" మరపురాని ఆనందం ఇచ్చింది కర్నాటక ధ్యాన మహాచక్ర-1 "

 

 

నేను 2007 సంవత్సరంలో ధ్యానంలోకి రావడం జరిగింది. చెళ్ళికెరె రోటరీక్లబ్‌లో బళ్ళారి పిరమిడ్ మాస్టర్ లక్ష్మీగారు మరి కొంతమంది ధ్యానకార్యక్రమం నిర్వహించారు. నేను ఆ కార్యక్రమానికి వెళ్ళి 30 ని||లు ధ్యానం చేయడం నా జీవితాన్ని మార్చివేసింది. ఎంతో హాయిగా ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ 30 ని||ల ధ్యానం. ప్రతిరోజూ విధిగా ధ్యానం చేస్తూ నా కుటుంబ సభ్యులకు కూడా ధ్యానం నేర్పించడం జరిగింది. నా తల్లి సుబ్బలక్షమ్మ, తండ్రి చిదానంద గుప్త, కుమారులు సచిన్, సుజన్ అంతా ధ్యానం చేస్తారు. ఇలా సాగిపోతూండగా ఒకరోజు మా ప్రక్క ఊరు దావణగిరికి బ్రహ్మర్షి పత్రీజీ వస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళి పత్రీజీని కలిశాను. అక్కడ నుంచి నా జీవన శైలి మరింత మారిపోయింది !

 

2007లో పిరమిడ్ వ్యాలీలో జరిగిన బుద్ధపౌర్ణిమ ఉత్సవాల అనంతరం ఊటి టూర్ ఏర్పాటు చేశారు. నేను కూడా టూర్‌కి వెళ్ళడం పత్రీజీని అత్యంత సమీపంగా చూస్తూ వారితో కలిసి వుండడం మహా అద్భుతంగా అనిపించింది. పత్రీజీ అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి, ఆ తర్వాత అందరినీ అనుభవాలు అడిగారు. అందరూ వారి వారి అనుభవాలను వివరించారు. ఆ టూర్‌లోనే శ్రీ ప్రేమనాథ్ గుప్తగారి పరిచయం వారితో సత్సంగం, వెంటనే వారిని చెళ్ళికెరెకు రావాలని కోరడం జరిగింది. వారు చెళ్ళికెరెలో అద్భుతమైన క్లాసులలో చెళ్ళికెరెలో ధ్యానుల బృందం ఏర్పడింది.

 

మా ఊరిలోని మున్సిపల్ పార్కులో 33'x33' పిరమిడ్ నిర్మాణం జరిగింది ! దానిని పత్రీజీయే ప్రారంభించారు ! ప్రతి 4 నెలలకు పత్రీజీ రావడం మాకు మంచి స్ఫూర్తి ఇవ్వడం మమ్మల్ని ప్రోత్సహించడం తద్వారా చుట్టుప్రక్కల గ్రామాలకు పిరమిడ్ ధ్యానం ప్రచారం అయి ఒక పెద్ద సొసైటీగా ఏర్పడడం జరిగింది !

2014 మే నెలలో పిరమిడ్ వ్యాలీలో జరిగిన " కర్నాటక ధ్యాన మహాచక్ర -1 " 7 రోజుల కార్యక్రమంలో అతి ముఖ్యమైనది అన్నప్రసాద వితరణ. ఆ బాధ్యతను చెళ్ళికెరె సొసైటీ స్వీకరించి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు అన్నదానంలో చెళ్ళికెరె టీమ్ చాలా చక్కగా పనిచేశాం. ఆ కార్యక్రమం ఎంతో తృప్తిని ఇచ్చింది. జీవితంలో మరచిపోలేని అనుభవం. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజానాలలో పత్రీజీ వచ్చి వడ్డన చేసేవారు ! ఈ 8 రోజులు ఉదయం ధ్యానం చేయడం మిగిలిన సమయం అంతా డైనింగ్‌లో గడపడం ఓ వేడుకులా జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో పిరమిడ్ మాస్టర్లను కలవడం జరిగింది !

 

గత 5సం||ల నుంచి చెళ్ళికెరెలోని ప్రతి వీధిలోనూ విస్తృతంగా ధ్యానం, శాకాహారం గురించి ప్రచారం చేశాం. చెళ్ళికెరె, మరి

చుట్టుప్రక్కల గ్రామాలలో 15 రూఫ్‌టాప్ పిరమిడ్‌ల నిర్మాణం జరిగింది.

 

ఎన్నో సేత్ విజ్ఞానం వర్కుషాపులు, ఆస్ట్రల్ హీలింగ్ వర్కుషాపులు, మరి ఎందరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ల క్లాసులు నిర్వహించాం. ఇలా ధ్యాన పరిప్రచారం చేసుకుంటూ ముందుకు సాగిపోవడమే ఈ జీవిత లక్ష్యంగా మా కుటుంబం నిర్ణయించుకున్నాం. ధ్యానం చేయడం, ధ్యానం చెప్పడం, పిరమిడ్ నిర్మాణాలు చేపట్టడం ఎవరు ఎక్కడికి రమ్మని పిలిస్తే అక్కడికి వెళ్ళి ధ్యానప్రచారం చేయడం. ముఖ్యంగా బ్రహ్మర్షి పత్రీజీ అదేశాలు, సూచనలు పాటిస్తూ వాటిని అమలు చేయడమే ఈ జీవిత లక్ష్యం, అందరికీ ఆత్మప్రణామాలు !

 

 

A.C.నాగేంద్రన్
చెళ్ళికెరె

కర్నాటక రాష్ట్రం
సెల్:09480344774

Go to top