" విశ్వకళ్యాణంలో స్వీయకళ్యాణం "

 

 

నా పేరు శివరామ్ పమజుల కడపజిల్లా ‘ రాజుల తాతయ్య గారి పల్లె ’లో జన్మించిన నేను B.Sc. కంప్యూటర్స్ చదువుకున్నాను. చిన్నప్పటి నుంచే నన్ను తీవ్రంగా వేధిస్తున్న ‘ ఆస్తమా ’ వ్యాధి నివారణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. 2008 లో మా అన్నయ్య ఇంట్లో ఉంటూ " Animation" కోర్స్ చేస్తున్న నేను " ధ్యానం ద్వారానే ఆరోగ్యం - ఆనందం - ఆత్మజ్ఞానం " అనే బ్యానర్‌ను వెంగళరావు నగర్‌లోని సీనియర్ పిరమిడ్ మాస్టర్ అప్పారావు గారి ఫ్లాట్ ముందు చూడడం జరిగింది. ఆ తరువాత రోజు గురువారం ఆ సెంటర్‌లో నా భాగ్యవశాత్తు సీనియర్ పైమా మాస్టర్ " సౌమ్య " క్లాసు విని ధ్యానం చేసి విశ్రాంతినీ, సౌకర్యాన్నీ, ప్రశాంతతనూ పొందాను.

 

41 రోజుల దీక్షగా గంటలు గంటలు ధ్యానం చేయడం నాలోని ఆస్తమా తీవ్రత తగ్గి ఆరోగ్యం మెరుగుపడడం, జంటనగరాల్లోని వివిధ పిరమిడ్ సెంటర్లకు వెళ్ళి ఎన్నో ధ్యాన తరగతుల్లో పాల్గొనడం, పూర్ణ ఆరోగ్యాన్ని పొందడం జరిగింది. " Multi Media -3D Animator " గా జీవితంలో స్థితం కావాలనుకున్న నా దృక్పధాన్ని కాస్త మార్చుకుని PSSM లో Graphics Designer గా స్వచ్ఛంద సేవలు చేయడం మొదలుపెట్టాను ! ధ్యాన జగత్ సంపత్ యొక్క సహకారంతో పిరమిడ్ వ్యాలీ బెంగళూరులో Web and Graphic Departmentలోకి మరింతగా సేవలు అందిస్తూ ఎదుగుతున్నాను.

 

ఇక నేను పిరమిడ్ వ్యాలీలో బుద్ధ పౌర్ణమి రోజు మే 14, 2014న ‘ అనుకృష్ణన్ ’ను! పిరమిడ్ మ్యారేజ్ చేసుకున్నాను. తాను B.A. హిస్టరీ చేసింది, కేరళ రాష్ట్రం త్రిస్సూర్ జిల్లా వాసి ; 2003లో 10వ తరగతి చదువుతున్న సమయంలో బుద్ధుని చరిత్ర చదివి ఎంతో ఆకర్షితురాలయిన ‘ అనూ ’ ఆ తపనతో హరిదాస్ అనే స్నేహితుడి ద్వారా " విపస్సన ధ్యాన సాధన " చేసింది. మరిన్ని బుద్ధుని సందేశాల కోసం Google లో Search చేస్తూ You Tube లో పిరమిడ్ మాస్టర్ " అయ్యప్ప " ఆనాపానసతి ధ్యానం - PSS movement గురించి చెప్పిన విషయాలు, వారి నుండి తెలుసుకున్న PSS movement Websiteలో ‘ పత్రీజీ ’ వివిధ విషయాల గురించి వివిధ సందర్భాలలో ప్రవచించిన Audio, Video లు చూసింది. ఆమె వెతుక్కుంటున్న జ్ఞానమంతా విశేషంగా పొందడం జరిగింది ! ధ్యానం చేసిన తాను Mega Pyramidను చూడాలనుకోవడం, Mega Pyramidనూ మరి నన్నూ అక్కడే వ్యాలీలో చూడడం జరిగింది.

 

అయ్యప్ప గారి పిలుపు మేరకు ‘ అనూ ’ PSS movement.org Website ని మలయాళ భాషలోకి అనువదించే పనిలో భాగంగా మలయాళంలో DTP చేయడం కోసం 2013 డిసెంబర్ 16న పిరమిడ్ వ్యాలీకి వచ్చింది. అప్పుడు ‘ కబీర్ భవన్ ’ లో తనతో నాకు తొలిపరిచయం అయ్యింది. 2013 డిసెంబర్‌లో కడ్తాల్ " ధ్యానమహాచక్రం - IV " లో మేమిద్దరం కలుసుకున్నప్పుడు " మనం ఇద్దరం పెళ్ళి చేసుకుంటే బాగుంటుంది " అని నేను అనుకుంటున్నాను ; మీకు కూడా ఇష్టం అయితే మా తల్లిదండ్రులతో మాట్లాడండి " అని చెప్పింది. ఆ పద్ధతి నాకు నచ్చి " నీతో ఇంకా వివరంగా మాట్లాడాలి. ముఖ్యంగా మన గురువు గారి పత్రీజీ అనుమతి కావాలి ; వీటి అన్నింటికి ఒక నెల సమయం పడుతుంది " అని చెప్పగా ఆమె " సరే " అంది. ఆ తరువాత ఫిబ్రవరి 2014 లో పత్రీజీ పిరమిడ్ వ్యాలీకి వచ్చినప్పుడు ఈ విషయం చెప్పాను. సార్ " ఆమె గొప్ప మాస్టర్ ఇక్కడే బుద్ధపౌర్ణమి రోజున పెళ్ళి చేసుకోండి " అని చెప్పారు. పత్రీజీ గారి దివ్యాశీస్సులు ఇవ్వడం ఇక మా పెళ్ళి చకా చకా జరిగిపోయింది !

 

మా తల్లితండ్రులు " ఎంతో ప్రయత్నం వల్ల, మందుల వల్ల నయంకాని తీవ్రవ్యాధి ఆస్తమా ధ్యానం ద్వారా నయం అయ్యింది. కనుక నీ జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకూ మరి ప్రచారానికి అంకితం చేసావు. జన్మ జన్మల పుణ్యమ్ వల్ల ‘ పత్రీజీ ఆశీస్సులు ’ లభించాయి ; " అనూ " ను పెళ్ళి చేసుకో అన్నారు.

 

ఇక అనూ తల్లిదండ్రులు - " బుద్ధ భగవానుడి తరువాత మళ్ళీ అంతతి ధ్యాన భాగ్యాన్ని సులువుగా అందిస్తూ New Age Spiritual Scientists గా ప్రజలను తయారు చేస్తున్న బ్రహ్మర్షి పత్రీజీ ధన్యులు ! వారి PSSM లో ఒక Designer గా సేవలు చేస్తున్న శివరామ్ అల్లుడిగా దొరకడం మాకెంతో ఆనందదాయకం " అన్నారు నా గురించి ! మే 14 వతేదీ ఉదయం " బుద్ధపౌర్ణమి " రోజు బ్రహ్మర్షి పత్రీజీ దంపతుల ఆధ్వర్యంలో .. మా తల్లిదండ్రులు, అనూ తల్లిదండ్రుల సమక్షంలో .. జరిగిన మా పిరమిడ్ పెళ్ళి మా జీవితంలో మహాద్భుతమైన రోజు! మే 14వ తేదీ ఉదయం "బుద్ధపౌర్ణమి" రోజు బ్రహ్మర్షి పత్రీజీ దంపతుల ఆధ్వర్యంలో .. మా తల్లిదండ్రులు, అనూ తల్లిదండ్రుల సమక్షంలో .. జరిగిన మా పిరమిడ్ పెళ్ళి మా జీవితంలో మహాద్భుతమైన రోజు !

 

మా పిరమిడ్ పెళ్ళి జరిగి 10 రోజులయింది. మేం ‘ కళ్యాణ దంపతులం ’ - విశ్వ కళ్యాణంలో భాగంగా మా జీవితాలను Design చేసుకున్నాం. నిత్య ధ్యానసాధనతో ఆత్మానుభూతులు మాకు ఎన్నో ఉన్నాయి. అయితే " శరీరం - మనస్సు" అనే దృగ్విషయాలను వివాహం తర్వాత మరింతగా అనుభూతి చెందుతున్నాం. మనిషి జీవితంలో ‘ కళ్యాణం ’ అనేది ఆపై వైవాహిక జీవితం ఒక అందమైన పాఠశాల. మన శ్వాసతో మన కళ్యాణం అసలు సిసలైన కళ్యాణం. ఇదే నిత్య సత్యం. సర్వరోగ నివారిణి, సకల భోగకారిణి, నిత్య సత్యప్రదాయిని అయిన ధ్యాన మార్గం మనకు సర్వదా బోధిస్తున్న పత్రీజీకి మా నూతన దంపతుల శతకోటి పాదాభివందనాలు !

 

పిరమిడ్ వ్యాలీ యాజమాన్యానికీ, తోటి వాలంటీర్లందరికీ నా ధ్యానవందనాలు !

శివరామ్
పిరమిడ్ వ్యాలీ

బెంగళూరు
మీ అనూశివరామ్

081230 14220

Go to top