" ఈజిప్ట్ ధ్యాన యాత్రలో పిరమిడ్ మాస్టర్ల అనుభూతులు "

" రాములు " .. తాండూరు, రంగారెడ్డి జిల్లా

" జీవితంలో నటించి, నటించి అలసిపోయిన నేను ధ్యానం చేస్తూ మళ్ళీ నా క్రొత్త జీవితాన్ని పునరుద్ధరించుకుని ఈజిప్ట్ ధ్యానప్రచార యాత్రకు వెళ్ళాను. గ్రేట్ గిజా పిరమిడ్ సందర్శన నాకు అద్భుతమైన అనుభూతిని కలిగించింది "

 

" సత్యనారాయణ " .. భీమవరం

" ఈజిప్ట్ ధ్యాన యాత్ర నా జీవితంలో మరువని మధురానుభూతి, గ్రేట్ పిరమిడ్‌లో కింగ్స్ ఛాంబర్‌ పై ధ్యానం చెయ్యాలన్న నా చిరకాల వాంఛ ఈ రూపంలో తీరింది. ఇలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. "

 

" పాండురంగారావు " ..  ఏలూరు

" ప్రపంచ ఏడు వింతలలో ఒకటైన ఈజిప్ట్ పిరమిడ్‌ను చూడాలని చిన్నప్పటినుంచి కలలు కనేవాడిని. పత్రీజీతో కలిసి కింగ్స్ ఛాంబర్‌పై ధ్యానం చేయడం నా జన్మజన్మల అదృష్టం ! ఈజిప్ట్ నాగరికతకు మరి భారతదేశంలోని ప్రాచీన సింధు నాగరికతకు చాలా దగ్గరి సంబంధం వుందని మేము నైలు నదిలో నాలుగురోజులుపాటు క్రూజ్‌లో ప్రయాణం చేస్తూ మధ్య మధ్యలో వున్న ప్రాచీన పట్టణాలలోని కట్టడాలను చూసి తెలుసుకున్నాం. మళ్ళీ మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ ప్రయాణాన్ని చెయ్యాలని కోరుకుంటున్నాను "

 

 

" షీలా " .. బెంగళూరు

" ఈజిప్ట్ యాత్రలో నైలు నదిపై క్రూజ్‌లో నాలుగు రోజుల ప్రయాణం పరమాద్భుతం ! ఆ ప్రయాణం ఒకరోజు నాకు ఎసిడిటీ వల్ల భయంకరమైన కడుపునొప్పి వచ్చింది. అప్పుడు నేను శ్వాస మీద ధ్యాస వుంచి ధ్యానం చెయ్యగానే కొద్దిసేపట్లోనే నొప్పి తగ్గిపోయింది. "

 

" డా|| సందీప్ " .. జైపూర్, రాజస్థాన్

" నేను ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకుండానే అప్పటికప్పుడు అనుకుని ఈజిప్ట్ యాత్రకు బయలుదేరాను. పత్రీజీతో కలిసి కింగ్స్ ఛాంబ‍ర్‌లో ధ్యానం చేయడం మరపురాని మధురానుభూతి. ఈ యాత్రలో పాల్గొన్న వాళ్ళంతా కూడా ఇంతకు ముందు నాకు ఏమాత్రం పరిచయం లేనప్పటికీ ఒకే కుటుంబంలా కలిసిపోవడం వసుధైక కుటుంబ భావనను తెలియజేసింది. "

 

" రీటా నియతి " ..  జైపూర్, రాజస్థాన్

" ఐదు సంవత్సరాల క్రితం నేను మొట్టమొదటిసారి పత్రీజీ సమక్షంలో ధ్యానం చేసినప్పుడు ‘ పత్రీజీతో కలిసి ఈజిప్ట్ వెళ్ళి గిజా పిరమిడ్‍లోని కింగ్స్ ఛాంబర్‌‌లో ధ్యానం చెయ్యాలి ’ అని సంకల్పం చేసుకున్నాను. అది ఇన్ని రోజుల తర్వాత ఇలా తీరింది. ఒక బృందంలా వచ్చి ఇలా ధ్యానం చేసుకోవడం స్వంత కుటుంబంలా వాళ్ళందరితో కలిసి క్రొత్త ప్రదేశంలో వుండడం ఒక గొప్ప అనుభవం!"

 

" ధర్మేష్ జీ " .. సోనిపత్

" పత్రీజీతో కలిసి గిజా పిరమిడ్‌లో ధ్యానం, నైలు నది మీద క్రూజ్‌లో ప్రయాణం చేయడం నా అదృష్టం. ఎడారి మధ్యలో నది నదికి ఇరుప్రక్కల పచ్చటి పొలాలు, అసలు ఎవ్వరు ఊహించలేనటువంటి భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించే ప్రకృతి సౌందర్యం మాటలకు అందనిది."

 

" సుజన " .. పూనె

" పిరమిడ్ మాస్టర్ల బృందంతో కలిసి ఈజిప్ట్ ధ్యాన యాత్ర చేయడం, నైలునదిపై నాలుగురోజుల ప్రయాణం అత్యద్భుతం. "

 

" మాధవన్ " .. చెన్నై

" ఈజిప్ట్ ధ్యాన యాత్ర పిరమిడ్ ధ్యానులందరూ చేసి తీరవలసిందే ! కళ్ళారా గిజా పిరమిడ్ అందాలను చూసి కింగ్స్ ఛాంబర్‌లో పత్రీజీ సమక్షంలో వారి వేణునాదంలో ధ్యానం చెయ్యవలిసిందే ! అప్పుడే ప్రతి ఒక్కరి జన్మలు ధన్యం అవుతాయి. "

 

" శైలజ,మంజునాథ శెట్టి " .. కొళ్ళెగాల

" ఈజిప్ట్ ధ్యాన యాత్రలో నాలుగురోజుల పాటు నైలు నదిపై క్రూజ్ ప్రయాణంలో మేము నైలు నది పరివాహక ప్రాంతంలోని వేల సంవత్సరాల నాగరికత అధ్యయనం చేశాం. పత్రీజీతో కలిసి కింగ్స్ ఛాంబర్‌లో ధ్యానం మధురానుభూతిని మిగిల్చింది. "

 

" శ్రేయస్, రష్మి " ..  పుంగనూరు

" ఈజిప్ట్ ధ్యానయాత్ర మా మొదటి విదేశీ ప్రయాణం. అడగడుగునా అద్భుతమైన ఎడారి అందాలనూ, ప్రాచీన ఈజిప్ట్ కళావైభవాన్నీ తిలకిస్తూ .. గ్రేట్ గిజా పిరమిడ్ శక్తిని పొందుతూ ఈ యాత్ర ఆద్యంతం ఉత్కంఠభరితంగా మా యాత్ర సాగింది. "

 

" డా|| సంగీత జీ " .. చంఢీఘర్

" ఈజిప్ట్ ప్రజల నాగరికతను మరి భారత నాగరికతను పోల్చి చూసుకని ‘ విశ్వమంతా ఒక్కటే ’ అన్న భావానికి అర్థం తెలుసుకున్నాను. నైలునదీ పరివాహిక ప్రాంతంలోని దేవాలయాలు చిత్రకళ ప్రాచీన హిందూ కళా సృష్టిని ప్రతిబింబించాయి. మళ్ళీ మళ్ళీ ప్రతి ఒక్కరు చూసి తీరవలసిన గొప్ప కట్టడాలు గ్రేట్ పిరమిడ్ సముదాయం."

 

" దేవిక " ..  బెంగళూరు

" నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ఈజిప్ట్ యాత్రలో మేము నైలు నది పై క్రూజ్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు ధ్యానం చేసి నీటి యొక్క శుద్ధ ధ్వనిని ఆనందించాను. "

Go to top