సర్వరోగాల నుంచి బయటపడ్డాను

 

 

నా పేరు లక్ష్మీకాంతం. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా పనిచేసి .. అనేకానేక అనారోగ్య కారణాల వలన తప్పనిసరి పరిస్థితుల్లో 2010 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ పొందాను. గత ఇరవై సంవత్సరాలుగా పక్షపాతం, బి.పి., షుగర్, హెర్నియా, గుండెకు రెండు స్టంట్‌లతో ఆపరేషన్, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్‌లతో కూడిన న్యూరో సమస్యలతో బాధపడుతూ కొన్ని లక్షల రూపాయలు వైద్యంకోసం ఖర్చు చేశాను. మెదక్‌లో స్వచ్ఛందంగా పదవీ విరమణ పొందాక .. లేవలేని పరిస్థితుల్లో వైద్యంకోసం హైదరాబాద్ చేరుకున్నాం.

 

ఈ క్రమంలో అంతవరకు రెండుసార్లు ఆపరేషన్లు చేసి స్టంట్‌లు అమర్చుకున్న నా గుండె మళ్ళీ క్రొత్త సమస్యకు  గురికావడంతో మూడవసారి స్టంటు వేయాలన్నారు. అందుకు ముగ్గురు డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కనుక లక్షల రూపాయలు సిద్ధం చేసుకొమ్మని చెప్పారు. దీనికి తోడు హెర్నియా సమస్య కూడా సీరియస్ అయ్యింది.

 

ఏమీ పాలుపోని స్థితిలో నా భార్య "చంద్రకళ" బాధపడుతూంటే వాళ్ళ అక్కయ్య ఆమెకు "పిరమిడ్ ధ్యానం" గురించి చెప్పి ధ్యానం క్లాసుకు తీసుకుని వెళ్ళింది. ఇక ఇంటికి వచ్చిన నా భార్య నాతో కూడా ధ్యానం చేయించడం మొదలుపెట్టింది. "ధ్యానంలోనే అన్ని జబ్బులు నయం అవుతాయి; ఏ ఆపరేషన్ లేకుండా హాయిగా ఉండవచ్చు" అన్న నమ్మకంతో నేను ధ్యానశక్తిని నమ్ముకుని రోజుకు అయిదు గంటలు చొప్పున ధ్యానం చేస్తూండేవాడిని.

 

క్రమక్రమంగా నా ఆరోగ్యంలో చక్కటి మార్పు రాసాగింది! అంతకుముందు పక్షవాతంతో ప్రభావితమైన భాగాలతో సహా నా శరీరంలోని అన్ని అవయవాలు స్వస్థత చెందుతూ ఏ మందులూ వాడనవసరం లేకుండానే నేను నా మునుపటి ఆరోగ్యాన్ని పొందాను!

 

కడ్తాల్ .. "కైలాసపురి"లో .. జరిగిన 2011 సంవత్సరం మరి 2013 సంవత్సరం ధ్యానమహాచక్రాలలో జరిగిన పత్రీజీ ప్రాతఃకాల ధ్యానాలలో .. మరి ఆ ప్రాంగణంలో బాలకృష్ణగారు ఏర్పాటు చేసిన "ఆస్ట్రల్ సర్జరీస్" వర్క్‌షాపుల్లో పాల్గొని శక్తిపాత అనుభూతితో మరింత స్వస్థతను పొందాను.

 

ప్రస్తుతం నేను అన్ని అనారోగ్య సమస్యల నుంచి విముక్తుడనై రోజుకు అయిదు గంటల చొప్పున ధ్యానం చేసుకుంటూ మా కుటుంబ సభ్యులతో కలిసి మా ఇంట్లోనే ధ్యాన శిక్షణా తరగతులను ఏర్పాటు చేసి చుట్టుప్రక్కల వాళ్ళకు ధ్యానం నేర్పిస్తున్నాను.

 

నవీనయుగ ఆధ్యాత్మికతకు చెందిన గ్రంథాలతో చిన్న గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకుని .. ధ్యానంతో పాటు, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యాలతో మా ఇంటిని అద్భుతమైన ధ్యానమందిరంలా మార్చుకున్నాము. శాకాహార ర్యాలీలు, మాస్టర్స్‌తో క్లాసులు నిర్వహిస్తూ .. హాయిగా, ఆనందంగా జీవిస్తూన్న మేము మాకు ఇంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పత్రీజీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం!

 

 

లంకా లక్ష్మీకాంతం
హైదరాబాద్

సెల్ : +91 9247779622

Go to top