" 5 రోజులు - 50 గంటల అఖండ మౌనధ్యానం "

 

 

నా పేరు దుర్గారాణి. నేను 2002 సంవత్సరం నుంచి ధ్యానం .. ధ్యానప్రచారం చేస్తున్నాను. 2014 జూలై 1వ తేదీ నుంచి 5 వ తేదీ వరకు భీమవరం శ్రీ బాలజీ ధ్యానమందిరంలో నిర్వహించబడిన "5రోజులు - 50 గంటల మౌనం మరి స్వాధ్యాయ ధ్యానం" తరగతులకు నేను హాజరయ్యాను. వివిధ ప్రాంతాల నుంచి ఈ శిబిరంలో పాల్గొనడానికి విచ్చేసిన సుమారు 300 మంది పిరమిడ్ మాస్టర్లతో భీమవరం పిరమిడ్ మాస్టర్ తటవర్తి వీరరాఘవరావు, శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.

 

అయిదురోజుల పాటు పూర్తిగా ప్రాపంచిక జీవితాన్ని ప్రక్కకు పెట్టి .. మౌన, ధ్యాన, స్వాధ్యాయ సాధనకే పూర్తి సమయాన్ని కేటాయించడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది.

 


"అయిదు రోజుల అఖండ మౌన-స్వాధ్యాయ ధ్యానంలో నేను పాల్గొనగలనా?" అని మొదలు నాకు అనిపించింది కానీ .. అందులో పాల్గొన్న తరువాత గానీ అందులో ఉన్న గొప్పదనం నాకు అర్థం కాలేదు! మౌనం వల్ల ఎంత శక్తి మనలో జమ అవుతుందో చెప్పలేము. రోజుకు పదిగంటలపాటు ధ్యానం, స్వాధ్యాయం చెయ్యడం వల్ల నేను మరింత శక్తివంతంగా మారిన అనుభూతిని పొందాను. నా ఆలోచనల్లో మరింత స్పష్టత వచ్చింది! "ధ్యానులకు ప్రకృతి కూడా అనుకూలంగా మారుతుంది" అనడానికి నిదర్శనంగా .. శిబిరం మొదలైన మొదటి రోజు ఎండలకు ఉక్కపోతకు కొంచెం కష్టంగా అనిపించినా .. రెండవరోజు నుంచి వాతావరణంలో మార్పు వచ్చి .. చినుకులు కురిసి ఆహ్లాదంగా మారిపోయింది. తటవర్తి వీరరాఘవ రావు గారు మరి రాజ్యలక్ష్మి మేడమ్ చక్కటి సత్సంగం నిర్వహించి .. కర్మసిద్ధాంతం, ఊర్థ్వలోకాలూ, అధోలోకాలూ మరి రకరకాల ఆత్మస్థితుల గురించి వివరంగా తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు విరివిగా మరిన్ని ప్రదేశాల్లో జరగడం వల్ల మరింత మందికి లాభం చేకూరుతుందని ఆశిస్తూన్నాను.

 

 

 

దుర్గారాణి

భీమవరం
పశ్చిమగోదావరి జిల్లా

ఆంధ్రప్రదేశ్

Go to top