" ఆత్మసంతృప్తి - ఆధ్యాత్మిక అభివృద్ధి "

 

 

మారం: సర్వేష్ గారూ! 2001 లో వెంకటేష్ గారి తర్వాత మీరు కూడా "ధ్యానాంధ్రప్రదేశ్" ఆధ్యాత్మిక మాసపత్రిక ప్రారంభింపబడినప్పటి నుండి ఇప్పటివరకు Designer గా ఈ మ్యాగజైన్ ఆఫీస్ స్టాఫ్‌లో ఒక మూలస్తంభంగా ఉన్నారు. " ధ్యానాంధ్రప్రదేశ్ " పత్రిక .. " ధ్యాన జగత్ " గా మారుతున్న ఈ సందర్భంగా మీ సందర్భంగా మీ అనుభవాలను అనుభూతులను మన పాఠకులకు అందించాలనుకుంటున్నాం.


సర్వేష్: థాంక్యూ మారం సార్! " ధ్యానాంధ్రప్రదేశ్ " తో మీకు అనుబంధం ఉన్నట్లుగానే ప్రారంభం నుండే నాకు కూడా అనుబంధం వుంది. సంచిక ప్రారంభం అయిన మొదటి రోజు నుంచి వెంకటేష్ మరి నేను ఇందులోనే ఉన్నాం. ఇప్పుడు మన ధ్యానాంధ్రప్రదేశ్ " ధ్యానజగత్ " గా రూపాంతరం చెందడం ఎంతో ఆనందంగా ఉంది. నేను M.Com కంప్లీట్ చేయకుండానే Multi Media Course చేసి Web Designing లో తర్ఫీదు పొందాను. " క్రియేటివిటీ " అంటే నాకు చాలా ఇష్టం. నేను మన " ధ్యానాంధ్రప్రదేశ్ " మ్యాగజైన్‌లో ఇమిడిపోవడానికి కారణం నాకు వున్న ఆధ్యాత్మిక తృష్ణ, వెబ్ డిజైనర్‌గా ట్రైన్ అయివుండడం ! స్వాధ్యాయం పట్ల నాకు ఎంతో ఇష్టం ఉండడం కూడా మరొక ముఖ్య కారణం !

 

మారం: మీ ఆధ్యాత్మిక జీవనానికి సోపానం ఏమిటి? మీరు ‘ ఓషో ఆశ్రమం ’లో ఉన్నట్లు నాకు తెలుసు. అలాగే ఎప్పుడూ ‘నిశ్శబ్దం’ గా స్థిరచిత్తంతో ఉంటారు! కారణం తెలుసుకోవచ్చా!


సర్వేష్: తప్పకుండా! మా నాన్న హైస్కూల్ టీచర్‌గా చేసి రిటైర్ అయ్యారు. ఆయన భోజనం కంటే కూడా పుస్తకాలను ఎక్కువుగా ఆస్వాదించేవారు. భారతదేశంలోని ఎంతోమంది యోగీశ్వరుల ఆధ్యాత్మిక గ్రంథాలు ఆయన సేకరించి చదివేవారు. నా మూడవ సంవత్సరం నుండే నాకు ఈ పుస్తకాలతో అనుబంధం. నా స్కూల్ పుస్తకాలతో బాటు ఈ పుస్తకాలను కూడా నేను ఆ వయస్సు నుంచే చదివేవాడిని. ఇప్పటికీ చదువుతూనే ఉంటాను. ఈ స్వాధ్యాయ ప్రేరణ వల్లనే నేను బషీర్‌బాగ్ లో ఉన్న " ఓషో సెంటర్ "కు రెగ్యులర్‌గా వెళుతుండేవాడిని! ఓషో పుస్తకాలు అంటే నేను పడి చచ్చేవాడిని. ఆ ఓషో పుస్తకాలే నేను పూనా ఓషో ఆశ్రమానికి వెళ్ళడానికి కారణభూతమయ్యాయి. అక్కడ నేను రెండు సంవత్సరాలలో ఎంతో సాధించుకున్నాను. బాహ్యంలో ఎన్ని శబ్దాలు ఉన్నా, అంతరంలో ‘ నిశ్శబ్దం ’ సాధించుకోవడంలో నేను కృతకృత్యుడనయ్యాను. ఇప్పటికీ 17 సంవత్సరాల తర్వాత కూడా నేను అంత నిశ్శబ్దంగా వుండగలుగుతున్నాను.

 

మారం: ‘ ఓషో ప్రసాద్ ’ తో మీకు ఎప్పుడు ఎలా పరిచయమైంది? మరి ధ్యానాంధ్రప్రదేశ్ డిజైన‌ర్‍గా మీరు ఎలా స్థిరపడ్డారు.


సర్వేష్: నన్ను, ప్రసాద్‌ను కలిపింది. " ఓషోసెంటర్ " ! ప్రసాద్ కూడా నాలాగే ఓషో అభిమాని ! బషీర్‌బాగ్‌లోని " సంతోషానందస్వామి " గారి దగ్గర నుంచి ధ్యానాంధ్రప్రదేశ్ మాసపత్రిక కోసం పూనా నుంచి వచ్చిన 'Osho photos' వున్న CD ని ప్రసాద్ తీసుకెళ్ళాడు. దాన్ని తీసుకురమ్మని సంతోషానంద గారు నన్ను ప్రసాద్ వాళ్ళ Officeకు పంపారు.

 

నేను వెళ్ళేసరికి, ప్రసాద్ బృందం Designer విషయంలో తీవ్రమైన తర్జన భర్జన పడుతున్నారు. అది 2001 సంవత్సరం డిసెంబర్ మాసం! " ధ్యానాంధ్రప్రదేశ్ " మొదటి సంచిక ! డిసెంబర్‌లో కర్నూల్లో జరిగే ధ్యానమహాయజ్ఞం సందర్భంగా రిలీజ్ అవ్వాలి. అలాగే " రామ్తా " తెలుగు అనువాదం. ఈ రెండింటికీ కవర్ పేజీ డిజైనర్ దొరక్కవాళ్ళు అవస్థపడుతున్నారు. వాళ్ళ మాటలు వింటూ ఆఫీస్ కలియజూస్తున్నప్పుడు అక్కడ అరలలో " జొనాథన్ లివింగ్‌స్టన్ సీగల్ ", " ఆత్మాయణం ", " మరణం లేని మీరు " వంటి పుస్తకాలతో పాటు ఓషో పుస్తకాల తెలుగు అనువాదాలు కనపడుతున్నాయి. ఇంకా ఎన్నో దేశ విదేశీ యోగుల పుస్తకాలు తెలుగులో చూసి నాకు ఆశ్చర్యం కలిగింది ! నేను కలలో కూడా ఊహించని అత్యద్భుత ఆధ్యాత్మిక కలెక్షన్! " ఓహో! నేను సరియైన చోటుకే వచ్చాను " అనుకున్నాను. ఆరోజు కర్నూల్లో ధ్యానాంధ్రప్రదేశ్ - రామ్తా బుక్స్ రిలీజ్ గురించి ధ్యానాంధ్రప్రదే ఆఫీస్‌లో ఓషో ప్రసాద్, T.మురళీధర్ గారు, P.G.రామ్మోహన్ గారు, వెంకటేష్ మాట్లాడుకుంటున్నారు. నేను " నాకు కొద్దో గొప్పో డిజైనింగ్ వచ్చు ; మీ పని చేసి పెడతాను " అని చెప్పి, చేశాను. కవర్ పేజీల డిజైన్ వారికి నచ్చింది. అలా ప్రతి నెలా నేను వచ్చి డిజైనింగ్ చేసి వెళ్ళేవాడిని. బహూశా like minded people అంతా ఇలాగే ఒకచోట చేరుతారు అనుకుంటా.

 

మారం: బ్రహ్మర్షి పత్రీజీ మీరు ఎప్పుడు ఎక్కడ కలిశారు? ఆ విశేషాలు చెప్పండి! వారిని చూఇనప్పుడు మీకు కల్గిన అనుభూతి?"


సర్వేష్: 2002 ఫిబ్రవరి, మార్చిల్లో పత్రీజీతో నాకు పరిచయం చేయించారు అల్వాల్ మురలి గారు " సార్, మన ఆస్థాన డిజైనర్ " అని! నేను పూనాలో ఓషో ఆశ్రమంలో రెండు సంవత్సరాలు ఉండి వచ్చాను అనీ, డిసెంబర్‌లో పత్రిక, మరి రామ్తా కవర్ డిజైన్ చేసి ఇచ్చిన విషయం కూడా చెప్పారు మురళీధర్ గారు. సార్ ఎంతో ఆనందంగా అభినందించారు! పత్రీజీ ఎప్పుడూ అందరితో కలివిడిగా ఉంటారు. ఏ హంగులు, భేషజాలు లేకుండా ఉన్న ఈ గురువు నాకెంతో నచ్చారు!

 

మారం: ధ్యానాంధ్రప్రదేశ్ మ్యాగజైన్ గురించి మీరంతా ఏం చేసేవారు? ఆఫీస్‌లో ఏమేం చర్చలు జరిగేవి?"


సర్వేష్: ఎన్నో పగళ్ళు, రాత్రులు మేమంతా .. అంటే, ఓషో ప్రసాద్, అల్వాల్ మురళీధర్ గారు, వెంకటేష్, రామ్మోహన్ సార్ అంతా కలిసి మ్యాగజైన్ ఇంకా ఇంకా అద్భుతంగా ఎలా తీసుకురావాలి? ఏమేం ఆర్టికల్స్ వేయాలి? ఇంకా ఏ కొత్తదనం తీసుకురావాలి? ఇలా సాగేవి మా చర్చలు. ఎన్నోసార్లు మా చర్చల్లో " రమాదేవి మేడమ్ " కూడా పాల్గొనేవారు.

 

మారం: మీరు చేస్తున్న, మీరు తీసుకున్న బాధ్యతల గురించి వివరిస్తారా?


సర్వేష్: ప్రతినెలా కంపోజింగ్, డిజైనింగ్, ప్రింటింగ్ చేయించడం వంటి బాధ్యతలన్నీ నావే ! అంటే ఆఫీస్‌లో చివరి ప్రతి వరకు అంతా సెట్‌ చేసి ప్రింటర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి, ప్రెస్‌లో ప్రింటర్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి, ప్రింటింగ్ ఆర్డర్‌ ' ok ' చేయడం వరకు ఈ బాధ్యతలన్నీ నావే ! ఇంతే కాక అల్వాల్ మురళీధర్ గారు, తర్వాత చక్రపాణి గారి సమయంలో దాదాపుగా 50% ఆర్టికల్స్ కూడా కూడా నేనే సెలక్ట్ చేసి, సెట్ చేసి రెడీ చేసేవాణ్ణి. ఆ తర్వాత పత్రిసార్ స్వయంగా ఫైనల్ చేసేవారు.

 

మారం: మన ‘ ధ్యానాంధ్రప్రదేశ్ ’ మ్యాగజైన్ గురించి మీకేం అనిపిస్తుంది? ప్రతి నెలా మ్యాగజైన్ చూస్తున్నప్పుడు మీరెలా ఫీలవుతారు?! "


సర్వేష్: చాలా గొప్ప, అద్భుతమైన ఆధ్యాత్మిక పత్రిక " ధ్యానాంధ్రప్రదేశ్ " ! PSSM యొక్క ప్రతి విషయాన్నీ సోదాహరణంగా వివరిస్తుంది. ఆధ్యాత్మికత అంటే భక్తి అనుకునేవారికి " ధ్యానాంధ్రప్రదేశ్ "ను మొదటిసారి చూస్తే ఆశ్చర్యం మరి ఆనందం కలగడం ఖాయం! ఇంత ఆధ్యాత్మిక సమాచారాన్ని కలిగి ఉన్న పత్రిక మరొకటి ఏ భాషలోనైనా వుందా అనిపిస్తుంది. ఏ నెలకు ఆ నెల ధ్యానాంధ్రప్రదేశ్ నాకు నూతనంగా కనిపిస్తుంది. అంతే కాదు దానికోసం పని చేయటం నాకు ఎంతో ఆత్మతృప్తితో పాటు ఎనలేని ఆధ్యాత్మిక అభివృద్ధిని కూడా ఇస్తోంది. అప్పట్లో ధ్యానాంధ్రప్రదేశ్‌ లోనే DTP ఆపరేటర్‌గా ఉన్న " జ్యోతి " తోనే బ్రహ్మర్షి పత్రీజీ స్వయంగా అశోకా గార్డెన్స్‌లో వివాహం జరిపించారు.

 

మారం: మీరు గత 38 ఏళ్ళుగా స్వాధ్యాయం చేస్తున్నారు! మరి ధ్యానాంధ్రప్రదేశ్ పాఠకులకు ఒక స్వాధ్యాయ యోగిగా మీ సందేశం!


సర్వేష్: గత 38 ఏళ్ళుగా నేను ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతున్నాను. అయితే ప్రతి పుస్తకం ఎప్పటికప్పుడు మరింత గొప్ప అర్థాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఉదాహరణకు 1998 లో చదివిన ‘ మిర్దాద్ ’ పుస్తకం ఇప్పుడు చదివితే కూడా అప్పటికంటే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. కారణం ఎవరికి వారికి అవగాహనా సామర్థ్యం, ఆధ్యాత్మిక పరిధి కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. అలాగే మిగతా గొప్ప పుస్తకాలు కూడా! వాటిలో విషయం మారలేదు .. మనం ఎదిగాం అంతే! అందువల్ల గొప్ప పుస్తకాలు తప్పకుండా మళ్ళీ మళ్ళీ వీలయినప్పుడల్లా చదువుతూనే చదవాలి!

 

 

D.సర్వేష్

హైదరాబాద్

Go to top