" ధ్యాన ప్రచారంలోని గొప్పదనం "

 

 

నా పేరు పార్వతి. ప్రస్తుతం తిరుపతి వాస్తవ్యురాలినైన నేను ఉద్యోగరీత్యా మా వారు అనంతపూరంలో ఉన్నప్పుడు 2007 లో పిరమిడ్ ధ్యానపరిచయం పొందాను. ధ్యానం వలన కలిగే లాభాలనూ మరి ధ్యానప్రచారంలో ఉన్న గొప్పదనాన్ని గురించి తెలుసుకుని .. అక్కడ ధ్యాన శిక్షణా తరగతులను నిర్వహిస్తూన్న పిరమిడ్ మాస్టర్లను కలిసి ఇంటింటా ధ్యానం కార్యక్రమంలో భాగంగా సుమారు 200 మందితో, మా ఇంట్లో కూడా ధ్యానశిక్షణను ఏర్పాటు చేశాం. ఈ క్రమంలో గర్భసంచికి చెందిన ఒకానొక సమస్యతో బాధపడుతూన్న మా అన్నయ్య భార్యకు ఆపరేషన్ చేయించుకోవలసిన పరిస్థితి రాగా, నేను ఆమెకు ధ్యానశక్తిని గురించి చెప్పి ఆమెతో ధ్యానం చేయించాను.పూర్తి శాకాహారిగా మారిన ఆమె 40 రోజుల పాటు రోజుకు రెండు గంటల చొప్పున ధ్యానం చేస్తూ .. మధ్య మధ్యలో డాక్టర్‌తో పరీక్ష చేయించుకుంటూ ఆపరేషన్ అవసరం లేకుండానే తన అనారోగ్య సమస్య నుంచి బయటపడింది ! సర్వరోగనివారిణి అయిన " శ్వాస మీద ధ్యాస - ధ్యానం " ద్వారా మా కుటుంబం సభ్యులం అంతా కూడా శారీరక, మానసిక మరి ఆత్మపరమైన లాభాలను ఎన్నింటినో పొందాము. మా ఆలోచనా విధానంలో కూడా చక్కటి మార్పు వచ్చి ప్రతి ఒక్కరితో అవగాహనా పూర్వకంగా ఉండగలుగుతున్నాము. ఉన్నత విలువలతో కూడిన ధ్యాన - జ్ఞాన శాస్త్రీయ సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ చేరవేస్తూన్న పిరమిడ్ సొసైటీ కరదీపిక .. " ధ్యానాంధ్రప్రదేశ్ " మాసపత్రికకు రాజపోషకులుగా పత్రిక అభివృద్ధిలో భాగస్వాములం అవుతున్నందుకు సంతోషపడుతున్నాం ! ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన పత్రీజీకి కృతజ్ఞతలు !!

 

 

 

G.పార్వతి

తిరుపతి పట్టణం 

సెల్: 9676614099

Go to top