని. "నాది ఒక యిటుకరాయి ఉంది" అన్న ఆనందం చాలు. గడ్డిపోచలు కూడా మదపుటేనుగును బంధించగలవు కదా. అలాగే మనమంతా కలిసికట్టుగా లైఫ్ మెంబర్‌షిప్ చేసి బెంగళూరు మెగాపిరమిడ్ పూర్తి చేద్దాం. అందరూ ఈ ఆనందాన్నిమనసారా పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.

ధ్యానం అంటేనే ప్రాణం నాకు,
గురూజీని చూస్తేనే, ఆనందం బ్రహ్మానందం,
అందరూ కావాలి ధ్యానులుగా,
చేయించాలి ధ్యానులుగా,
జీవించాలి బుద్ధునిగా,
జీవితాన్ని ఆచరంచాలి పత్రీజీ గారి జీవితంలా

మాంసాహారం మానేయండి, అన్నిప్రాణులనూ సమానంగా ప్రేమించండి. "ఎవరైతే జీవారాధకుడో, వాడే నిజమైన దైవారాధకుడు" అన్నారు కదా స్వామి వివేకానంద.

 

 

M.C.మద్దయ్య
బేతంచర్ల, కర్నూలు జిల్లా

Go to top