" కాలచక్రలో ధ్యానచక్రం "

 

2006, జనవరి 5,6 తేదీలలో అమరావతిలో జరుగుతున్న కాలచక్ర ప్రోగ్రామ్‌కు హైదరాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ మరి సైంటిస్ట్‌అయిన శ్రీ A.నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అమరావతికి వెళ్ళిన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కాలచక్ర ఆవరణలో గ్రూప్ మెడిటేషన్ చేయడం జరిగింది.

ఈ మెడిటేషన్ (శ్వాస మీద ధ్యాస) చేస్తున్నప్పుడు కాలచక్ర ఆవరణలో నుండి బుద్ధిస్ట్ మాంక్స్ ఇద్దరు రావడం జరిగింది. వీరు శ్వాస మీద ధ్యాస మెడిటేషన్‌లో పాల్గొన్నారు. వీరు ఎవరనగా ఆనాటి ఆనాపానసతిని తెలియజేసిన బుద్ధుడు, నేటి శ్వాస మీద ధ్యాస తెలియజేసిన మైత్రేయ బుద్ధుడు పత్రీజీ. వీరిని పిరమిడ్ మాస్టర్ నాగేశ్వరరావు గారు గుర్తించి అందరికీ తెలియజేశారు. ఇది నిజంగా పిరమిడ్ మాస్టర్స్‌కు చాలా ఆత్మనందాన్ని కలుగజేసింది.

తరువాత "ఈTV2" వారు నాగేశ్వరరావు గారితో ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలో నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ బుద్ధుడు తెలియజేసిన అంటే తాను ఆచరించి ప్రజలను అందించిన ఆనాపానసతిని గురించి వివరించారు. ఇప్పుడు బ్రహ్మర్షి పత్రీజీ శ్వాస మీద ధ్యాసగా తెలియజేసి 2008కి ధ్యాన భారత్‌ను, 2012 ధ్యాన జగత్‌ను చేయడానికి పూనుకొన్నారని తెలియజేశారు. పత్రీజీ చేస్తున్న ధ్యాన యజ్ఞంలో దేశం నలుమూలల నుండి ఎందరో మైత్రేయ బుద్ధులు అంటే పిరమిడ్ మాస్టర్స్ కూడా తమ వంతు కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. పిరమిడ్ ధ్యానం వలన ప్రజలకు కలిగే లాభాలను ఆయన తెలియజేశారు.

ఈ ఇంటర్వ్యూ తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషలలో 40 నిమిషాల చొప్పున జరిగింది. అమరావతిలో కాలచక్ర ప్రోగ్రామ్‌కు వెళ్ళిన పిరమిడ్ మాస్టర్స్ కొందరు అంటే థర్డ్ ఐ మాస్టర్స్ ఆస్ట్రల్‌గా విచ్చేసిన గ్రాండ్ మాస్టర్స్‌ను గుర్తించడం జరిగింది. ఇది పిరమిడ్ మాస్టర్స్ తమ అనుభవాలను అందరితో పంచుకుని ఆనందించిన విషయం. శ్రీ నాగేశ్వరరావు గారు ఈTV2 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బుద్ధుడు తెలియజేసిన అష్టాంగ మార్గం గురించీ, మరి పిరమిడ్ మాస్టర్స్ 18 సూత్రాలను తెలియజేసారు.

 

T.S.సోమశేఖర్
విశ్వశక్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం
తూర్పుగోదావరి జిల్లా

Go to top